ఇంటిని కూడా ప్రకృతిగా మరిపించేలాగ మార్చే సరికొత్త అలంకరణ

ఇంటిని కూడా ప్రకృతిగా మరిపించేలాగ మార్చే సరికొత్త అలంకరణ

Home Decoration: ప్రకృతితో మమేకమవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిపుణుల సలహలు పాటించడం ఎంతో ఉపయొగకరం అవుతుంది.

 • Share this:
  ప్రకృతితో మమేకమవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిపుణుల సలహలు పాటించడం ఎంతో ఉపయొగకరం అవుతుంది. మీకు సక్యూలెంట్స్ వంటి మొక్కలు కావాలనుకున్నప్పటికీ కూడా ఆర్కిడ్స్, పాటెడ్ ఫిడిల్ లీఫ్ ఫిగ్ లేదా ఫెర్న్స్ వంటి మొక్కలే ఇంటికి ఎక్కువ అలంకారాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామంది రిమోట్ పని విధానానికి అలవాటు పడి తమ విధులను కంప్యూటర్ల ద్వారా ఇంటినుండే నిర్వర్తిస్తున్నాము. మనలో చాలామంది ఆరుబయట ప్రకాశవంతమైన రంగురంగులతో కూడిన మొక్కలను పెంచుకోవాలని కోరుకుంటాం. ప్రస్తుతం బ్రౌన్ మరియు ఆకుపచ్చ రంగులు గార్డెన్ అలంకరణలో అగ్రస్థానంలో ఉండగా వాటిని మీకు నచ్చిన విధంగా ఎలా అమర్చాలని తికమక పడుతుంటారు. ప్రకృతిని అలవరచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిపుణుల సలహలు పాటించడం ఎంతో మేలవుతుంది. మీరు సక్యూలెంట్స్ వంటి మొక్కలు కావాలనుకున్నప్పటికీ కూడా ఆర్కిడ్స్, పాటెడ్ ఫిడిల్ లీఫ్ ఫిగ్ లేదా ఫెర్న్స్ వంటి మొక్కలే ఇంటికి ఎక్కువ అలంకారాన్ని చేకూరుస్తాయి అని నిపుణులు తెలుపుతున్నారు. ప్రకృతిని తలదన్నేలా అలంకరించిన ఈ వసారా చూస్తే మీకు ఎంతో ప్రశాంతమైన, తాజా అనుభూతిని కలిగిస్తుంది.

  పడక గది:
  మీ ఇంటిలోని ఇతర గదుల మాదిరిగా పడక గదిని అలంకరించకపోయినప్పటికీ మీరు ప్రశాంతంగా, ఆహ్లదంగా ఉంటూ మనశ్శాంతిని పొందడంలో పడకగది కీలకమైనది. Beautiful Homes Service, Asian Paints vaari నిపుణుల బృందం కలిసి నిర్మించిన ఆధునిక పడకగదులు చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో కూడిన గదులను ఎంతో అందంగా, రమ్యంగా ఒక క్రమపద్దతిలో నిర్మిస్తారు.

  విలాసవంతమైన పడకలు, గోడలకు రంగులరంగు చుక్కలతో వేసిన చూడచక్కని దృశ్యాలు, పడక దీపాలతో ఎంతో అందంగా ఉంటాయి దీనికి సౌకర్యవంతమైన కుర్చీలు మరింత అందాన్ని చేకూరుస్తాయి.హడావుడి జీవితంలో అలసిపొయిన మనుషులకు అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభవానికి మించినది ఈ ప్రపంచంలో మరొకటి ఏముంటుంది.

  వరండా:
  మీకు విశాలమైన వరండా ఉందా లేదా చిన్న స్థలం ఉందా అనేది ముఖ్యం కాదు, కాని మీకున్న స్థలాన్ని ఎంత సృజనాత్మకంగా, ఎంత అందంగా అలంకరిచారు అనేదే ముఖ్యం. స్నేహితుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక కప్పు కాఫీ తాగడానికి లేదా ధ్యానం చేయడానికి అనువైన ప్రదేశంగా మీ వరండాను పచ్చదనంతో, సహజమైన ప్రకృతి వనంగా మార్చడానికి Beautiful Homes Service నిపుణుల బృందం ప్రయత్నిస్తుంది.
  Beautiful Homes Service, Asian Paints, Bed Room, all white makeover, beautiful home, Home Decoration బ్యూటీఫుల్ హోమ్ సర్వీసెస్, ఏసియన్ పెయింట్స్, ఆసియన్ పెయింట్స్, బెడ్ రూమ్, ఆల్ వైట్ మేకోవర్,

  ఇనుము, కలప కలయికతో చేసిన అందమైన ఆకృతులు ఇంటికి మరింత అలంకరణలను జోడిస్తాయి.అలాగే పుస్తకప్రియుల కోసం వరండాలో కూర్చొని చదువుకోవడానికి సౌకర్యంగా ఉండే విధంగా మెత్తని కుషన్లతో కూడిన కుర్చీలను అమరుస్తారు. మనకున్న స్థలంలో పుష్కలమైన సూర్యరశ్మిని పొందుతూ పూలు, ఫర్న్స్ మరియు క్రోటాన్ మొక్కలను పెంచడంలోనే మన వ్యూహాత్మకత అర్థమవుతుంది. ఈ విధంగా చేయడంవలన ఒక కుటుంబం తమ ఇంటినుండి బయటికి వెళ్ళకుండానే మంచి మినీ గార్డెన్ను ఆస్వాదించగలదు. ఇలాంటి గార్డెన్ లో మీరు కూర్చున్నప్పుడు ప్రకృతితో జీవిస్తున్న అనుభవం కలుగుతుంది. అయినా

  అంతకుమించి ఈ భవనాల మధ్య మీరు ఇంకేమి ఆశించగలరు?
  ఈ విధమైన కోరికలు మీలో కలిగి, మీకు కూడ ఇలాంటి ఆలోచనలు ప్రేరేపించినట్లయితే వాటిని అమలు చేయడానికి మీకు సహాయం కావాలి అనుకుంటే పరిష్కారం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా Beautiful Homes Service లోని నిపుణులనులకు మీ ఆలోచన గురించి వారికి ప్రాథమిక అవగాహనను తెలియజేయడమే. మీ అలోచనలతో ఏకీభవిస్తూ వ్యక్తిగత ఇంటీరియర్ డిజైన్ నుండి ప్రొఫెషనల్ ఎగ్జిక్యూషన్ వరకు ప్రతి విషయంలో నిపుణుల బృందం మీకు తమ సేవలను అందిస్తారు. కస్టమర్ అనుభవంలో ప్రత్యేక అవగాహన కలిగిన నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజర్ కలిసి వారు చేసిన ప్రణాళిక అభివృద్ధిని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తారు.

  అంతేకాకుండా, నిపుణులతో కలిసి పనిచేయడం అంటే మీరు, మీ కుటుంబం,మీ ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితమనే చెప్పవచ్చు. ఇంటి పనులు పూర్తయిన తరువాత, వారు చేసిన పనిని తనిఖీ చేయడానికి, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి నిపుణుల బృందం మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ యొక్క వివరణాత్మక అవగాహన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఇది భాగస్వామ్య పోస్ట్.
  Published by:Sumanth Kanukula
  First published: