హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance Policy: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా.. అత్యంత ముఖ్యమైన విషయం ఇదే..!

Health Insurance Policy: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా.. అత్యంత ముఖ్యమైన విషయం ఇదే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. బీమా మొత్తాన్ని పెంచుకోవచ్చని చాలా మంది అపోహ పడుతుంటారు.అయితే,మొదటగా బీమా కొనుగోలు చేసి.. ఆ తర్వాత బీమా మొత్తాన్ని పెంచుకోవాలనుకుంటే అది సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు ధరలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయడం చాలా ముఖ్యం.

ఇంకా చదవండి ...

Health Insurance Policy: ఆరోగ్య బీమా ముఖ్యమని తెలిసినా చాలా మంది దానిని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుంటారు. అనారోగ్యం బారిన పడినప్పుడు.. ఆరోగ్య బీమా ముందస్తుగానే కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని చింతిస్తుంటారు. నిజానికి యుక్తవయసులోనే ఆరోగ్య బీమా కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ రోజుల్లో అనారోగ్యం బారినపడే వారిలో యువత కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఆరోగ్య బీమాను మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. బీమా మొత్తాన్ని పెంచుకోవచ్చని చాలా మంది అపోహ పడుతుంటారు.అయితే,మొదటగా బీమా కొనుగోలు చేసి.. ఆ తర్వాత బీమా మొత్తాన్ని పెంచుకోవాలనుకుంటే అది సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు ధరలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయడం చాలా ముఖ్యం.

ఎప్పుడంటే అప్పుడు బీమా కొనుగోలు చేయలేరు

బీమా అనేది కావాలనుకున్నప్పుడు వెంటనే కొనుగోలు చేసే వస్తువు కాదు. ఆరోగ్య చరిత్ర వివరాలతో పాటు బీమా కంపెనీలకు పంపించే ప్రతిపాదననే బీమా అంటారు. పాలసీ అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే బీమా కంపెనీలు ప్రతిపాదనను ఆమోదిస్తాయి. లేదా బీమా ప్రతిపాదనను తిరస్కరించే హక్కును కూడా కలిగి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని.. అలాంటప్పుడు తమ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించారని కంపెనీలతో గొడవపడుతుంటారు. అయితే కంపెనీలు ప్రస్తుత ఆరోగ్య విషయాలు మాత్రమే కాదు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా అంచనా వేస్తాయి. దానికి అనుగుణంగా బీమా అందించే విషయంలో నిర్ణయం తీసుకుంటాయి. పాలసీదారుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే.. కంపెనీలు ఇన్సూరెన్స్ కవర్స్ పొడిగిస్తాయి. అందుకే యుక్త వయసులో ఉన్నప్పుడేతగిన పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం.

చాలా మంది ప్రజలు ప్రస్తుత వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీ తీసుకుంటారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు బీమా తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాలంతో పాటు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో వైద్య ఖర్చులూ పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే వైద్య ఖర్చులు పెరిగినా బీమా సంస్థలు మాత్రం పాలసీదారుడి కవరేజీలో రూపాయి కూడా పెంచవు సుమా! ఉదాహరణకు ద్రవ్యోల్బణం కారణంగా వైద్య చికిత్స ఖర్చులు 15 శాతం పెరుగుతాయని అంచనా వేసుకుంటే.. ఈరోజు చికిత్సకు రూ. 10 లక్షలు ఖర్చయితే.. 10 ఏళ్ల తర్వాత అదే చికిత్సకు రూ. 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది 20 ఏళ్లలో రూ. 1.6 కోట్లకు చేరుకుంటుంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని 20-30 ఏళ్ల తర్వాత అయ్యే వైద్యచికిత్స ధరలకు అనుగుణంగా ఆరోగ్య బీమా కవర్‌ను కొనుగోలు చేయాలి.

చిన్న వయసులో పాలసీ తీసుకోవాలనుకుంటే.. ఎక్కువ కవరేజ్‌తో కూడిన అత్యుత్తమ పాలసీ కొనుగోలు చేయడం ఉత్తమం. నిజానికి ఇప్పటికే పలు ఆరోగ్య బీమా కంపెనీలు రూ. 3 కోట్ల వరకు కవరేజ్‌ అందించడం ప్రారంభించాయి. కోటి రూపాయల ఆరోగ్య కవరేజీ పాలసీ కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్నది. అయితే మొత్తం ప్రీమియంలను తగ్గించడానికి మీరు రూ. 10 లక్షల బేస్ కవరేజ్‌తో పాటు రూ. 90 లక్షల టాప్-అప్ కొనుగోలు చేయవచ్చు. రూ. 10 లక్షల బేస్ పాలసీ.. రూ .90 లక్షల టాప్-అప్ కవరేజ్‌తో బీమా తీసుకున్న 35 ఏళ్ల వ్యక్తి వార్షిక ప్రీమియం రూ.13,062 చెల్లించవలసి ఉంటుంది. ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు