హోమ్ /వార్తలు /బిజినెస్ /

Facebook down :దెబ్బకు దిగజారిన జుకర్ బర్గ్ -7 గంటల్లో 52వేల కోట్ల నష్టం -ఫేస్ బుక్ పూడ్చుకునేదెలా?

Facebook down :దెబ్బకు దిగజారిన జుకర్ బర్గ్ -7 గంటల్లో 52వేల కోట్ల నష్టం -ఫేస్ బుక్ పూడ్చుకునేదెలా?

ఫేస్‌బుక్‌ యజమాని మార్క్ జుకర్ బర్గ్

ఫేస్‌బుక్‌ యజమాని మార్క్ జుకర్ బర్గ్

Mark Zuckerberg huge loss Facebook outage | ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దాని అనుబంధ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు గంటలపాటు నిలిచిపోవడం యూజర్లకు ఇబ్బంది కలిగించగా, సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఫేస్ బుక్ చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యంగా భావిస్తోన్న ఈ అంతరాయం దెబ్బకు యజమాని జుకర్ బర్గ్ వ్యక్తిగత సంపద కూడా కరిగిపోయింది. పూర్తి వివరాలివి..

ఇంకా చదవండి ...

ఉత్పత్తి రంగంలో అవాంతరాలు ఏర్పడితే కనీసం ముడిసరుకైనా మిగులుతుంది.. అదే సేవల రంగంలో మాత్రం ఆలస్యం విషంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. చేతివేళ్ల మీద ప్రపంచాన్ని చూపిస్తామని చెప్పే సోషల్ మీడియా సంస్థలకైతే ప్రతిక్షణం వేల కోట్ల విలువైందే. అతిపెద్ద సామాజిక మాధ్యమంగా కొనసాగుతోన్న ఫేస్ బుక్ లో తాజాగా తలెత్తిన అంతరాయం గంటల వ్యవధిలోనే ఆ సంస్థకు వేల కోట్ల నష్టాలు తెచ్చింది. అంతేకాదు, ఫేస్ బుక్ యజమాని మార్క్ జుగర్ బర్గ్ వ్యక్తిగత ఆదాయాన్నీ కోల్పోయి బిలియనీర్ల జాబితాలో దిగజారిపోయాడు..

సోమవారం రాత్రి 9 గంటల నుండి వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలు నిలిచిపోవడంతో.. వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బందులకు గురయ్యారు. 7 గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి వాట్సప్‌ సేవలను పునరుద్ధరించారు. ఫేస్‌బుక్‌ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం. తాజాగా సేవలు పునరుద్ధరణపై ప్రకటన చేసిన జుకర్ బర్గ్.. అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా,

ఏడు గంటలపాటు తలెత్తిన అంతరాయం కారణంగా ఫేస్‌బుక్‌ సంస్థ భారీ నష్టాన్ని చవిచూసింది. నష్టం అంచనా దాదాపు 7 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ. 52 వేల కోట్లు) నష్టం వచ్చినట్లు బ్లూమ్స్ బర్గ్ తదితర సంస్థలు అంచనా వేశాయి. అంతేకాదు, ప్రపంచ వ్యాప్త అంతరాయం కారణంగా సోమవారం ఫేస్ బుక్ షేర్లు పడిపోవడంతో జుకర్‌బర్గ్‌ ర్యాంక్‌ బిల్‌గేట్స్‌ కంటే దిగువకు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో జుకర్ ఐదో స్థానానికి దిగాడు. సూచిక ప్రకారం.. వారాల వ్యవధిలో సుమారు 140 బిలియన్‌ డాలర్లను ఆయన నష్టపోయాడు.

ప్రపంచవ్యాప్తంగా 200కోట్లకుపైగా యూజర్లున్న ఫేస్ బుక్ సంస్థ వాటాలు సోమవారం నాటి అంతరాయంతో ఒక్కసారిగా 4.9 శాతానికి పడిపోయాయి. దీంతో సెప్టెంబర్ రెండో వారం నుంచి ఇప్పటి వరకు సంస్థ వాటాలు 15 శాతం పడిపోయినట్లయింది. ఇండియాలో ఫేస్ బుక్ ను 41 కోట్ల మంది వాడుతుండగా, వాట్సప్‌కు సుమారు 53 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రాంకు 21 కోట్ల మంది వరకు యూజర్లున్నారు.

సేవల్లో అంతరాయానికిగానూ యూజర్లకు క్షమాపణలు చెప్పిన ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌.. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద దెబ్బ తర్వాత యాడ్ టారిఫ్ పెంచడం కుదరని పని అని,   ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడుకోడానికి ఫేస్ బుక్ ఇంకేదైనా నమ్మకమైన ఐడియాను ముందుకు తీసుకురావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

First published:

Tags: Facebook, Instagram, Mark Zuckerberg, Whatsapp

ఉత్తమ కథలు