హోమ్ /వార్తలు /బిజినెస్ /

Will Preparation Tips: వీలునామా రాస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి పాటించలేదో.. మీ ఆస్తులు గోవిందా !

Will Preparation Tips: వీలునామా రాస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి పాటించలేదో.. మీ ఆస్తులు గోవిందా !

వీలునామా రాస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి పాటించలేదో.. మీ ఆస్తులు గోవిందా !

వీలునామా రాస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి పాటించలేదో.. మీ ఆస్తులు గోవిందా !

వీలునామా అనేది ఒక లీగల్‌(Legal ) ఇన్‌స్ట్రూమెంట్‌. ఇది వారసత్వం కోసం కుటుంబ(Family ) సభ్యులు, వారసులు లేదా ఆస్తుల్లో వాటా ఇవ్వాలని అనుకుంటున్న వ్యక్తులకు ఆస్తులు, బాధ్యతలను అందించే డాక్యుమెంట్. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఎవరికి ఏది అందాలనే అంశాల్లో గొడవలను నివారించడానికి సహాయపడుతుంది.

ఇంకా చదవండి ...

ఆదిల్ శెట్టి, CEO, BANKBAZAAR.com

ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే కుటుంబాల్లో ఆస్తి గొడవలు జరగడం సర్వసాధారణం. భారతదేశంలో పెద్ద కుటుంబాలు, ఎక్కువ మంది వారసులు ఉండటం కూడా సాధారణం. ఇంటి పెద్ద మరణం తర్వాత శాంతియుతంగా వారసులు ఆస్తులు పంచుకోవడం అరుదు. అయితే చట్టపరమైన వీలునామా రాసి ఉంటే.. ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయి. వీలునామా అనేది ఒక లీగల్‌(Legal) ఇన్‌స్ట్రూమెంట్‌. ఇది వారసత్వం కోసం కుటుంబ సభ్యులు, వారసులు లేదా ఆస్తుల్లో వాటా ఇవ్వాలని అనుకుంటున్న వ్యక్తులకు ఆస్తులు, బాధ్యతలను అందించే డాక్యుమెంట్(Document). ఇది కుటుంబ సభ్యుల మధ్య ఎవరికి ఏది అందాలనే అంశాల్లో గొడవలను నివారించడానికి సహాయపడుతుంది.

ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బు(Money), ఆస్తులు - ఆస్తి, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇతరాలు తమ తదనంతరం ఎవరు అనుభవిస్తారనేది ముందే తెలుసుకోవడం మనశ్శాంతి కలిగిస్తుంది. కాబట్టి, వీలునామా రాయడానికి కుటుంబ పెద్దలు ప్రాధాన్యం ఇవ్వాలి. అందరికీ ఇది చాలా కీలకమైన అవసరంగా మారాలి. అందుకే వీలునామా సంపన్నులకే కాదు ప్రతి ఒక్కరికీ అవసరం అంటుంటారు. వీలునామా రాయడానికి కొన్ని పద్ధతులను పాటించాలి. దీనికి వివరాలు, స్పష్టమైన ఆలోచన, దూరదృష్టి, భావోద్వేగాలను పక్కన పెట్టే సామర్థ్యం అవసరం. వీలునామా రాసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఏంటో చూద్దాం.

డిక్లరేషన్స్‌ (Declarations)

వీలునామాలో పేరు, వయస్సు, చిరునామా, తల్లిదండ్రుల పేర్లు వంటి పూర్తి వ్యక్తిగత వివరాలను పేర్కొన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఎటువంటి సంక్షిప్త పదాలను ఉపయోగించ కూడదు. ఫుల్‌ సెన్స్‌లో ఉండే రాస్తున్నారని, ఎవరి బలవంతం లేదని తెలియడానికి వీలునామా రాసేటప్పుడు వివరాలను పూర్తిగా వెల్లడించాలి. వివరాలను వివరించేటప్పుడు మీరు పూర్తి నియంత్రణలో ఉన్నారని ఇవి నిర్ధారిస్తాయి.

ఆస్తి గుర్తింపు (Asset Identification)

ఫైనాన్షియల్‌, ఫిజికల్ ఆస్తుల గురించి సమగ్రంగా తెలియజేయాలి. వాటిని జాబితాలో రాయడం ద్వారా ఏవి ఉన్నాయి, ఎవరికి అందజేయాలనే విషయాలపై స్పష్టత ఉంటుంది. వీటిలో బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, ఇన్సూరెన్స్‌ పాలసీలు, షేర్లలో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా బాండ్‌లు, PPF, EPF వంటి పదవీ విరమణ నిధులు ఉండాలి.

కార్య నిర్వాహకుడు (Executor)

వీలునామా అనేది కుటుంబ పెద్ద మరణానంతరం మాత్రమే అమల్లోకి వస్తుంది. అంటే వీలునామాలో పేర్కొన్న విధంగా పనులు జరుగుతున్నాయా? లేదా? అనేది కుటుంబ పెద్ద చూడలేరు. కాబట్టి ఓ కార్యనిర్వాహకుడు, ఇంటి పెద్ద మరణానంతరం వీలునామాను అమలు చేయడం, దాని సూచనలను అమలు చేయడం అవసరం. వీలునామాలో పేర్కొన్నవన్నీ కార్యరూపం దాల్చేలా కార్యనిర్వాహకులు బాధ్యత వహిస్తారు. గందరగోళాన్ని నివారించడానికి, వీలునామా రాసేవారు కార్యనిర్వాహకులుగా ఎవరు ఉండాలని భావిస్తున్నారో.. వారి పేరు, చిరునామా, వారితో ఉన్న రిలేషన్‌ వంటి పూర్తి వివరాలను తెలియజేయాలి. అసలైన కార్యనిర్వాహకుడికి వీలునామాను అమలు చేయడం ఇష్టం లేకుంటే, లేదా చేయలేకపోతే బాధ్యతలను నెరవేర్చేందుకు ప్రత్యామ్నాయ కార్యనిర్వాహకుడిని నియమించడం మంచిది.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?లబ్ధిదారులు (Beneficiaries)

లబ్ధిదారులుగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు లేదా వ్యక్తుల పేర్లను వీలునామాలో పేర్కొనాలి. రిలేషన్‌లు, ఫైనాన్సెసె, సొంత భావోద్వేగాలను మోస్తూ ఆస్తులను పంచడం కష్టతరమైన పని. వారి పేర్లను రాస్తున్నప్పుడు.. పూర్తి పేరులను రాయడం మంచిది. వీలునామాలో ముద్దుపేర్లు రాయడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. వారి చిరునామాలు, పుట్టిన తేదీ, వారితో ఉన్న రిలేషన్‌ వంటి వివరాలను పేర్కొనాలి. ఇంటిపెద్ద తమకు నచ్చిన విధంగా కావలసిన నిష్పత్తిలో ఆస్తులను వారికి కేటాయించవచ్చు. అలా చేస్తున్నప్పుడు, సూచనలు స్పష్టంగా ఉన్నాయని, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం లేదని నిర్ధారించుకోవాలి. అవసరమైతే ఆర్థిక, న్యాయ నిపుణుల నుంచి వృత్తిపరమైన సహాయం పొందవచ్చు.


సాక్షులు (Witnesses)

వీలునామా సిద్ధమైన తర్వాత, లబ్ధిదారులు కానటువంటి కనీసం ఇద్దరు వ్యక్తులు దానిపై సరిగ్గా సంతకం చేసి, తేదీని రాసి, సాక్ష్యంగా ఉండేలా చూడాలి. సాక్షులు వీలునామాను చదవాల్సిన అవసరం లేదని, దానిలోని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. వీలునామాపై ఇంటి పెద్ద సంతకం చేసినప్పుడు వారు చట్టపరమైన అవసరంగా హాజరు కావాలి. వీలునామాపై తర్వాత వచ్చే సందేహాలకు వారే సాక్ష్యంగా ఉంటారు. చివరి పేజీలో సంతకం మాత్రమే కాకుండా సాక్షుల పేర్లు, చిరునామాలు కూడా ఉండేలా ఇంటి పెద్ద జాగ్రత్త వహించాలి.

వీలునామా రాయడం ఎంత ముఖ్యమో నిర్ణీత వ్యవధిలో దాన్ని సమీక్షించడం అంతే ముఖ్యం. ఆస్తులు, తేదీల తాజా అప్‌డేట్‌లు వీలునామాలో చేరేలా జాగ్రత్త వహించాలి. ఇలా అప్‌డేట్‌ చేస్తున్నప్పుడు.. వీలునామాలో మునుపటి వివరాలు లేకుండా చూసుకోవాలి. లేదంటే గందరగోళం నెలకొంటుంది. వీలునామా రాసిన వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే వీలునామా అమల్లోకి వస్తుంది. ప్రియమైనవారు, ముఖ్యంగా డిపెండెంట్లు, మైనర్‌లు, ఇంటి పెద్ద మరణం తర్వాత కలిగే పొటెన్షియల్‌ రిస్క్‌ల నుంచి బయటపడటం ఇంటి పెద్ద తీసుకున్న చర్యలపైనే ఆధారపడి ఉంటుంది.

Published by:Mahesh
First published:

Tags: EPFO, Fake documents, PPF, Relationship

ఉత్తమ కథలు