హోమ్ /వార్తలు /బిజినెస్ /

Credit Card Bill: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లింగ్ సైకిల్, మినిమం పేమెంట్ రూల్స్ తెలుసా?

Credit Card Bill: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లింగ్ సైకిల్, మినిమం పేమెంట్ రూల్స్ తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Credit Card Bill | మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో బిల్లింగ్ సైకిల్, డ్యూ డేట్, మినిమం పేమెంట్ (Minimum Payment) అంటే ఏంటీ? ఈ రూల్స్ ఏంటో, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలేంటో తెలుసుకోండి.

మన దేశంలో క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగం ఏటా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. వివిధ బ్యాంకులు ప్రత్యేక అవసరాల కోసం విభిన్న క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. మంచి ఒప్పందాలు, సౌలభ్యం, భద్రతతో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 2021 నాటికి భారతదేశంలో సుమారు 6.4 కోట్ల క్రెడిట్ కార్డులు చెలామణిలో ఉన్నాయని కొన్ని నివేదికలు అంచనా వేశాయి. అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బిల్లింగ్ సైకిల్ (Billing Cycle) ఇందులో ప్రధానమైనది.

క్రెడిట్ కార్డుల విషయంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వ్యయ విధానాలు, వినియోగం, క్రెడిట్ వంటి అంశాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటే, బిల్లింగ్ సైకిల్‌పై మరింత శ్రద్ధ అవసరం. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అనేది.. బిల్లింగ్ స్టేట్‌మెంట్‌ల మధ్య ఉండే వ్యవధి. బ్యాంకులను బట్టి ఈ గడువు 28 నుంచి 32 రోజుల మధ్య ఎక్కడైనా ఉండవచ్చు. మీ క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేసిన క్షణం నుంచి ఈ బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. అన్ని లావాదేవీలు, క్యాష్ విత్‌డ్రాలు, లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలు, బకాయి ఉన్న బ్యాలెన్స్ వడ్డీ.. వంటివన్నీ ప్రతి బిల్లింగ్ సైకిల్ తర్వాత జనరేట్ అయ్యే స్టేట్‌మెంట్‌లో ఉంటాయి.

LIC Premium: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా? ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

క్రెడిట్ కార్డు రకం, వాటిని జారీ చేసిన సంస్థ ఆధారంగా బిల్లింగ్ సైకిల్ మారవచ్చు. ఉదాహరణకు.. మీ కార్డు స్టేట్‌మెంట్ ఈ నెల 10న జనరేట్ అయితే, బిల్లింగ్ సైకిల్ అనేది ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ తరువాత నమోదయ్యే ట్రాన్సాక్షన్లు తరువాతి నెల స్టేట్‌మెంట్‌లో వస్తాయి. సాధారణంగా మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ క్లియర్ చేయాల్సిన తేదీ ప్రకారం స్టేట్‌మెంట్ జనరేట్ అవుతుంది.

SBI Quick Personal Loan: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? 15 నిమిషాల్లో రూ.20 లక్షల లోన్

క్రెడిట్ కార్డు యూజర్లు మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, కనీస ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనీస ఛార్జీలు అనేవి, మీరు చెల్లించాల్సిన బిల్లులో కొంత భాగం. క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఆలస్య రుసుము చెల్లించకుండా జాగ్రత్త పడటానికి, క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేషన్‌లో ఉంచుకోవడానికి కనీస ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ మినిమం బ్యాలెన్స్ చెల్లించిన తర్వాత, మిగిలిన బ్యాలెన్స్‌పై వడ్డీ వర్తిస్తుంది. ఈ వడ్డీ సంవత్సరానికి 48% వరకు ఉంటుంది. కాబట్టి గడువు తేదీకి ముందే మొత్తం బిల్లు చెల్లించడం మంచిది. మునుపటి బిల్లు జనరేట్ అయినప్పటి నుంచి 21- 25 రోజులు గడువు తేదీగా ఉంటుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit cards, Personal Finance

ఉత్తమ కథలు