హోమ్ /వార్తలు /బిజినెస్ /

Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

ఒక్క రోజులో లోన్ ఇస్తున్నారు కదా అని తొందరపడి తీసుకోవద్దు. అసలు ఆ లోన్‌కు ప్రాసెసింగ్ ఫీజులు, ఛార్జీలు ఎంతెంత వసూలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి.

  క్రెడిట్ కార్డ్... అవసరానికి ఆదుకునే నేస్తం లాంటిది. క్రెడిట్ కార్డును అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకుంటేనే మంచిది. జేబులో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా వాడేస్తే చివరకు అప్పులపాలవ్వాల్సిందే. ఈ మధ్య క్రెడిట్ కార్డులపై అప్పులు ఇస్తున్నాయి బ్యాంకులు. ఈ లోన్‌కు పర్సనల్ లోన్ లాగా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. జస్ట్ మీరు లోన్ తీసుకోవడానికి సరే అంటే చాలు ఒక్కరోజులో డబ్బులు మీ అకౌంట్‌లో పడిపోతాయి. అదే పర్సనల్ లోన్ తీసుకోవాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుంది. అయితే క్రెడిట్ కార్డుపై మీకు ఇచ్చే లోన్ మీ క్రెడిట్ లిమిట్ కన్నా ఎక్కువ ఉండదు. వడ్డీ రేట్లు 13 నుంచి 21 శాతం మధ్య ఉంటాయి. పర్సనల్ లోన్ కన్నా క్రెడిట్ కార్డుపై ఇన్‌స్టంట్‌ లోన్ సులువుగా వస్తుంది కదా అని అనుకుంటే పొరపాటే. అందులోనూ లొసుగులు ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు.

  Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

  loan on credit card, credit card loan vs personal loan, credit card loan interest rate, personal loan on credit card, loan against credit card, credit card personal loan, loan on credit card axis bank, loan on credit card icici, loan on credit card kotak, loan on credit card sbi, loan on credit card citibank, hdfc credit card loan interest rate, క్రెడిట్ కార్డ్ లోన్, లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ ఇంట్రెస్ట్

  ప్రాసెసింగ్ ఫీజ్: ఒక్క రోజులో లోన్ ఇస్తున్నారు కదా అని తొందరపడి తీసుకోవద్దు. అసలు ఆ లోన్‌కు ప్రాసెసింగ్ ఫీజులు, ఛార్జీలు ఎంతెంత వసూలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి. లోన్ అమౌంట్‌పై 1 నుంచి 5 శాతం ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

  ప్రీ-క్లోజింగ్ లోన్: పర్సనల్ లోన్లపై ప్రీ క్లోజింగ్ సదుపాయం ఉంటుంది. అంటే... మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లోన్ మొత్తం ఒకే వాయిదాలో చెల్లించొచ్చు. మరి మీరు క్రెడిట్ కార్డుపై తీసుకునే లోన్‌పై ప్రీ-క్లోజింగ్ సదుపాయం ఉందో లేదో తెలుసుకోవాలి. దాంతో పాటు ప్రీ-క్లోజింగ్ ఛార్జీల గురించీ ఆరా తీయాలి.

  Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

  loan on credit card, credit card loan vs personal loan, credit card loan interest rate, personal loan on credit card, loan against credit card, credit card personal loan, loan on credit card axis bank, loan on credit card icici, loan on credit card kotak, loan on credit card sbi, loan on credit card citibank, hdfc credit card loan interest rate, క్రెడిట్ కార్డ్ లోన్, లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ ఇంట్రెస్ట్

  టెన్యూర్: లోన్ తీర్చడానికి మీరు ఎంత కాలపరిమితి తీసుకుంటున్నారన్నది ముఖ్యం. పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు 60 నెలల వరకు గడువు లభిస్తుంది. అదే క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటే మీకు గరిష్టంగా 24 నెలలు మాత్రమే అప్పు తీర్చడానికి గడువు లభిస్తుంది. సెలెక్టడ్ కస్టమర్లకు మాత్రమే 24 నెలల కన్నా ఎక్కువ గడువు ఇస్తాయి బ్యాంకులు.

  లేట్ పేమెంట్స్: మీరు ఏ లోన్ తీసుకున్నా లేట్ పేమెంట్స్‌తో చిక్కులు తప్పవు. క్రెడిట్ కార్డుపై లోన్‌కూ అంతే. క్రెడిట్ కార్డుపై మీరు లోన్ సరిగ్గా చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు టాప్-అప్ లోన్స్ ఆఫర్ చేస్తాయి. టాప్-అప్ లోన్ పొందాలంటే మంచి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరి. అందుకే లేట్ పేమెంట్స్ లేకుండా చూసుకోవాలి.

  Read this: Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్

  loan on credit card, credit card loan vs personal loan, credit card loan interest rate, personal loan on credit card, loan against credit card, credit card personal loan, loan on credit card axis bank, loan on credit card icici, loan on credit card kotak, loan on credit card sbi, loan on credit card citibank, hdfc credit card loan interest rate, క్రెడిట్ కార్డ్ లోన్, లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ ఇంట్రెస్ట్

  లోన్ డిఫాల్ట్, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ ఒకటి కాదు: క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ డిఫాల్ట్, క్రెడిట్ కార్డుపై తీసుకున్న లోన్ డిఫాల్ట్ వేర్వేరు. మీరు క్రెడిట్ కార్డుపై తీసుకున్న లోన్ సరిగ్గా చెల్లించకపోతే లోన్ డిఫాల్ట్‌గా పరిగణిస్తారు తప్ప క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ డిఫాల్ట్‌గా కాదు. అయితే లోన్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

  అందుకే ఇకపై ఏవైనా బ్యాంకులు మీ క్రెడిట్ కార్డులపై లోన్ ఇస్తామని అంటే... వెంటనే ఓకే చెప్పకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. అన్నీ తెలుసుకున్నాకే క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోండి.

  Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

  ఇవి కూడా చదవండి:

  MI MIX 3 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన షావోమీ... ఫీచర్లు ఇవే

  Fixed deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఇవే...

  SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం

  First published:

  Tags: Credit cards, Personal Finance

  ఉత్తమ కథలు