Repay Home loan: హోం లోన్ ను వేగంగా చెల్లించేందుకు అద్భుతమైన ప్లాన్.. ఈఎమ్ఐ, వడ్డీ భారం రెండూ తగ్గుతూనే..!

ప్రతీకాత్మక చిత్రం

2019 అక్టోబరు 1 నుంచి వాణిజ్య బ్యాంకులన్నీ తమ రుణాలను ఆర్బీఐ పాలసీ రెపో రేటుతో అనుసంధించాయి. దీనికి అనుగుణంగా వడ్డీ, ఈఎంఐ భారం ఎంత తక్కువ ఉంచాలో మీరు నిర్ణయించుకోవచ్చు.

  • Share this:
రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) 2021-22 సంవత్సరానికి సంబంధించి మొదటిసారి ద్వైమాసిక(Bi-Monthly) ద్రవ్యవిధాన సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో రెపోరేటును మార్చకుండా 4 శాతంగానే ఉంచింది. కోవిడ్-19 రెండో వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదమున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల సులభమైన క్రెడిట్ విధానం అవసరమని భావించింది. వాణిజ్య బ్యాంకులు బహుళ సంవత్సరాల కనిష్ఠానికి అందించే గృహ రుణ వడ్డీరేట్లను ఇది నిర్ధారిస్తుంది. చాలా బ్యాంకులు 7 శాతం నుంచే హోంలోన్లు అందిస్తున్నాయి. కాబట్టి హోంలోన్ వేగంగా చెల్లించాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

MCLR లేదా RLLR లింక్డ్ లోన్..
2016 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(MCLR)ను ప్రవేశపెట్టింది. ఎంసీఎల్ఆర్ పై ఇచ్చే రుణాలు బ్యాంకుల సొంత నిధుల వ్యయంపై ఆధారపడి ఉంటాయి. బేస్ రేటు లిమిటేషన్ల తీర్చడానికి వీటిని ప్రవేశపెట్టారు. అన్ని రుణాలకు ఆ సమయంలో ఇదే బెంచ్ మార్క్. ఎంసీఎల్ఆర్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రెపోరేటు ప్రయోజనాలను ఆమోదించడంలో బ్యాంకులు ఆలస్యం చేస్తున్నాయి. ఈ కారణంగా ఆర్బీఐ ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ రుణాలను ప్రవేశపెట్టింది. 2019 అక్టోబరు 1 నుంచి వాణిజ్య బ్యాంకులన్నీ తమ రుణాలను ఆర్బీఐ పాలసీ రెపో రేటుతో లేదా ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఇండియా లిమిటెడ్(FBIL) ప్రచురించిన ఇతర వడ్డీ రేట్లతో అనుసంధించాయి.

మీ లోన్ ఎంసీఎల్ఆర్ లేదా రెపో లింక్డ్ లెండింగ్ రేట్(RLLR)పై ఆధారపడి ఉంటుంది. దీనికి అనుగుణంగా వడ్డీ, ఈఎంఐ భారం ఎంత తక్కువ ఉంచాలో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏప్రిల్ 2019 కంటే ముందు లోన్లు తీసుకున్నవారు RLLRకి మారడానికి బదులు MCLR రుణాలతోనే కొనసాగవచ్చు. ఎంసీఎల్ఆర్ నుంచి ఆర్ఎల్ఎల్ఆర్ కు మారే వారికి మాత్రం ఖర్చు తగ్గుతుంది. అయితే ఎంసీఎల్ఆర్ తో లింక్ చేసిన రుణాలు పొందిన వారికి మీ గడువు సమీపించినప్పుడు ఈఎంఐలు తగ్గుతాయి.

EMIలను తగ్గించుకోవడం..
ఈఎంఐల తగ్గింపునకు వడ్డీ రేట్లు కారణమవుతాయి. కాబట్టి నూతన రుణాల విషయంలో అతి తక్కువ వడ్డీ రేటును తీసుకోవడం ఉత్తమం. వడ్డీ తగ్గించుకోడానికి మరో మార్గం ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్రిన్సిపల్ అమౌంట్ ను ముందుగానే చెల్లించాలి. రుణగ్రహీత ప్రతి 6 నెలలకు లేదా ఏడాదికి ఈ అసలు మొత్తాన్ని ప్రీపేమెంట్ గా ముందస్తుగా చెల్లించవచ్చు. ప్రారంభ సంవత్సరాల్లో లోన్ పై వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ముందస్తు చెల్లింపులు ప్రారంభ సంవత్సరాల్లోనే చేయాలి. కొత్త రుణాల విషయంలో రుణ గ్రహీతలు బ్యాంకుల్లో లభించే ఉత్తమ వడ్డీ రేటు కోసం అన్వేషించాలి. రెపో రేటు పెరిగినప్పుడల్లా ఆర్ఎల్ఎల్ఆర్ తో లింక్ చేసిన లోన్లు ఎంసీఎల్ఆర్ కంటే వేగంగా ప్రభావితమవుతాయి. కాబట్టి ఈఎంఐలు, వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ముందస్తు చెల్లింపు ప్రణాళిక ఎంతో అవసరం.
Published by:Hasaan Kandula
First published: