PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే

PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే (ప్రతీకాత్మక చిత్రం)

EPF Pandemic advance facility | మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? అవసరం ఉంది కదా అని ఇప్పుడు డ్రా చేస్తే మీరు ఎంత నష్టపోతారో తెలుసుకోండి.

  • Share this:
    ఆర్థికంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మొదట గుర్తొచ్చేవి పీఎఫ్ డబ్బులు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లోని డబ్బులు ఆదుకుంటాయన్న ధీమా ఉద్యోగులది. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఆర్థిక సంక్షోభానికి అనేక సంస్థలు, వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంక్షోభాన్ని కారణంగా చూపించి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కూడా మార్పులు చేసింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు, రుణాలు చెల్లించాల్సిన వాళ్లు, ఈ డబ్బు డ్రా చేసుకొని ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డ్రా చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 4 లక్షల క్లెయిమ్స్ వచ్చాయని, వాటిలో 1.37 లక్షల క్లెయిమ్స్ ప్రాసెస్ అయ్యాయని ఈపీఎఫ్ఓ లెక్కలు చెబుతున్నాయి. అసలు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం మంచి ఆలోచననేనా? ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకుంటే ఎంత నష్టపోతారు? ఈ ఉదాహరణ చూడండి.

    ఫిన్‌సేఫ్ ఇండియా ఫౌండర్ మృణ్ అగర్వాల్ మనీకంట్రోల్‌కు రాసిన కథనంలో ఓ ఉదాహరణ చూస్తే పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం ఎంత నష్టమో అర్థమవుతుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లోని 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది డ్రా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదాహరణకు ఓ వ్యక్తి బేసిక్ వేతనం రూ.30,000 అనుకుందాం. మూడు నెలల బేసిక్ రూ.90,000. తన ఈపీఎఫ్ బ్యాలెన్స్ రూ.1,00,000 ఉందనుకుందాం. 75 శాతం అంటే రూ.75,000. నిబంధనల ప్రకారం ఏది తక్కువ అయితే అది కాబట్టి రూ.75,000 డ్రా చేసుకోవచ్చు. అయితే ఎంత అత్యవసరమైనా ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోకపోవడం మంచిదన్నది ఆర్థిక నిపుణుల సలహా. ఎందుకంటే రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బులవి. రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం వాటిని అలాగే ఉంచడం మంచిదని అంటారు. ఇందులో రిస్క్ తక్కువ. పన్నులు ఉండవు. సావరిన్ గ్యారెంటీ కూడా ఉంటుంది. అందుకే ఇందులోంచి డబ్బులు డ్రా చేశారంటే ఈ ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే.

    పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం సదరు వ్యక్తి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రూ.75,000 డ్రా చేశారనుకుందాం. రిటైర్మెంట్‌కు మరో 30 ఏళ్లు ఉన్నట్టైతే ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్న వడ్డీ ప్రకారం మొత్తం ఎంత నష్టపోతాడో తెలుసా? రూ.9,00,000. అంటే ఇప్పుడు రూ.75,000 కోసం డ్రా చేస్తే రిటైర్మెంట్ సమయంలో రూ.9,00,000 కోల్పోయినట్టే. ఒక్కసారి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డ్రా చేశారంటే మళ్లీ ఇన్వెస్ట్ చేయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీ ఆర్థిక సమస్యలు తీరడానికి ఈపీఎఫ్ డబ్బులు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయేమో చూడండి. అన్నిదారులు మూసుకుపోయి ఇక ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం తప్పదు అనుకుంటేనే డ్రా చేయండి. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

    EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ

    Personal Finance Tips: ఈ టిప్స్‌తో బ్యాంకులో మీ డబ్బులు సేఫ్
    Published by:Santhosh Kumar S
    First published: