బ్రిటీష్ లగ్జరీ(luxury) కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ DBX707 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ ఎస్యూవీ కారుగా నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్టిన్ మార్టిన్ DBX707 ఉత్పత్తి 2022 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది. రెండో త్రైమాసికంలో వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ లగ్జరీ ఎస్యూవీ(SUV) కారు విలువ 2,32,000 డాలర్లుగా (సుమారు రూ. 1.7 కోట్లు) ఉండనుంది. ఈ ఎస్యూవీ లాంచ్ అయిన తర్వాత పోర్ష్ సైయనీ టర్బో జీటీ, లంబోర్ఘిని ఉరస్ వంటి ప్రముఖ ఎస్యూవీ కార్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
సరికొత్త అల్ట్రా హై పర్ఫార్మెన్స్ ఎస్యూవీ ఆస్టర్ మార్టిన్ కారును స్టాండర్డ్ డీబీఎక్స్ వేరియంట్ ఆధారంగా రూపొందించింది. అయితే దీని పనితీరు స్టాండర్డ్ వెర్షన్ కంటే మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా, ఆస్టన్ మార్టిన్ 2022 డీబీఎక్స్ను భారీ మార్పులతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
దీనిలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త సెట్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ రీపొజిషన్ వంటి ఫీచర్లను చేర్చింది. కారు లాంచింగ్‌పై ఆస్టన్ మార్టిన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టోబియాస్ మోయర్స్ మాట్లాడుతూ “ఆస్టన్ మార్టిన్ DBX707 ఎస్యూవీ డైనమిక్ డిజైన్‌తో వస్తుంది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర అన్ని ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. డిజైన్, పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా దీన్ని రూపొందించాం. ఈ రకమైన వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత ఆకర్షణీయమైన కారు మార్కెట్లోనే లేదు.”అని అన్నారు.
గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం..
ఇక, కారు ఇంజిన్ విషయానికి వస్తే.. దీనిలో 4.0 -లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్‌ను చేర్చనుంది. ఇది బాల్-బేరింగ్ టర్బోచార్జర్‌లను కలిగి ఉంటుంది. మరింత పవర్, టార్క్‌ను విడుదల చేయడానికి స్పోక్ ఇంజిన్ కాలిబ్రేషన్‌ను కూడా చేర్చింది. ఇంజిన్ 9- స్పీడ్ 'వెట్ క్లచ్' ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది. దీనిలోని ఇంజిన్ 157PS వద్ద 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 707PS వద్ద 900Nm అవుట్‌పుట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా 290 kmph వేగంతో ప్రయాణించగలదు.
ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ రెండు మోడ్లలోనూ అందుబాటులో ఉంటుంది. ఇది స్మార్ట్ ఆటోమేటిక్ ఆల్ వీట్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్తో వస్తుంది. దీని ముందు చక్రాలకు వెనుక చక్రాలకు అవసరమైనప్పుడు పవర్ని పంపుతుంది. రైడ్ నాణ్యతను సౌకర్యవంతంగా చేయడానికి దీనిలో అప్డేటెడ్ ఎయిర్ సస్పెన్షన్ను కూడా చేర్చింది. ఇందులోని తక్కువ బాడీ రోల్ కోసం రివైజ్డ్ డంపర్లు, స్పింగ్లను అందించింది. ఈ కారు ఎలక్ట్రానిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ సిస్టమ్తో కూడా వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.