హోమ్ /వార్తలు /బిజినెస్ /

Term Insurance: రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Term Insurance: రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Term Insurance: రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Term Insurance: రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Term Insurance | రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చా అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. రెండు టర్మ్ పాలసీలు (Term Policies) తీసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

టర్మ్ ఇన్స్యూరెన్స్... ఇటీవల ఈ ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు (Term Insurance Policies) తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇవ్వడం టర్మ్ పాలసీ (Term Policy) ప్రత్యేకత. కుటుంబ యజమాని లేదా కుటుంబ పోషణ కోసం ఆదాయాన్ని ఆర్జిస్తున్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. అయితే కొందరు రెండుమూడు కంపెనీల నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఒకరు రెండుమూడు టర్మ్ పాలసీలు తీసుకోవచ్చా? క్లెయిమ్ సమయంలో ఏవైనా సమస్యలు ఉంటాయా? అనే సందేహాలు పాలసీహోల్డర్స్‌లో ఉంటాయి.

ప్రయోజనాలు ఇవే

ఒక వ్యక్తి ఎన్ని టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీలైనా తీసుకోవచ్చు. ఆ పాలసీల వల్ల లభించే ప్రయోజనాలు, ఫీచర్స్ లాంటివి పరిగణలోకి తీసుకొని రెండుమూడు టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు. ఎక్కువ కవరేజీ కావాలనుకునేవారు ఇలా వేర్వేరు కంపెనీల నుంచి వేర్వేరు ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకుంటూ ఉంటారు. రూ.1 కోటి కన్నా ఎక్కువ కవరేజీ కావాలనుకునేవారు వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ పాలసీలను తీసుకోవడం మంచిది. మీరు 10-15 ఏళ్ల క్రితం తీసుకున్న టర్మ్ పాలసీల కవరేజీ భవిష్యత్ అవసరాలకు చాలకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మరో పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. గతంలో క్రిటికల్ ఇల్‌నెస్ లాంటి రైడర్స్ అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి ఈ రైడర్స్‌తో మరో టర్మ్ పాలసీ తీసుకుంటే మంచిది.

Wrong UPI Transaction: ఒకరికి పంపాలనుకొని మరొకరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారా? ఏం చేయాలో తెలుసుకోండి

ఇవి గుర్తుంచుకోండి

చాలామంది చేసే పొరపాటు ఏంటంటే టర్మ్ పాలసీలు తీసుకొని వాటి గురించి కుటుంబానికి చెప్పరు. అనుకోని పరిస్థితుల్లో వారు మరణిస్తే ఆ కుటుంబానికి ఆ పాలసీల గురించి తెలియదు కాబట్టి ప్రయోజనం ఉండదు. అందుకే ఒక టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నా, రెండుమూడు పాలసీలు తీసుకున్నా కుటుంబానికి ఆ పాలసీల గురించి చెప్పాలి. వాటి ప్రయోజనాల గురించి వివరించాలి. ఇక మొదట ఒక టర్మ్ పాలసీ తీసుకొని, కొన్నాళ్ల తర్వాత ఇంకో కంపెనీ నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకుంటే, మొదటి పాలసీ గురించి రెండో కంపెనీకి చెప్పాలి. తాము గతంలో ఫలానా కంపెనీ నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నామని, ఆ పాలసీ యాక్టీవ్‌గా ఉందని చెప్పాలి. భవిష్యత్తులో క్లెయిమ్స్ సందర్భంలో ఇబ్బందులు రాకుండా ఉంటుంది.

LIC Policy: ఎల్ఐసీ పాలసీతో లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఇక రెండో టర్మ్ పాలసీకి అప్లై చేసేప్పుడు హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ మర్చిపోవద్దు. ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.10 లక్షలు అనుకుందాం. దానికి 15 రెట్లు మాత్రమే టర్మ్ పాలసీ వస్తుంది. అంటే సుమారు రూ.1.5 కోట్ల పాలసీ తీసుకోవచ్చు. ఇప్పటికే మీకు రూ.50 లక్షల టర్మ్ పాలసీ ఉంటే, మరో రూ.1 కోటి వరకు మాత్రమే పాలసీ తీసుకోవచ్చు. అలా కాదని మీరు రూ.2 కోట్ల పాలసీకి అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు ఎన్ని పాలసీలు తీసుకున్నా క్లెయిమ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాదు. కాకపోతే ఏదైనా మోసం ఉందని ఇన్స్యూరెన్స్ కంపెనీ గుర్తిస్తే పాలసీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. పాలసీ తీసుకునే సమయంలో మీ వయస్సు, వృత్తి, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, వార్షికాదాయం లాంటి వివరాలన్నీ సరిగ్గా వెల్లడించాలి.

First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance