Home /News /business /

ARE YOU TAKING LOAN FOR APPLYING IPO KNOW ABOUT RISKS AND DEBT TRAP SS GH

Loans for IPOs: ఐపీఓ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Loans for IPOs: ఐపీఓ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Loans for IPOs: ఐపీఓ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Loans for IPOs | స్టాక్ మార్కెట్లోకి వరుసగా ఐపీఓలు క్యూకట్టాయి. మరి మీరు ఈ ఐపీఓలో (IPO) ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి లోన్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఈ రిస్కులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి.

ఈ ఏడాది ఐపీఓ (Initial Public Offering)ల జాబితాలో ఎక్కువ కంపెనీలు చేరాయి. 43 సంస్థలు ఐపీఓల ద్వారా నిధులు సమీకరించాయి. దాదాపు రూ.78,280 కోట్ల నిధులను సమకూర్చుకున్నాయి. అధికంగా లాభాలు పొందాలనే ఆశతో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (high net-worth individuals- HNI) ఐపీఓల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఐపీఓలో లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీలు అన్ని సార్లు విజయవంతం కాలేవు. అలాంటి పరిస్థితిలో హెచ్ఎన్ఐ పెట్టుబడుదారులు భారీ నష్టాలతో నిష్క్రమించాల్సి ఉంటుంది.

ఇటీవల కాలంలో మార్కెట్ సెంటిమెంట్లు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు గరిష్ఠ స్థాయిలను(60000, 18000) అందుకున్నాయి. ఫలితంగా ఐపీఓలో రష్ ఎక్కువైంది. ఈ ఏడాది అక్టోబరు, డిసెంబరు మధ్య కాలంలో పీబీ ఫిన్‌ టెక్ (ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పాలసీ బజార్), ఎంక్యూర్ ఫార్మాసూటికల్స్, నైకా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, మొబిక్విక్ లాంటి సంస్థలు ఐపీఓ జాబితా కానున్నాయి. కాబట్టి ఈ మార్కెట్ మైకంలో పడి ఐపీఓలో పెట్టుబడులు పెట్టేముందు ట్రేడింగ్ లేదా రుణం తీసుకోవడంలో ఉన్న నష్టాలను అర్థం చేసుకోవాలి.

SBI IPO Loan: రేపే నైకా ఐపీఓ ప్రారంభం... ఇన్వెస్ట్‌మెంట్ కోసం లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ

ఐపీఓ నిధులు ఎలా పనికొస్తాయి?


ఐపీఓ ఫండింగ్ చిన్న మార్జిన్ అందించడం వల్ల పెట్టుబడిదారులకు ఈక్విటీ షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుకల్పిస్తుంది. అయితే ఆర్థిక సంస్థలు.. బ్యాలెన్స్ అమౌంట్ కోసం నిధులు సమకూరుస్తాయి. కొన్ని NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లు ఐపీఓల కోసం రుణాలు అందిస్తాయి. ఫలితంగా హెచ్ఎన్ఐ, రిటైల్ పెట్టుబడిదారులకు పరపతి సృష్టి జరుగుతుంది. దీంతో వారు అధిక కేటాయింపుల ఆశతో మరిన్నింటికి దరఖాస్తు చేసుకుంటారు. ఈ స్వల్పకాలిక రుణాలకు చాలా సందర్భాల్లో ఏడు రోజుల కాలపరిమితి ఉంటుంది. ఐపీఓ ముగింపు రోజు నుంచి లిస్టింగ్ తేదీ వరకు ఉంటుంది. ఈ రుణాలు రీపేమెంట్ చేయడానికి మూడు నెలల వరకు సమయం ఉంటుంది.

రుణం పొందేందుకు రుణ గ్రహీతలు తప్పనిసరిగా మార్జిన్ మొత్తాన్ని ముందుగా చెల్లించాలి. ఉదాహరణకు.. ABC, XYZ అనే రెండు కంపెనీలున్నాయి.. ఈ రెండూ కంపెనీలు ఐపీఓ కింద 5 వేల షేర్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయనుకుందాం. ఒక్కో షేరుకు ఐపీఓ రూ.100 కేటాయిస్తే.. మొత్తం రూ.5 లక్షలు వస్తుంది. ఆ మొత్తాన్ని రుణంగా తీసుకొని మీరు పెట్టుబడి పెడతారు. ఈ సందర్భంలో రుణ గ్రహీత సొంతంగా ఎంతో కొంత మొత్తాన్ని పెట్టాలని మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు రూ.20,000 మొత్తాన్ని మీరు మార్జిన్ గా కేటాయిస్తే మిగిలిన రూ.4.80 లక్షలను మీరు రుణంగా పొందుతారు. ఏడు రోజుల కాలపరిమితి ఉండే ఈ లోన్ కు 8 శాతం వడ్డీ ఉంటుంది. అంటే మొత్తంపై రూ.736 వడ్డీ వస్తుంది. మీకు లాభం వచ్చినా రాకపోయినా లిస్టింగ్ తేదీ నాడు ఈ రూ.736 తప్పకుండా చెల్లించాలి.

LPG Gas Cylinder Price: సిలిండర్ ధర రూ.1,000 దాటుతుందా? నాలుగు రోజుల్లో ఏం జరగబోతోంది?

పై విధంగా కాకుండా ABC కంపెనీ ప్రీమియం లిస్టులో షేర్ వ్యాల్యూను రూ.110లు ఉంచిందనుకుందాం. ఇక్కడ మీరు 500 షేర్లను కలిగి ఉన్నారు. మీరు రుణం తీసుకోకుండా ఉంటే లిస్టింగ్ తేదీన ఒక్కో షేరుకు రూ.10 లాభం పొంది ఉండేవారు. అయితే మీరు రుణం తీసుకుంటే వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి షేరుకు లాభం రూ.8.53 వస్తుంది.

"రుణ మార్జిన్ అవసరాన్ని పొందడానికి, రుణదాతలు నిర్దిష్ట IPOలో నష్టాన్ని అంచనా వేస్తారు. బహుళ అంచనాలు, లెక్కల ఆధారంగా రుణదాతలు ఒక్కో సందర్భానికి మారుతూ ఉండే మార్జిన్ అవసరంతో బయటకు వస్తారు. ఇది 5, 10, 12, 15 శాతం మధ్య ఎక్కడైనా ఉండవచ్చు. కొన్నిసార్లు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు.

మల్టిపుల్ ఛార్జీలు


"ఇటీవల కొన్ని ఐపీఓలు మొదట ఊహించిన విధంగా లిస్టింగ్ ప్రీమియం పొందలేదు. ఫలితంగా ఐపీఓ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం రుణదాతలు 7.5 నుంచి 8.5 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. లిస్టింగ్ లో నష్టపోయే అవకాశం తగ్గినప్పుడు ఈ రేట్లు 7 నుంచి 7.5 శాతానికి తగ్గుతాయి" అని దీపక్ తెలిపారు. ఈ రుణాల్లో వడ్డీ ఖర్చుతో పాటు రుణదాతల ప్రాసెసింగ్ ఫీజులు, రుణగ్రహీతలతో తీసుకున్న రుణ ఒప్పందానికి స్టాంప్ డ్యూటీని కూడా విధిస్తారు.

Dhanteras 2021: ధంతేరాస్ రోజున బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే

రిస్క్‌లు ఉంటాయి


రుణంగా తీసుకున్న డబ్బుతో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకుని ఉంటుంది. ఐపీఓ నిధుల ద్వారా కొన్ని స్టాక్ లిస్టింగ్ లో మార్కెట్ బలంగా ఉన్నప్పుడు పెట్టుబడుదారులు ఎక్కువగా ఆశిస్తారు. ఫలితంగా నష్టపోతున్నారని, అప్పుగా తీసుకున్న డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు మీ రిస్క్ ను ఎల్లప్పుడు చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లిస్టింగ్ ప్రీమియం ఊహించినదానికంటే తక్కువ ఉంటే లేదా లిస్టింగ్ ధర ఐపీఓ ఇష్యూ ధర కంటే తక్కువగా ఉంటే పెట్టుబడుదారులు డబ్బు సంపాదించలేరు. ఫలితంగా వడ్డీ ఖర్చుల కారణంగా స్టాక్స్ ను నష్టానికి విక్రయించవచ్చు. ఉదాహరణకు కళ్యాణ్ జ్యూవెలర్స్ ఈ ఏడాది ఇష్యూ ధరపై 15 శాతం తగ్గింపును పొందింది. అదే గత ఏడాది ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూ ధరపై 13 శాతం తగ్గింపును పొందింది.

Aadhaar Hackathon 2021: ఆధార్‌ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం... రూ.3,00,000 గెలుచుకునే అవకాశం

SEBI విశ్లేషణ ప్రకారం 2018 జనవరి 1 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో 29 IPOల్లో, సగటున, HNI కేటగిరీలో సుమారు 60 శాతం మంది దరఖాస్తుదారులు ఎటువంటి కేటాయింపును పొందలేదని కనుగొంది. 75 లక్షల వరకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా ఎలాంటి కేటాయింపులు జరగని సందర్భాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

"ఐపీఓ ఫండింగ్ అనేది లిస్టింగ్ రోజున ఐపీఓల ధరను తప్పుదారి పట్టిస్తోంది. ఎందుకంటే చాలా మంది హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్టర్లు ఫండింగ్ ద్వారా లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్ట్ చేసి కేటాయించిన స్టాక్‌లను మొదటి రోజునే విక్రయించారు" అని ఓ విశ్లేషకులు తెలిపారు.

రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీఓ ఫండింగ్‌లో పాల్గొనాలా?


రుణంగా తీసుకున్న మొత్తంలో ఐపీఓలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఆధారంగా రిస్క్ ఉంటుంది. ఇది హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్లకు ఉత్తమ ఎంపిక. కానీ రిటైల్ పెట్టుబడిదారులకు అంత మంచిదికాదని నిపుణులు అంటున్నారు. రిటైల్ పెట్టుబడుదారులు ఐపీఓ ఫండింగ్ విధానానికి దూరంగా ఉండాలని దీపక్ జసాని అన్నారు. వారు తమ పొదుపులో కొంత భాగాన్ని ఐపీఓలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడాలి కానీ రుణం తీసుకోకూడదని తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank loan, Bank loans, Investment Plans, IPO, Personal Finance, Personal Loan, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు