గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఆటో మొబైల్ రంగం.. అశోక్ లేలాండ్ పరిస్థితి మరీ ఘోరం..

Automobile Sector | Ashok Leyland | కంపెనీ గత ఏడాది జూలై నెలలో 15,199 యూనిట్లు అమ్మగా.. ఈ సారి 10,927 యూనిట్లు మాత్రమే అమ్మింది. అంటే.. 28 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 12:40 PM IST
గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఆటో మొబైల్ రంగం.. అశోక్ లేలాండ్ పరిస్థితి మరీ ఘోరం..
గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగం
  • Share this:
ఎప్పుడూ లేని విధంగా భారతీయ ఆటోమొబైల్ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాది దగద్దయమానంగా వెలుగొందిన ఈ రంగం ఇప్పుడు చతికిలపడింది. ఈ ఏడాది జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్రంగా నష్టపోయాయి. 2017 డిసెంబరులో కొత్త రికార్డులు నమోదైన తర్వాత కంపెనీల అంచనాలు భారీగా తప్పాయి. ఊహించని విధంగా దాదాపు 30 శాతం నష్టాలను చవిచూశాయి. ఈ ఏడాది జాతీయ ఈక్విటీ మార్కెట్‌ ఇండెక్స్‌ల వద్ద అన్నీ రంగాలకంటే ఆటోమొబైల్‌ రంగం అత్యుల్ప ప్రదర్శనను కనపరిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ రంగం ఏ స్థాయిలో ఉందో. గత ఏడాది మార్కెట్లలో కార్ల అమ్మకంలో ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండింది. అయితే బ్యాంకింగ్‌ రంగంలో నగదు కొరత ఏర్పడటంతో కార్ల అమ్మకాలు మందగించాయి.

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను ఏలుతున్న మారుతి సుజూకీ ఇండియా లిమిటెడ్‌, హీరో మోటోకార్ప్‌ లిమిటెడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ కూడా నష్టాలను చవి చూశాయి. ఇక, ఆశోక్ లేలాండ్ విషయానికి వస్తే.. జూలైలో దారుణ పరిస్థితి ఎదుర్కొన్నది. కంపెనీ వాహనాల అమ్మకాల్లో 52 వారాల్లో అత్యల్ప అమ్మకాలు నమోదు చేసిన నెలగా జూలై రికార్డు నెలకొల్పింది. దీని ప్రభావం షేర్లపై బాగా పడింది. ఈ రోజు ఉదయం అశోక్ లేలాండ్ షేర్ విలువ 8.7 శాతం పడిపోయి రూ.63.90 వద్దకు చేరింది. ఆ కంపెనీ గత ఏడాది జూలై నెలలో 15,199 యూనిట్లు అమ్మగా.. ఈ సారి 10,927 యూనిట్లు మాత్రమే అమ్మింది. అంటే.. 28 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>