Ashok Leyland: కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా అశోక్ లేలాండ్.... రూ.1 లక్ష ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం

Ashok Leyland: కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా అశోక్ లేలాండ్... రూ.1 లక్ష ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం (ప్రతీకాత్మక చిత్రం)

Ashok Leyland | ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. ఛానెల్ పార్ట్‌నర్స్ ఉద్యోగులకు రూ.1,00,000 ఆరోగ్య బీమా ప్రకటించింది.

  • Share this:
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదటి వేవ్​తో పోల్చితే సెకండ్​ వేవ్​ తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కమర్షియల్​ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. వారికి రూ.1 లక్ష విలువ చేసే ఉచిత మెడికల్​ ఇన్సూరెన్స్​ కల్పిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం కారణంగా అశోక్​ లేలాండ్​లో పనిచేసే 15,000 నుంచి 20,000 మంది ఉద్యోగులు, సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కింద ఆరు నెలల పాటు జీతం కొనసాగిస్తామని పేర్కొంది. కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికే చాలా మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ అమలు చేస్తున్నట్లు గుర్తుచేసింది.

Jio: తెలుగు రాష్ట్రాల్లోని జియో యూజర్లకు శుభవార్త... ఇక డబుల్ స్పీడ్‌తో డేటా

Jio Plans: జియో ఫోన్ వాడుతున్నారా? రూ.39 నుంచి లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

దీనిపై అశోక్ లేలాండ్ CEO విపిన్ సోంధి మాట్లాడుతూ “మా సంస్థ ఎప్పుడూ ఉద్యోగులను కుటుంబంగా పరిగణిస్తుంది. వారి ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు మాకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యం. ఈ కఠినమైన సమయాల్లో వారికి అండగా నిలిచేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ అమలు చేయడం. ఒకవేళ కరోనా బారీన పడితే డాక్టర్లచే టెలికాన్ఫరెన్స్​లు నిర్వహించి వారి వ్యాధి నయమయ్యేలా సలహాలు, సూచనలు అందించడం. కరోనా వైద్య చికిత్స కోసం రూ. 1 లక్ష జీవిత బీమా కవరేజిని ఉచితంగా అందించాలని నిర్ణయించాం” అని వివరించారు.

Gold: తక్కువ ధరకే గోల్డ్ కొనండి ఇలా... ఇంకొన్ని గంటలే అవకాశం

EPFO Insurance: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలంటే

ఉద్యోగుల కోసం టీకా డ్రైవ్​


ఉద్యోగులందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అశోక్​ లేలాండ్​ తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగులకు, కుటుంబ సభ్యుల కోసం సొంతగా టీకా డ్రైవ్ చేపట్టింది. ఇప్పటికే, 45- ఏళ్ల వయస్సు పైబడిన 75 శాతం మంది ఉద్యోగులకు టీకాలు వేసినట్లు, ఇక 45 ఏళ్లలోపు వారిలో25 శాతం మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో దేశీయ మరో దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా​ కూడా తమ ఉద్యోగులకు ఇటువంటి సహాయాన్నే ప్రకటించింది. కంపెనీలోని ఉద్యోగి మరణిస్తే రాబోయే ఐదేళ్ల వేతనాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడంతో పాటు హెల్త్​ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.
Published by:Santhosh Kumar S
First published: