హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ashok Leyland: బిజినెస్ వెహికిల్ కావాలా..అయితే BADA DOST మీకోసం..నెలకు 10 వేలు ఉంటే చాలు..మీ సొంతం...

Ashok Leyland: బిజినెస్ వెహికిల్ కావాలా..అయితే BADA DOST మీకోసం..నెలకు 10 వేలు ఉంటే చాలు..మీ సొంతం...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

లైట్ కమర్షియల్ వెహికల్స్(ఎల్సీవీ) ను ఉత్పత్తి చేస్తూ అధిక విక్రయాలు అందుకుంటోన్న వాహన సంస్థ అశోక్ లేలాండ్. తాజాగా ఈ కంపెనీ నుంచి సరికొత్త ఎల్సీవీ భారత మార్కెట్లో విడుదలైంది. అదే బడా దోస్త్. ముంబయి ఎక్స్ షోరూంలో ఈ ట్రాలీ వాహనం ధర వచ్చేసి రూ. 7.75 లక్షల నుంచి 7.95 లక్షల వరకు ఉంది.

ఇంకా చదవండి ...

లైట్ కమర్షియల్ వెహికల్స్(ఎల్సీవీ) ను ఉత్పత్తి చేస్తూ అధిక విక్రయాలు అందుకుంటోన్న వాహన సంస్థ అశోక్ లేలాండ్. తాజాగా ఈ కంపెనీ నుంచి సరికొత్త ఎల్సీవీ భారత మార్కెట్లో విడుదలైంది. అదే బడా దోస్త్. ముంబయి ఎక్స్ షోరూంలో ఈ ట్రాలీ వాహనం ధర వచ్చేసి రూ. 7.75 లక్షల నుంచి 7.95 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా కస్టమర్ సెంట్రిక్ ఆఫరింగ్స్ సాంకేతికత ద్వారా డ్రైవర్ కు మరింత కంఫర్ట్ గా ఉంటుంది. ఐ4, ఐ3 అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహన ధర వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంది.

వేరియంట్ల వారీగా ధర..

ఐ3 ఎల్ఎస్ వేరియంట్ ధర................ రూ.7.75 లక్షలు

ఐ3 ఎల్ఎక్స్ వేరియంట్ ధర................ రూ.7.95 లక్షలు

ఐ4 ఎల్ఎస్ వేరియంట్ ధర................. రూ.7.79 లక్షలు

ఐ6 ఎల్ఎక్స్ వేరియంట్ ధర................. రూ.7.99 లక్షలు

7 రాష్ట్రాల్లో లాంచ్..

ఈ వాణిజ్య వాహనంలో వేరియంట్ల వారీగా విభిన్నంగా ఉంది. ఐ4 మోడల్ 1860 కేజీల పేలోడ్ ను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐ3 వేరియంటైతే 1404 కేజీల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆరంభంలో ఈ బడా దోస్త్ ను 7 రాష్ట్రాల్లో లాంచ్ చేసింది. వచ్చే మూడు నెలల్లో క్రమంగా దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫిజికల్ గా లేదా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా డెలివరీలు అందజేయనుందీ సంస్థ. అతి తక్కువగా రూ. 10,195  EMI per month కు ఇది సులభవాయిదాల్లో లభిస్తోంది. అలాగే డౌన్ పేమెంట్ కింద 72 వేలు చెల్లిస్తే చాలు వాహనం మీసొంతం అవుతుంది.

ప్రత్యేకతలు..

ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చొనే సౌలభ్యమున్న ఈ వాహనంలో హ్యాండ్ బ్రేక్ ప్రత్యేకంగా అమర్చారు. అంతేకాకుండా డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డు, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్ల వల్ల ప్రీమియం కారు అనుభూతిని కలిగిస్తుంది. వీటితో పాటు పవర్ స్టీరింగ్, వినియోగదారుల అభిరుచిమేరకు ఏసీ సదుపాయాన్ని కూడా పొందుపరిచారు.

టాప్-10 చోటు దక్కించుకుంటాం..

తమ విజన్ ద్వారా గ్లోబల్ సీవీ మార్కెట్లో టాప్-10లో చోటు దక్కించేందుకు ఈ రోజు తమకు మైలురాయి వంటిదని అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఎల్సీవీ ప్లాట్ ఫామ్ లో కీలక పాత్ర పోషింస్తుందని ఆయన అన్నారు. ఐ3, ఐ4 వేరియంట్లలో లభ్యమయ్యే ఈ బడా దోస్త్ ఎల్సీవీ వాహనాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఎల్సీవీ విభాగంలో ప్రస్తుతం వేగంగా వృద్ది చెందుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 40 శాతం విక్రయాలు సాధిస్తామని అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ విపిన్ సింధి తెలిపారు.

ఈ కొత్త ఎల్సీవీ ప్లాట్ ఫామ్ లో మేడిన్ ఇండియాగా తయారు చేశామని, పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఎగుమతుల ద్వారా మేడిన్ ఫర్ ది వరల్డ్ గా గుర్తింపుతెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ నూతన ప్లాట్ ఫామ్ లో ప్రతి 4 నెలలకు ఓ వాహనం విడుదల చేస్తామని అన్నారు.

First published:

Tags: Automobiles, Cars

ఉత్తమ కథలు