వినియోగదారుల క్రెడిట్ కార్డు(Credit Cards),డెబిట్ కార్డుల(Debit Cards) వివరాలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లీక్ అవుతున్న ఘటనలు తలెత్తుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మర్చంట్ సైట్లకు టోకెనైజేషన్‌ను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ఇక సేవ్ కావు. 2022 జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. “కార్డు లావాదేవీలు, పేమెంట్ చైన్లలో కార్డుల వివరాలు నిల్వ చేయకూడదు. కార్జులు జారీ చేసే వారు లేదా కార్డు నెట్‌వర్క్‌లకు మినహాయింపు ఉంటుంది. ఇది 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది” అని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
టోకెనైజేషన్ అంటే ఏంటి..
సెన్సిటివ్ డేటాను నాన్-సెన్సిటివ్ డేటాగా మార్చే ప్రక్రియను టోకెన్స్ అంటారు. యూజర్ల క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల 16 అంకెల డిజిటల్ అకౌంట్‌ను.. డిజిటల్ క్రెడెన్షియల్గా టోకెన్ మార్చేస్తుంది. దీని ద్వారా కస్టమర్ల కార్డు డేటా మర్చంట్ పేమెంట్ సిస్టమ్‌లో సేవ్ అయి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. డేటా బ్రీచ్‌లు జరిగిన సమయంలో పేమెంట్ టోకెన్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
అయితే సందర్భాల్లో పాన్ కార్డుకు అనుసంధానం చేయడం వల్ల యూజర్ల అకౌంట్లలో డబ్బు సేఫ్‌గా ఉంది. అయితే కార్డు వివరాలు లీకవుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో ఆర్బీఐ టోకెనైజేషన్‌పై కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఒకవేళ వినియోగదారుడు కార్డు డేటా సేవ్ చేసుకోవాలనుకుంటే.. ఎడిషన్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పకుండా ఉండాలని వెల్లడించింది.
కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
ప్రస్తుతం దాదాపు అన్ని మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లు కార్డు వివరాలు సేవ్ చేసుకుంటున్నాయి. షాపింగ్ చేసే సమయంలో ప్రతీసారి క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు వివరాలు పూర్తిగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఓటీపీతోనే పని అయిపోతోంది. టోకెనైజేషన్ రద్దయితే ట్రాన్సాక్షన్ చేయాల్సిన ప్రతీసారి కస్టమర్లు 16 అంకెల కార్డు నంబర్, కార్డు ఎక్స్పైరీ, సీవీ టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆన్లైన్ షాపింగ్ మరింత సెక్యూర్‌గా మారుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
వెబ్సైట్లు, ప్లాట్‌ఫామ్‌లు హ్యాకింగ్‌కు గురైన కస్టమర్ల కార్డు వివరాలు సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లకుండా ఉంటాయని అంటున్నారు. కార్డు వివరాలు సేవ్ కాకుండా.. వన్‌క్లిక్ పర్చేజెస్ ఫీచర్ లేకపోతే కస్టమర్లు కార్డు పేమెంట్స్‌పై ఆసక్తి కోల్పోతారేమోనని మర్చంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లు వివరాలు సేఫ్‌గా ఉండేలా అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. అయితే ఆర్బీఐ మాత్రం ఆ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. టోకెనైజేషన్ కట్టడికే నిర్ణయం తీసుకుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.