బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో రుణాలు తీసుకోవాలనుకుంటే ఏదైనా తాకట్టు, తనఖా, కుదువ పెట్టడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తాయి బ్యాంకులు. బ్యాంకులు కొల్లాటరల్ రుణాలు (Collateral Loans) ఇచ్చేందుకే ఎక్కువగా సుముఖతతో ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించకపోతే తమకు రిస్క్ తక్కువగా ఉంటుందని బ్యంకులు భావిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇళ్లు, ఎల్ఐసీ పాలసీలను (LIC Policy) కొల్లాటరల్‌గా పెట్టుకొని రుణాలు ఇస్తుంటాయి బ్యాంకులు. ఇలాంటి రుణాలు తీసుకునే వ్యక్తులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి. అవేంటో తెలుసుకోండి.
ఎవరికైనా ఇల్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివి లేనప్పుడు తమ ఎల్ఐసీ పాలసీని చూపించి లోన్ తీసుకోవచ్చు. అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి రుణాలు తీసుకోవడం సులువు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పాలసీదారులకు వారి పాలసీలపై రుణాలు ఇస్తుంటాయి.
SBI Account: మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? కారణమిదే
మీరు ఏదైనా తాకట్టు పెట్టి లేదా కొల్లాటరల్‌గా చూపించి తీసుకునే రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఏ ప్రూఫ్ లేకుండా తీసుకునే రుణాల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే తక్కువ వడ్డీకి లోన్ వచ్చే ఆప్షన్స్ ఎంచుకోవాలి. మీ దగ్గర ఎల్ఐసీ పాలసీ ఉంటే ఆ పాలసీ చూపించి లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తిరిగి చెల్లించే మొత్తం తగ్గుతుంది.
ఎల్ఐసీ పాలసీలతో రుణాలు తీసుకునే వ్యక్తులు ఓ కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి పాలసీని కొల్లాటరల్ చూపించి లోన్ తీసుకున్నారనుకుందాం. లోన్ మొత్తం తిరిగి చెల్లించకుండానే సదరు వ్యక్తి మరణిస్తే, పాలసీ డబ్బులు మొత్తం నామినీకి రావు. అందులో లోన్ ఎంత చెల్లించాలో అంత బ్యాంకుకు వెళ్తుంది. మిగతా మొత్తం నామినీకి వస్తుంది.
Credit Card Rule: క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేదా? కొత్త రూల్‌తో కాస్త ఊరట
ఇక కొన్ని ఫైనాన్స్ సంస్థలు పాత పాలసీలపై రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపవు. కొత్త పాలసీ తీసుకొని, దానిపై లోన్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తాయి. కేవలం లోన్ కోసమే కొత్త పాలసీ తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మీ దగ్గరున్నా పాలసీని కొల్లాటరల్ స్వీకరించి అప్పు ఇచ్చే సంస్థలనే ఎంచుకోవాలి.
ఒకవేళ మీదగ్గర ఎల్ఐసీ పాలసీ ఉన్నట్టైతే, మీరు నేరుగా ఎల్ఐసీ నుంచి లోన్ తీసుకోవడమే ఉత్తమం. మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రీమియంలు చెల్లించారో, ఎంత మొత్తం చెల్లించారో లెక్కించి, మీకు ఇవ్వాల్సిన లోన్‌ను నిర్ణయిస్తుంది ఎల్ఐసీ. పాలసీ సరెండర్ వ్యాల్యూలో 90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ పాలసీ సరెండర్ వ్యాల్యూ రూ.5,00,000 ఉందనుకుందాం. మీకు గరిష్టంగా రూ.4,50,000 వరకు లోన్ వస్తుంది. వడ్డీ రేటు 9 శాతం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Personal Finance, Personal Loan