రెండ్రోజుల్లో మదుపర్లకు రూ.2.72లక్షల కోట్ల నష్టం!

గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు నష్టపోయింది.

news18-telugu
Updated: September 18, 2018, 9:07 PM IST
రెండ్రోజుల్లో మదుపర్లకు రూ.2.72లక్షల కోట్ల నష్టం!
రెండ్రోజుల్లో 800 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • Share this:
గత రెండు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోవడంతో మదుపర్ల సంపద ఏకంగా రూ.2.72 లక్షల కోట్లు మేర ఆవిరయ్యింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ భయాలు, రూపాయి క్షీణిత వంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. సోమవారం 505 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్...మంగళవారం మరో 295 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 295 పాయింట్ల నష్టంతో 37,291 పాయింట్ల దగ్గర ముగిసింది. ఎస్బీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి.

దీంతో బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల సంపద రూ.2,72,549.15 కోట్ల నుంచి రూ.1,53,64,470 కోట్ల మేర ఆవిరయ్యాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో స్టాక్ మార్కెట్లో విక్రయాల ఒత్తిడి కూడా ఈ పరిస్థితికి కారణంగా మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.

మంగళవారం బీఎస్ఈలోని 1,805 స్టాక్స్ నష్టాల్లో ముగియగా...881 స్టాక్స్ లాభాలు ఆర్జించాయి. 162 స్టాక్స్ యధాతథంగా ఉన్నాయి. 140 స్టాక్స్ గత 52 వారాల కనిష్ఠ స్థాయిలో ముగిశాయి.

ఇది కూడా చదవండి..రికార్డు కనిష్ఠ స్థాయికి రూపాయి...డాలర్@రూ.72.97

First published: September 18, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు