Home /News /business /

ARE YOU PURCHASING SUPER TOP UP HEALTH INSURANCE PLAN KNOW IMPORTANT POINTS TO REMEMBER SS GH

Super Top-UP: సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు తెలుసుకోండి

Super Top-UP: సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Super Top-UP: సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఈ విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Super Top UP Health Insurance Plan | మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉందా? సూపర్ టాప్ అప్ ప్లాన్ (Top UP Plan) తీసుకోవాలని అనుకుంటున్నారా? సూపర్ టాప్ అప్ ప్లాన్‌తో లాభాలేంటో, ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోండి.

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా (Health Insurance) ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరంగా మారింది. మార్కెట్లో అనేక హెల్త్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి కొంత మొత్తం వరకే ఆసుపత్రి బిల్లులను చెల్లిస్తాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సాధారణ ఆరోగ్య బీమా ద్వారా వచ్చే మొత్తం ఆసుపత్రి ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. అందుకే ఆరోగ్య బీమాకు అదనంగా సూపర్ టాప్‌అప్‌ ప్లాన్‌ను (Super Top-Up) ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. వీటి ద్వారా పెరిగిపోయిన ఆసుపత్రి ఖర్చులు తట్టుకోవచ్చని బీమా నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా అదనపు ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు.

సూపర్ టాప్‌ అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రయోజనాలు, పీఛర్లు


ఇప్పటికే మీరు చెల్లిస్తున్న ఆరోగ్య బీమా ప్లాన్ ద్వారా కవరేజీ పొందుతున్న మొత్తానికి సూపర్ టాప్‌అప్‌ పాలసీ ద్వారా అదనంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా డిడక్టబల్స్ (Deductibles) ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరంలో ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకున్నా తగ్గింపులను ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (Super Top UP Health Insurance Plan) ముగిసిపోయే వరకు ఇది ఉపయోగపడుతుంది. బేస్ ప్లాన్ కవరేజీ డిడక్టబుల్‌కు సమానంగా ఉండే విధంగా సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుంది.

Credit Card: ఫ్యూయెల్ ఆఫర్ ఉన్న క్రెడిట్ కార్డు తీసుకున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

ప్రయోజనాలు


పాలసీదారులు ప్రస్తుత పాలసీ నుంచి డిడక్టబుల్ లిమిట్ కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఇది హామీ ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తానికి బీమా చేయవచ్చు. తక్కువ ప్రీమియంతో బిజినెస్ ప్లాన్ కవరేజీ పెంచుకోవచ్చు. బీమా చేసిన మొత్తంలో ఏ మాత్రం తగ్గకుండా కవరేజీ అందిస్తుంది.

వయోజనులకు కవరేజీ ఎలా ఉంటుంది


సహజంగా వయోజనులకు ఆరోగ్య బీమా ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా తక్కువ ప్రీమియంతో కవరేజీ పెంచుకోవచ్చు.

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స


బీమా కంపెనీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో నగదుతో పనిలేకుండా చికిత్స చేయించుకోవచ్చు. కాస్ట్ రీఎంబర్స్‌మెంట్ కూడా అందిస్తున్నారు.

LIC Policy: ఈ పాలసీలో రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్

పన్ను రాయితీలు


ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80డి కింద సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులపై పన్ను రాయితీ లభిస్తుంది

ఇతర ప్రయోజనాలు


చాలా పాలసీలు విస్తృత కవరేజీ ప్రయోజనాలు అందించడం లేదు. క్రిటికల్ కవర్ కూడా అందించడం లేదు. సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఉద్యోగులు పొందలేని కవరేజీ కూడా పొందవచ్చు. దీని ద్వారా కోవిడ్ 19 కు చికిత్స కూడా పొందవచ్చు.

పాలసీ తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు


సరైన డిడక్టబుల్ లిమిట్ ఉందా లేదా అనేది పాలసీదారుడు పరిశీలించాలి. సాధారణ బీమా పాలసీకి అదనంగా ప్రయోజనాలు అందిస్తుందో లోదో తెలుసుకోవాలి. ఈ ప్లాన్ పరిధిలో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రుల లిస్ట్ చెక్ చేయాలి. రెగ్యులర్ కవరేజీ ఆసుత్రులు ఈ పాలసీ నెట్‌వర్కులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. సూపర్ టాప్‌అప్‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఖర్చుతో కూడుకున్నవే. అయితే తీవ్రమైన అనారోగ్యాల కవరేజీకి మాత్రం చక్కగా ఉపయోగపడతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు