ఎల‌క్ట్రిక్‌ వెహికిల్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్రస్తుతం మ‌నం వాడుతున్న ఇంధ‌న వాహ‌నాల ద్వారా కాలుష్యం క‌లుగుతుంద‌నే అభిప్రాయం మ‌న‌లో చాలా మందికి ఉంది. కొంద‌రు వీటికి దూరంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వాడాలని అనుకుంటారు. కానీ వాటిని వాడ‌డం లాభమేనా.. అందులో ఎలాంటి టెక్నాల‌జీ వాడతారు.. ఇంజ‌న్ సామ‌ర్థ్యం ఎలా ఉంటుంది. అనే విష‌యాలు చాలా మందికి సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

 • Share this:
  ప్రస్తుతం మ‌నం వాడుతున్న ఇంధ‌న వాహ‌నాల ద్వారా కాలుష్యం క‌లుగుతుంద‌నే అభిప్రాయం మ‌న‌లో చాలా మందికి ఉంది. ప్ర‌తీ రోజు వాతావ‌ర‌ణం ఈ ఇంధ‌న వాహ‌నాల వ‌ల్ల ఎంతో కాలుష్యం అవుతోంది. ఈ కారణంగా  కొంద‌రు వీటికి దూరంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వాడాలని అనుకుంటారు. కానీ వాటిని వాడ‌డం లాభమేనా.. అందులో ఎలాంటి టెక్నాల‌జీ వాడతారు.. ఇంజ‌న్ సామ‌ర్థ్యం ఎలా ఉంటుంది. అనే విష‌యాలు చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దీంతో ఎల‌క్ట్రిక్ వెహికిల్ వాడ‌కుండా ఉంటున్నారు. అందుకోస‌మే ఎల‌క్ట్రిక్ వెహికిల్ గురించి తెలుసుకోండి.
  ఎల‌క్ట్రిక్ వాహ‌నం కావాల‌నుకోవ‌డానికి ముఖ్య‌మైన కార‌ణాలు..
  - ప్ర‌స్తుతం వినియోగిస్తున్న‌ వాహ‌నాలు కాలుష్య‌కార‌కాలు అవుతున్నాయి.
  - ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను అప్‌గ్రేడ్ చేసుకొనే సౌక‌ర్యం ఉంది.
  - ప్ర‌భుత్వం అందిస్తున్న స‌బ్సిడీల‌తో త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుంది.
  - వినియోగించ‌డం చాలా సుల‌భం
  మోటార్..
  విద్యుత్ వాహ‌నంలో మెటార్ ఆక్సెల్ వ‌ద్ద ఉంటుంది. ఈ వాహ‌నం ఆల్‌-వీల్ డ్రైవ్‌ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా రెండు మోటార్లు ఉంటాయి. ఒక మోట‌ర్ ముందు గిల్ల‌ల‌ను, మ‌రో మోట‌ర్ వెనుక గిల్ల‌ల‌ను నియంత్రిస్తుంది. ఎల‌క్ట్రిక్ వాహ‌నంలో ఇంజ‌న్ ఆయిల్ మార్చే ప‌ని ఉండ‌దు. నిజానికి ఈ వాహ‌నాల్లో ఇంజ‌న్ ఉండ‌దు. సాధార‌ణ వాహ‌నాల్లో వాడే బెల్ట్, చైన్ వాల్వ్‌, క్ల‌చ్‌లు ఇవేం ఉండవ్ కావున నిర్వ‌హ‌ణ సుల‌భ‌త‌రం అవుతుంది.
  బ్యాట‌రీ..
  మంచి నాణ్య‌మైన ఎల‌క్ట్రిక్ వెహికిల్ బ్యాట‌రీ సుమారు 1,60,000 కిలోమీట‌ర్లు మ‌న్నుతుంది. కారు బ్యాట‌రీలు పాడ‌వ్వడం చాలా అరుదు. సాధార‌ణంగా 8 సంవ‌త్సాల పాటు బ్యాట‌రీ ప‌నితీరుకు వ్యారెంటి ఉంటుంది. కార్‌లో లీథియ‌మ్-అయాన్ బ్యాట‌రీల‌ను వాడ‌తారు. అయితే కారు పార్కింగ్ ప్ర‌దేశాన్ని బ‌ట్టి బ్యాట‌రీ సామ‌ర్థ్యం మారుతుంది. త‌క్కువ ఉష్ణోగ్ర‌త ఉన్న‌చోట కార్‌ను పార్క్ చేస్తే కారు బ్యాట‌రీ తొంద‌ర‌గా పోతుంది. కావున మంచి పార్కింగ్ స్థ‌లం అవ‌స‌రం.
  టైర్లు..
  ఎల‌క్ట్రిక్ వెహికిల్ కార్లు సాధార‌ణ కార్ల‌లాగే బ‌రువును మోయ‌గ‌లుగుతాయి. అందులో ఎటువంటి సందేహం అవ‌స‌రం లేదు. రాయ‌ల్ ఆటో మొబైల్ క్ల‌బ్ ప‌రీక్ష ప్ర‌కారం త‌క్కువ టైర్ల మీద క‌లిగే ఒత్తిడి 3శాతం కారు ప‌నితీరుపై చూపుతుంది.
  బ్రేక్‌లు..
  ఎల‌క్ట్రిక్ వెహికిల్‌లో రిజెన‌రేటీవ్ బ్రేక్ సిస్ట‌మ్‌ని ఉప‌యోగించారు. దీని ద్వారా బ్రేక్ వేసిన‌ప్పుడు క‌లిగే లోడ్‌ను నియంత్రిస్తుంది. నియ‌మాల ప్ర‌కారం వెళ్లే వేగాన్నిసులువుగా నియంత్రించ వచ్చు. కొన్ని సంద‌ర్భాల్లో బ్రేక్‌పై ప‌డే లోడ్ చార్జింగ్‌ను త‌గ్గిస్తుంది.
  స‌ర్వీసింగ్‌..
  ఎల‌క్ట్రానిక్ వాహ‌నాల‌కు ప్ర‌స్తుతం వినియోగిస్తున్న వాహ‌నాల‌లాగా త‌ర‌చూ స‌ర్వీసింగ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. సాంకేతికంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మెరుగ్గా ఉంటాయి. ప్ర‌స్తుతం ఉన్న వాహ‌నాల కంటే చాలా త‌క్కువ ఖ‌ర్చుతో స‌ర్వీసింగ్ పూర్త‌వుతుంది.
  మార్గ మ‌ధ్య‌లో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే
  ఎల‌క్ట్రిక్ వాహ‌నంలో ముందు గిల్ల‌ల‌కు ఒక ఇంజ‌న్‌, వెనుక గిల్ల‌ల‌కు ఒక ఇంజ‌న్ ఉంటుంది. ఏదైనా ఒక దాంట్ల స‌మ‌స్య వ‌చ్చిన ఇంకో ఇంజ‌న్‌తో బండిని న‌డ‌ప‌వ‌చ్చు. రెండు పాడైతేనే కారును తీసుకెళ్ల‌డానికి రోలింగ్ అవ‌స‌రం అవుతుంది. రానున్న రోజుల్లో మ‌రింత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎల‌క్ట్రిక్ కార్ల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు.
  Published by:Sharath Chandra
  First published: