వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. వర్షంలో బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఇక వాహనాల్లో తిరగాలంటే వామ్మో అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిది. అయితే వర్షంలో టూవీలర్ (Two Wheeler) నడపాలంటే రిస్క్ ఎక్కువ. రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు. ఎక్కడ మ్యాన్‌హోల్ తెరిచి ఉంటుందో తెలియదు. మొత్తం వర్షపు నీరే కనిపిస్తున్నప్పుడు రోడ్లపై టూవీలర్లు నడపడం కష్టమే. వర్షం సాధారణంగా ఉన్నప్పుడు కూడా బైక్ లేదా స్కూటర్ (Scooter) చాలా జాగ్రత్తగా నడపాలి. లేకపోతే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. మరి వర్షంలో టూవీలర్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.
టూవీలర్లకు టైర్లు బాగుండటం చాలా ముఖ్యం. బైక్‌ను రోడ్డుకు కలిపేది టైర్లే. కాంటాక్ట్ ప్యాచ్ బలహీనంగా ఉండటం మంచిది కాదు. రేస్ ట్రాక్‌పై దూసుకెళ్లే స్పోర్ట్స్ బైకులతో పోలిస్తే రోడ్లపై తిరిగే టూవీలర్ల ట్రెడ్, ప్యాటర్న్ భిన్నంగా ఉంటుంది. ఇండియాలో ఏడాదంతా వర్షాలు కురవవు కాబట్టి బైకుకు రెయిన్ టైర్ అవసరం లేదు. అయితే పొడి వాతావరణంలో, తడి వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగేలా టైర్లు ఉండాలి. టైర్లలో ఏదైనా లోపం ఉంటే వెంటనే సరిచేయించాలి.
IRCTC Rules: రైలులో గ్రూప్ టూర్ వెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి
బండికే కాదు, బండి నడిపేవారికి కూడా వర్షంలో రక్షణ అవసరం. వర్షంలో తడుస్తూ డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే వర్షాకాలంలో రైడింగ్ గేర్ సిద్ధం చేసుకోవాలి. వర్షంలో తడవకుండ బండి నడుపుతూ వెళ్లొచ్చు. వాటర్ ప్రూఫ్ రైడింగ్ గేర్ కొనడం మంచిది. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వర్షాకాలంలో రెండు నెలలు ఉపయోగించడానికి కాబట్టి ఖరీదైనవి కొనాల్సిన అవసరం లేదు.
వర్షం మొదలవుతున్న సమయంలో టూవీలర్‌పై రోడ్లపై వెళ్లకపోవడం మంచిది. వర్షం ప్రారంభంలోనే రోడ్లపై జారిపడే అవకాశాలు ఎక్కువ. వర్షం తగ్గే అవకాశం ఉందేమో చూడాలి. తగ్గకపోతే నిదానంగా బయల్దేరాలి. అప్పుడు కూడా రోడ్లపై కొన్ని స్పాట్స్ డేంజరస్‌గా ఉంటాయి. కాబట్టి వేగంగా కాకుండా నెమ్మదిగా వెళ్లడం మంచిది. నీళ్లు ఎక్కువగా నిలిచి ఉన్న రోడ్లపై ప్రయాణించకపోవడమే మంచిది.
Post Office Scheme: రిస్కు లేకుండా తక్కువ టైమ్‌లో రూ.2.78 లక్షల రిటర్న్స్... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే
టూవీలర్‌ను వేర్వేరు పరిస్థితుల్లో, వేర్వేరు రోడ్లపై ఎలా నడపాలన్న దానిపై శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఉంటాయి. మీకు దగ్గర్లో అలాంటి సెంటర్లు ఉంటే వెళ్లండి. అక్కడ టిప్స్, ట్రిక్స్ నేర్చుకోవచ్చు. ఏదేమైనా రోడ్లపై రిస్కులు మాత్రం చేయొద్దు. అవసరం అయితే తప్ప వర్షంలో డ్రైవ్ చేయొద్దు. ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ కంఫర్ట్ జోన్‌లో ఉండేందుకే ప్రయత్నించండి.
తప్పనిపరిస్థితుల్లో వర్షంలో డ్రైవ్ చేయాల్సి వస్తే ముందు ఉన్న వాహనాలకు, మీ బండికి డిస్టెన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ట్రక్కులు, లారీల వెనుక డ్రైవ్ చేసేప్పుడు వాటి టైర్ల నుంచి బురద చిమ్ముతూ ఉంటుంది. అందుకే వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Rain, Two wheeler