హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Money: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

EPF Withdrawal | మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? కొన్నేళ్లుగా ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? అందులో కొంత విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవసరానికి డబ్బు కావాల్సినప్పుడు గుర్తొచ్చే సేవింగ్స్‌లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF డబ్బులు కూడా ఉంటాయి. ఉద్యోగుల వేతనంలో నుంచి 12 శాతం, అంతే మొత్తంలో యాజమాన్యం వాటా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతాయి. అంటే ఉద్యోగి మూల వేతనం ప్రకారం 24 శాతం పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఈపీఎఫ్ అకౌంట్లను నిర్వహిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన మొత్తంలోనుంచి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు తమ అవసరానికి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దీన్నే అడ్వాన్స్ విత్‌డ్రాయల్ అంటారు. పెళ్లిళ్లు, పిల్లల పైచదువులు, ఇంటి నిర్మాణం ఇలా పలు కారణాలతో విత్‌డ్రా చేయొచ్చు. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని కూడా ప్రారంభించింది ఈపీఎఫ్ఓ. అంటే కరోనా వైరస్ ప్రభావాన్ని కారణంగా చూపించి విత్‌డ్రా చేయొచ్చు.

Gold Loan Interest Rates 2021: తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులివే...

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

అయితే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రిటైర్మెంట్ వరకు డబ్బులు విత్‌డ్రా చేయకపోవడమే మంచిదని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతుంటారు. ఇందుకు కారణం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పొందడమే. కొన్నేళ్ల పాటు డబ్బులు జమ చేస్తూ పోవడం, ఆ డబ్బుకు ఈపీఎఫ్ఓ నుంచి ఏటేటా వడ్డీ జమ అవుతుండటం, ఇలా రిటైర్మెంట్ నాటికి జమచేసినదాని కన్నా ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. మధ్యలో డబ్బులు విత్‌డ్రా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నట్టైతే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక అత్యవసర కారణాలతో విత్‌డ్రా చేసినా పన్నులు ఉండవు. ఒకవేళ ఐదేళ్లు అకౌంట్ కొనసాగించినా మధ్యలో కంట్రిబ్యూషన్ లేకపోయినా పన్నులు చెల్లించాలి.

Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా

LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే

ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్-TDS వర్తిస్తుంది. అందుకే మరీ తప్పదు అనుకుంటేనే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ఆప్షన్‌గా పీఎఫ్ డబ్బును తీసుకోవాలి. అంతే తప్ప ఏ చిన్న అవసరం ఉన్నా ఈపీఎఫ్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేయకూడదు.

First published:

Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

ఉత్తమ కథలు