ARE YOU VICTIM OF LOAN FRAUD LIKE SUNNY LEONE KNOW HOW TO CHECK WHETHER SOMEONE MISUSED YOUR PAN CARD TO TAKE LOAN SS
PAN Card Fraud: సన్నీ లియోన్‌లా మీరూ మోసపోయారా? మీ పేరుతో ఎవరైనా లోన్ తీసుకున్నారా చెక్ చేయండి ఇలా
PAN Card Fraud: సన్నీ లియోన్‌లా మోసపోయారా? మీ పేరుతో ఎవరైనా లోన్ తీసుకున్నారా చెక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
PAN Card Fraud | ఇటీవల సన్నీలియోన్ (Sunny Leone) పాన్ కార్డు ఉపయోగించి ఇతరులు లోన్ తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. మరి మీరూ ఇలాగే మోసపోయారా? మీ పేరుతో ఎవరైనా లోన్ తీసుకున్నారా? చెక్ చేయండి ఇలా.
తన పేరు మీద గుర్తుతెలియని వ్యక్తులు లోన్ తీసుకున్నారంటూ ఇటీవల సినీనటి సన్నీ లియోన్ (Sunny Leone) ట్వీట్ చేయడం సంచలనం సృష్టింది. తన పాన్ కార్డును (PAN Card) ఉపయోగించి ఇతరులు రూ.2,000 లోన్ తీసుకున్నారని, ఆ లోన్ చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడిందని ఆమె ఆరోపించారు. ఇదే విషయాన్ని లోన్ మంజూరు చేసిన ధని స్టాక్స్ లిమిటెడ్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును ఈ సంస్థ పరిష్కరించిందని ఆమె మరో ట్వీట్ చేసింది. సన్నీ లియోన్ మాత్రమే కాదు మరెందరో ఇలా మోసపోయిన ఘటనలు బయటపడుతున్నాయి. తమ పాన్ కార్డుతో ఇతరులు లోన్లు తీసుకున్నారని, వాటిని చెల్లించకపోవడంతో తమ సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందని ట్విట్టర్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ధని ప్లాట్‌ఫామ్ పైనే వస్తుండటం విశేషం. ధని యాప్‌లో లోన్ తీసుకోవాలంటే యూజర్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు ఎంటర్ చేస్తే చాలు. అయితే పాన్ కార్డ్ వివరాలను సేకరిస్తున్న మోసగాళ్లు ఆ వివరాలతో ధని యాప్‌లో రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాలను చెల్లించరు కాబట్టి పాన్ కార్డుకు లింక్ ఉన్న సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. మరి మీరూ ఇలాంటి పాన్ కార్డ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్‌లో బాధితులా? మీ పేరు మీద ఎవరైనా మీకు తెలియకుండా లోన్ తీసుకున్నారా? మీ పాన్ నెంబర్‌ను దుర్వినియోగం చేశారా? ఈ విషయాలు తెలుసుకోవచ్చు.
మీ పేరు మీద లోన్లు, క్రెడిట్ కార్డుల వివరాలను సిబిల్ రిపోర్ట్‌లో తెలుసుకోవచ్చు. మీ పాన్ నెంబర్ ద్వారా సిబిల్ స్కోర్ తెలుస్తుంది. సిబిల్ మాత్రమే కాదు ఈక్వీఫ్యాక్స్, ఎక్స్పీరియన్, క్రిఫ్ హై మార్క్ లాంటి సంస్థలు కూడా క్రెడిట్ రిపోర్టులు ఇస్తాయి. ఎక్కువగా సిబిల్ స్కోర్ ప్రాచుర్యంలో ఉంది. డీటెయిల్డ్ సిబిల్ రిపోర్ట్ కావాలంటే డబ్బులు చెల్లించాలి. అయితే పేటీఎం, బ్యాంక్ బజార్ లాంటి సంస్థలు, బ్యాంకులు ఉచితంగానే కస్టమర్లకు ఈ రిపోర్ట్స్ ఇస్తాయి. మరి మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్‌లో మీరు ఇప్పటివరకు తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వివరాలు ఉంటాయి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా లోన్ తీసుకున్నట్టు కనిపిస్తే రుణం మంజూరు చేసిన సంస్థ ఏదో చెక్ చేయాలి. ఆ సంస్థకు మీ వివరాలతో కంప్లైంట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.