హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aston Martin DBX707: ఇండియాలో లగ్జరీ కారు ‘ఆస్టన్ మార్టిన్ DBX707’ లాంచ్.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Aston Martin DBX707: ఇండియాలో లగ్జరీ కారు ‘ఆస్టన్ మార్టిన్ DBX707’ లాంచ్.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ నుంచి ఇండియాలో సరికొత్త ప్రీమియం కారు రిలీజ్ అయింది. ఇండియాలో టాప్ ఎండ్ కార్ మార్కెట్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా సరికొత్త, అత్యంత సంపన్నమైన ‘ఆస్టిన్ మార్టిన్ DBX707’ (Aston Martin DBX707) మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ నుంచి ఇండియాలో సరికొత్త ప్రీమియం కారు రిలీజ్ అయింది. ఇండియాలో టాప్ ఎండ్ కార్ మార్కెట్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా సరికొత్త, అత్యంత సంపన్నమైన ‘ఆస్టిన్ మార్టిన్ DBX707’ (Aston Martin DBX707) మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ధర ఏకంగా రూ.4.63 కోట్లు కావడం విశేషం. DBX రెగ్యులర్ వెర్షన్ కంటే దీని ధర రూ. 48 లక్షలు ఎక్కువ. తమ బ్రాండ్ లైనప్‌లో ఇండియాలో రిలీజ్ అయిన అత్యంత ప్రీమియం కారు ఇదేనని కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త SUV స్పెసిఫికేషన్లు చూద్దాం.

ప్రీమియం, లగ్జరీ లుక్

బ్రిటీష్ అల్ట్రా లగ్జరీ ఆటోమేకర్ ఆస్టిన్ మార్టిన్ డిజైన్ చేసిన DBX707 కారు.. పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో పాటు కొత్త ఫ్రంట్ స్ప్లిటర్‌తో కనిపిస్తుంది. కొత్త ఎయిర్ ఇన్‌టేక్, బ్రేక్ కూలింగ్ డక్ట్స్ వంటివి ఈ ఎస్‌యూవీ హైలెట్స్. DBX707 ఇంటీరియర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. దీని లోపలి భాగంలో సెమీ అనిలిన్ లెదర్ అప్హోల్స్టరీ, స్పోర్ట్ క్విల్టింగ్‌తో కూడిన కార్పెట్లు ఉన్నాయి. పెర్ఫొరేషన్ సీట్లు, స్ప్లిట్- రిమ్ స్టీరింగ్ వీల్, లెదర్ హెడ్‌లైనింగ్ వంటివన్నీ ప్రీమియం లుక్‌, లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచుతాయి.

స్పెషల్ డ్రైవింగ్ మోడ్స్

ఈ SUV కొత్తగా కాన్ఫిగర్ చేసిన ఐదు డ్రైవ్ మోడ్స్‌తో వస్తుంది. వీటిలో ఒకదాన్ని ప్రత్యేకంగా DBX707 కోసం రూపొందించారు. ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కోసం 'టెర్రైన్' మోడ్, మంచి టూరింగ్ కంఫర్ట్ కోసం 'GT' సెట్టింగ్, రెస్పాన్సివ్ రోడ్ డ్రైవింగ్ కోసం 'స్పోర్ట్' మోడ్, సస్పెన్షన్‌, స్టీరింగ్, ఎగ్జాస్ట్ వంటి అన్ని అంశాల్లో సొంత ప్రాధాన్యతను కలిగి ఉండటానికి ఇష్టపడే కస్టమర్ల కోసం 'ఇండివిజువల్' మోడ్ ఉంటాయి. అయితే DBX707 మోడల్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ‘స్పోర్ట్+’ మోడ్.. ఈ కారుకే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది డ్రైవర్లకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే సెట్టింగ్‌ అని కంపెనీ వెల్లడించింది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఆస్టిన్ మార్టిన్ కంపెనీ ఈ కారును స్పెషల్ ఫీచర్లతో డిజైన్ చేసింది. దీని ట్విన్-టర్బో 4.0 లీటర్ V8 ఇంజిన్ ఊహకు మించిన పర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని లగ్జరీ SUVల కంటే ఇదే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కావడం విశేషం. ఇది 707 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 900 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 9-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చిన DBX707 కారు వెట్ క్లచ్‌ను ఉపయోగిస్తూ.. 30 శాతం వేగవంతమైన గేర్ షిఫ్ట్స్ అందిస్తుంది.ఈ ప్రత్యేకతలతో కేవలం 3.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదు. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కారు.. లంబోర్ఘిని ఉరస్, ఫెరారీ పురోసాంగ్యూ, రోల్స్ రాయిస్ కల్లినన్, బెంట్లీ బెంటెగా వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR

ఉత్తమ కథలు