Home /News /business /

ARE YOU POSTPONING YOUR EMIS BEWARE OF EMI MORATORIUM SCAM SS

EMI moratorium: ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ... ఏం చేయాలంటే

EMI moratorium: ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ... ఏం చేయాలంటే
(ప్రతీకాత్మక చిత్రం)

EMI moratorium: ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ... ఏం చేయాలంటే (ప్రతీకాత్మక చిత్రం)

RBI moratorium on EMIs | మీరు ఈఎంఐ మారటోరియంకు అప్లై చేశారా? మీ ఈఎంఐలు వాయిదా వేయాలనుకుంటున్నారా? ఈ విషయం గుర్తుంచుకోండి.

    ఈఎంఐ మారటోరియం... ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి అన్ని లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను మూడు నెలలు వాయిదా వేసుకునే అవకాశం ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మారటోరియం ప్రకటించింది. బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటున్నారు. తమ ఈఎంఐలను వాయిదా వేస్తున్నారు. అయితే ఈఎంఐ మారటోరియం అంశం సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. దీన్ని అడ్వాన్‌టేజ్‌గా తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. కస్టమర్లను నిండా ముంచేస్తున్నారు.

    ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల కస్టమర్లకు కాల్ చేసి ఈఎంఐలు వాయిదా వేస్తామని నమ్మిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల కాలంలో ఈ కాల్స్ ఎక్కువయ్యాయి. కస్టమర్లకు ఫోన్ చేయడం, వారి అకౌంట్ వివరాలు, కార్డుల సమాచారం, ఓటీపీ, పిన్ లాంటివి తెలుసుకోవడం, ఆ వివరాలతో అకౌంట్ ఖాళీ చేయడం మామూలైపోయింది. కస్టమర్లు కూడా ఆ కాల్స్‌ని సులువుగా నమ్మేసి మోసపోతున్నారు. తమ ఈఎంఐలు వాయిదా వేద్దామన్న ఆలోచనలో అది మోసగాళ్ల ట్రాప్ అని గుర్తించలేకపోతున్నారు.

    ఇక్కడ కస్టమర్లు ఓ విషయం గుర్తుంచుకోవాలి. బ్యాంకులు ఈఎంఐ మారటోరియం విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను ఫాలో అవుతున్నాయి. ఏ బ్యాంకు కూడా కస్టమర్లకు కాల్ చేసి మారటోరియం విషయమై సంప్రదించట్లేదు. సంప్రదించదు కూడా. కస్టమర్లే బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మారటోరియం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కడ కూడా మీ కార్డు వివరాలు, పిన్, పాస్‌వర్డ్, ఓటీపీ లాంటివి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే కస్టమర్లు ఎట్టిపరిస్థితుల్లో ఇలంటి కీలక సమాచారాన్ని ఎవరికీ వెల్లడించొద్దు. ఫోన్‌లో అయినా, ఈమెయిల్‌లో అయినా ఎవరికీ వివరాలు చెప్పొద్దు.

    ఒకవేళ మీకు కూడా మారటోరియం విషయమై ఏవైనా కాల్స్ వచ్చినా, మీ అకౌంట్ వివరాలు చెప్పాలని ఎవరన్నా అడిగినా నమ్మకూడదు. ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తే బ్యాంకుకు కంప్లైంటే చేయండి. మీ బ్యాంకును మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ నుంచి సంప్రదించండి. పోలీసులు, సైబర్ సెల్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు.

    ఇవి కూడా చదవండి:

    EPFO: అకౌంట్‌లోకి పీఎఫ్ డబ్బులు రాలేదా? కారణాలివే

    Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి



    SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Banking, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు