హోమ్ /వార్తలు /business /

Credit Card: క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తం వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త

Credit Card: క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తం వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త

Credit Card Limit | క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని లిమిట్ మొత్తం వాడేస్తే మీకు భవిష్యత్తులో లోన్లు కూడా రావడం కష్టమే. మరి క్రెడిట్ కార్డ్ (Credit Card) ఎలా వాడాలి? ఎంత లిమిట్ వాడాలి? తెలుసుకోండి.

  మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బ్యాలెన్స్ ఉంది కదా అని మొత్తం వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగం బాగా పెరిగిపోయింది. ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) నుంచి పేమెంట్స్ వరకు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. క్రెడిట్ కార్డుపై 20 రోజుల నుంచి 60 రోజుల వరకు ఇంటరెస్ట్ ఫ్రీ అంటే వడ్డీలేకుండా చెల్లించే అవకాశం ఉంటుంది. కొన్ని క్రెడిట్ కార్డులపై 90 రోజుల వరకు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేస్తే చిక్కులు తప్పవు. అది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ఎలాగో తెలుసుకోండి.

  క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో

  మీరు ప్రతీ నెలా మీ క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేస్తుంటే మీరు డిఫాల్ట్ చేయొచ్చన్న అనుమానంతో బ్యాంకులు మీ క్రెడిట్ లిమిట్‌ను తగ్గించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ ఉపయోగించే విషయంలో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో నియమాలు పాటించాలని చెబుతుంటారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంటే అంత వాడకూడదని అంటారు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం ఉండాలి. అంటే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.1,00,000 ఉంటే మీరు అందులో 30 శాతం అంటే కేవలం రూ.30,000 మాత్రమే వాడుకోవాలి. అంతకన్నా ఎక్కువ వాడితే మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.

  SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఏప్రిల్ 1 లోగా ఈ పనిచేయండి

  క్రెడిట్ స్కోర్ తగ్గితే మీరు భవిష్యత్తులో రుణాలకు అప్లై చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను బట్టి మీ క్రెడిట్ స్కోర్ మారుతూ ఉంటుంది. మీరు మీ క్రెడిట్ లిమిట్‌ను ఎక్కువగా వాడుతున్నారంటే మీరు ఎక్కువగా అప్పు చేస్తున్నారని అర్థం. అందుకే క్రెడిట్ లిమిట్ ఎక్కువగా వాడకూడదంటారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్.

  Bank Holidays in April: ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు... హాలిడేస్ లిస్ట్ ఇదే

  మరి మీరు ఎక్కువగా క్రెడిట్ లిమిట్ వాడుకోవాలంటే మార్గమే లేదా అని అనుకుంటున్నారా? మీరు మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచుకుంటే ఎక్కువ బ్యాలెన్స్ వాడుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.1,00,000 ఉన్నప్పుడు 30 శాతం అంటే రూ.30,000 మాత్రమే ఉపయోగించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.2,00,000 కి పెంచుకుంటే 30 శాతం అంటే రూ.60,000 ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీ క్రెడిట్ లిమిట్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. ఓసారి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మీ క్రెడిట్ లిమిట్ పెంచమని కోరాలి.

  First published: