Home /News /business /

ARE YOU PLANNING TO TAKE GOLD LOAN KNOW WHICH BANK OFFERING LOWER INTEREST RATES SS

Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే

Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan | ప్రభుత్వ బ్యాంకులు పోటాపోటీగా వడ్డీ రేట్లు (Interest Rates) తగ్గిస్తూ పసిడి రుణాలను ఇస్తున్నాయి. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం నుంచే ప్రారంభం అవుతాయి.

బ్యాంకులు పర్సనల్ లోన్ (Personal Loan) కన్నా బంగారంపై రుణాలు ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తుంటాయి. బంగారంపై ఇచ్చే రుణాలను బ్యాంకులు సెక్యూర్డ్ లోన్‌గా పరిగణిస్తాయి. అందుకే పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల కన్నా గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లే తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకే పసిడి రుణాలను ఇస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులు 7 శాతం నుంచే గోల్డ్ లోన్ ఇస్తున్నాయి. మరి ఏ బ్యాంకులో ఎంత గోల్డ్ లోన్ వస్తుంది? ఫ్రాసెసింగ్ ఫీజు ఎంత? తిరిగి ఎలా చెల్లించాలి? అనే వివరాలు తెలుసుకోండి.

State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల పసిడి రుణాలను అందిస్తోంది. ఎస్‌బీఐ పర్సనల్ గోల్డ్ లోన్, ఎస్‌బీఐ రియాల్టీ గోల్డ్ లోన్ పేరుతో రుణాలను ఇస్తోంది. వార్షిక వడ్డీ 7.5 శాతం. కనీసం రూ.20,000 నుంచి రూ.50,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 0.25 శాతం + జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.. 12 నెలల నుంచి 36 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి.

Tirupati Trains: వరంగల్, విజయవాడ నుంచి తిరుపతికి 10 ప్రత్యేక రైళ్లు

Canara Bank: కెనెరా బ్యాంక్ మూడు రకాల పసిడి రుణాలను అందిస్తోంది. అగ్రికల్చరల్ గోల్డ్ లోన్, స్వర్ణ గోల్డ్ లోన్, ఎంఎస్ఎంఈ గోల్డ్ లోన్ పేరుతో రుణాలు ఇస్తున్నాయి. వార్షిక వడ్డీ 7.35 శాతం నుంచి 7.65 శాతం. కనీసం రూ.5,000 నుంచి రూ.35,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 0.50 శాతం + జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 6 నెలల నుంచి 24 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి.

Bank of Mahararashtra: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహా గోల్డ్ పేరుతో గోల్డ్ లోన్ ఇస్తోంది. వార్షిక వడ్డీ 7 శాతం. కనీసం రూ.20,000 నుంచి రూ.5,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రుణాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2,000 మధ్య ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 12 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి.

Rs 2000 Notes: రూ.2,000 నోట్లు దొరకవా? ఆర్‌బీఐ ఏం చెబుతోందంటే

Punjab & Sind Bank: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉంటుంది. కనీసం రూ.1,00,000 నుంచి రూ.25,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రూ.2,00,000 వరకు రుణాలకు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు, అంతకన్నా ఎక్కువ రుణాలకు 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 12 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి.

Indian Bank: ఇండియన్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం. కనీసం రూ.25,000 నుంచి రూ.5,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రూ.300 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 12 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank loan, Canara Bank, Gold loans, Personal Finance, Personal Loan, State bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు