• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ARE YOU WITHDRAWING AMOUNT FROM EPF ACCOUNT KNOW ABOUT TAX RULES SS

EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి

EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి

EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

EPF Withdrawal Rules 2021 | ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత పన్ను చెల్లించాలో, ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది. దీంతో సామాన్యులంతా తమ సేవింగ్స్‌ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేవారి సంఖ్య పెరిగిపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికీ కోవిడ్ 19 కారణంతో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నవారు ఉన్నారు. ఈపీఎఫ్ అకౌంట్‌లో మీరూ డబ్బులు డ్రా చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ చిక్కుల్లో పడుతుంటారు.

    ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఏ కారణంతో డబ్బులు డ్రా చేసినా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ 19 కారణంతో డబ్బులు డ్రా చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు. గతేడాది కోవిడ్ 19 మహమ్మారి కారణంతో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ నుంచి 75 శాతం వరకు లేదా మూడు నెలల బేసిక్ వేతనం + డీఏలో ఏది తక్కువైతే అది డ్రా చేసుకోవచ్చు. క్లెయిమ్స్ కూడా మూడు నాలుగు రోజుల్లో ప్రాసెస్ అవుతాయి.

    Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

    Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

    కోవిడ్ 19 కారణంతో తప్ప ఇతర ఏ కారణంతో పీఎఫ్ డబ్బులు డ్రా చేసినా పన్నులు చెల్లించాలన్న విషయం గుర్తుంచుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు, పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్య లాంటి కారణాలతో పీఎఫ్ డబ్బులు డ్రా చేయొచ్చు. ఐదేళ్ల సర్వీస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డ్రా చేస్తే పన్నులు చెల్లించాలి. విత్‌డ్రా చేసే మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ 192ఏ ప్రకారం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.30,000 కన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. ఐదేళ్ల సర్వీస్ దాటితే ఎలాంటి పన్నులు ఉండవు. ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసుకోవచ్చు.

    Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

    SBI Loans: ఎస్‌బీఐలో లోన్ ఇస్తామని ఫోన్ వచ్చిందా? అయితే అలర్ట్

    అనారోగ్యం కారణంగా లేదా ఉద్యోగం మానేసినందుకు పీఎఫ్ డబ్బులు ఐదేళ్ల లోపు డ్రా చేసుకున్నా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసినా పన్నులు ఉండవు. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటే అందుకు సంబంధించిన రిసిప్ట్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో చూపించాల్సి ఉంటుంది. ఎంప్లాయీ, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్‌ను సాలరీ ఇన్‌కమ్‌గా, వీటిపై వచ్చిన వడ్డీని ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్‌గా చూపించాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు