కరోనా సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు డిజిటల్ సేవలను మరింత మెరుగుపరిచాయి. దీనితో ఆన్‌లైన్‌లోనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనడం చాలా ఈజీ అయిపోయింది. కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉంటే కొన్ని గంటల్లోనే పాలసీని జారీ చేస్తున్నాయి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్. మార్కెట్‌లో ఉన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను కంపేర్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. మరి ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేసే ముందు 5 ముఖ్య సూత్రాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలనుకునే వారు కచ్చితంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రీసెర్చ్ చేయాలి. తగిన మొత్తంతో జీవిత బీమా పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మొత్తంతో బీమా తీసుకోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎంత మొత్తంలో బీమా తీసుకోవాలో తెలుసుకోవడానికి ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ బాగా ఉపయోగపడుతుంది. మీ లైఫ్ స్టైల్, ఫ్యూచర్ గోల్స్, ఆర్థిక అవసరాల ప్రకారం ఆన్‌లైన్ కాలిక్యులేటర్ తగిన పాలసీని సూచిస్తుంది.
New Rules from August 1: రేపటి నుంచి ఈ కొత్త రూల్స్... మీకు లాభమా? నష్టమా? తెలుసుకోండి
Bank Holidays in August 2021: ఖాతాదారులకు అలర్ట్... ఆగస్టులో బ్యాంకులకు హాలిడేస్ ఎప్పుడో తెలుసుకోండి
ఆన్‌లైన్ ప్రపంచంలో ఎన్నో ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉంటాయి. కానీ మనకి ఏది మంచి ప్రయోజనాలు ఇస్తుందనేది తీసుకోగలగాలి. ఫీచర్స్, బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నీ తెలుసుకోవాలి. ప్రతీ పాలసీని నిదానంగా పోల్చి చూడటం ద్వారా.. ఏది బెస్ట్ పాలసీ అనేది తెలుసుకోవచ్చు.
బీమా అందించే కంపెనీలకు తమ కస్టమర్ల క్లెయిమ్‌స్ ప్రకారం డబ్బు ఇవ్వగల సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. కస్టమర్లు క్లెయిమ్ చేసిన వెంటనే హామీ నెరవేరుస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ది ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Irdai) వెబ్ సైట్ లో ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఈ సైట్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పరిశీలించిన తర్వాతనే పాలసీ తీసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే.. ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
PF Withdrawal Rule: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక్క రోజులో రూ.1,00,000 అడ్వాన్స్
SBI Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరండి... ప్రతీ నెలా డబ్బులు పొందండి
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధిక కవర్ అమౌంటును ఎంపిక చేసుకోవాలి. పాలసీ కొనే సమయంలోనే కవర్ అమౌంట్ ఫిక్స్ అయి ఉంటుంది. తర్వాత మార్చడం కుదరదు. ఒకవేళ కవర్ అమౌంటు తక్కువగా ఉందని మీకు అనిపిస్తే కొత్త లైఫ్ పాలసీ తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఉన్నదాన్నే యాడ్-ఆన్స్ సహాయంతో అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రమాదవశాత్తు మరణం, తీవ్రమైన అనారోగ్యాలకు కవరేజ్ ఇచ్చే యాడ్-ఆన్స్ చాలా ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి చాలా జాగ్రత్తగా యాడ్-ఆన్స్ ఎంపిక చేసుకోండి.
ఆన్‌లైన్ అయిన ఆఫ్ లైన్ అయినా.. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీ వైద్య చరిత్ర, జీవనశైలి అలవాట్లు సహా అన్ని విషయాలు వెల్లడించాలి. అప్పుడే క్లెయిమ్ సెటిల్మెంట్ త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. క్లెయిమ్‌లను చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance, Life Insurance, Personal Finance