Card Transactions | మీరు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నారా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే కొత్త డెబిట్ కార్డ్ వచ్చిందా? కొత్తగా తీసుకున్న ఈ కార్డులతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారా? అయితే సెట్టింగ్స్ ఇలా మార్చండి.
కొత్త క్రెడిట్, డెబిట్ కార్డులపై ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్‌కు డిఫాల్ట్‌గా అనుమతి ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కస్టమర్ల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను సురక్షితంగా మార్చేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు చాలానే జరుగుతుంటాయి. అయితే ఈ మోసాలకు వీలైనంత వరకు బ్రేక్ వేసేందుకు ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కార్డులపై అన్ని రకాల ట్రాన్సాక్షన్స్‌కు డిఫాల్ట్‌గా అనుమతి ఇవ్వట్లేదు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తీసుకుంటే చాలా రకాలుగా ఉపయోగించొచ్చు. డెబిట్ కార్డుతో పీఓఎస్ మెషీన్లలో స్వైప్ చేయొచ్చు. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు జరపొచ్చు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. క్రెడిట్ కార్డులకూ దాదాపు ఇలాంటి సర్వీసులు లభిస్తాయి.
గతంలో ఈ సర్వీసులన్నీ డిఫాల్ట్‌గా వచ్చేవి. అంటే కస్టమర్లు యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త కార్డు తీసుకోగానే ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నిబంధనలతో ఈ సర్వీసులు డిఫాల్ట్‌గా రావట్లేదు. కొత్త కార్డులు, రీఇష్యూ చేసిన కార్డులు, అప్‌గ్రేడ్ చేసిన కార్డుల్లో కేవలం డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా ఏటీఎం, పీఓఎస్ మెషీన్లలో మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేదా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఈ సేవల్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొత్తగా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌కు ఈ రూల్ వర్తిస్తుంది.
మీరు మీ కొత్త క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులపై ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్ చేయాలంటే మీరు బ్యాంకును సంప్రదించాలి. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. మీ బ్యాంకుకు సంబంధించిన యాప్‌లో కార్డ్స్ సెక్షన్లో మేనేజ్ యూసేజ్ సెక్షన్లో ఈ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయొచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ లావాదేవీల సెట్టింగ్స్ మార్చొచ్చు.
మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు తీసుకున్నప్పుడు ఓ విషయం గుర్తుంచుకోండి. ప్రతీ కార్డుకు ఏటీఎం, పీఓఎస్, ఆన్లైన్, ఇంటర్నేషనల్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ మీరు జరపని లావాదేవీలను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయరనుకుందాం. అలాంటప్పుడు వీటిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ కార్డు పోయినట్టైతే కార్డు దొరికినవాళ్లు ఈ ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయలేరు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.