హోమ్ /వార్తలు /బిజినెస్ /

Term Insurance: అన్ని అవసరాలు తీర్చే జీవిత బీమా పాలసీ ఏది? ఏ వయసు వారికి ఎంత బీమా అవసరం?

Term Insurance: అన్ని అవసరాలు తీర్చే జీవిత బీమా పాలసీ ఏది? ఏ వయసు వారికి ఎంత బీమా అవసరం?

ప్రీమియం మొత్తం పెరిగితే బీమా కంపెనీల లాభాలు కూడా పెరుగుతాయి. అయితే ఇలా చేయడం వల్ల పాలసీకి డిమాండ్‌ను తగ్గించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చాలా అవగాహన ఉన్న సమయంలో ఇది జరుగుతంది. ప్రీమియం 40% వరకు పెరుగుతుందని.. బీమా ప్రీమియం మొత్తం 20% నుంచి 40%కి పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి.

ప్రీమియం మొత్తం పెరిగితే బీమా కంపెనీల లాభాలు కూడా పెరుగుతాయి. అయితే ఇలా చేయడం వల్ల పాలసీకి డిమాండ్‌ను తగ్గించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చాలా అవగాహన ఉన్న సమయంలో ఇది జరుగుతంది. ప్రీమియం 40% వరకు పెరుగుతుందని.. బీమా ప్రీమియం మొత్తం 20% నుంచి 40%కి పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి.

Term Insurance | మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎంత కవరేజీకి టర్మ్ ప్లాన్ (Term Plan) తీసుకోవాలో అర్థం కావట్లేదా? టర్మ్ ప్లాన్ ఎంచుకునేముందు ఏఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోండి.

కరోనా మహమ్మారి కారణంగా బీమా పాలసీలకు (Insurance Policy) ప్రాధాన్యత పెరిగింది. అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి జీవిత బీమా పాలసీలు కుటుంబాన్ని ఆదుకుంటాయని అంతా భావిస్తున్నారు. అందుకే టర్మ్ ప్లాన్ (Term Plan) అనేది ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో కీలకంగా మారిపోయింది. అయితే బీమా అవసరాలు వయసు, లక్ష్యాలు, బాధ్యతలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏ వయసులో ఎంత మొత్తంలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిదో చూద్దాం.

24 నుంచి 29 ఏళ్లు


సాధారణంగా ఈ వయసులో ఉన్న యువతకు బీమా అవసరం లేదు. అయితే ఎడ్యుకేషన్ లోన్ లేదా ఇతర లోన్లు తీసుకున్నవారు.. భవిష్యత్తు అవసరాల కోసం టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ తీసుకోవడం ఉత్తమం.

Income Tax: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారా? ఈ కొత్త సర్వీస్ మీకోసమే

30 నుంచి 35 ఏళ్లు


సాధారణంగా ఈ వయసులో వ్యక్తులు వివాహం చేసుకుని పిల్లలను కలిగి ఉంటారు. వీరిపై ఆధారపడిన జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల కోసం కచ్చితంగా బీమా పాలసీ కొనుగోలు చేయాలి. కనీసం రూ.1 కోటి లేదా వార్షిక ఆదాయానికి 8 నుంచి 10 రెట్లు కవరేజీ ఇచ్చే పాలసీని కొనుగోలు చేయాలి. రూ.1 కోటి టర్మ్ కవరేజీ కోసం ప్రతి నెలా రూ.1,100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

36 నుంచి 45 ఏళ్లు


ఈ వయసులో ఉన్న వ్యక్తుల పిల్లలు స్కూల్​ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కళాశాలల్లో జాయిన్​ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతో పిల్లల కోసం పెద్దవాళ్లు విద్యా రుణాలు కూడా తీసుకుంటారు. దీంతో పిల్లల విద్యకు అయ్యే ఖర్చులు పెరుగుతాయి. అంతేకాదు, బాధ్యతలు కూడా అనేక రెట్లు పెరుగుతాయి. అందువల్ల అన్ని రుణాలను కవర్ చేయగల బీమాను కొనుగోలు చేయాలి. మీ ఖర్చులకు 12 నుంచి 15 రెట్లు సమానమైన ప్లాన్‌ను కొనుగోలు చేయండి.

RBI Hackathon: ఈ 4 సమస్యలకు పరిష్కారం చెప్తే రూ.40 లక్షల బహుమతి

46 నుంచి 55 ఏళ్లు


ఈ వయసులోని వ్యక్తుల పిల్లలు కళాశాలలో విద్యాభ్యాసం చేస్తుంటారు. వారి ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్​ లోన్​ తీసుకుంటారు. అందుకే వీరికి టర్మ్​ బీమా పాలసీ తప్పనిసరి. ఒకవేళ, మీరు ఇప్పటికే టర్మ్ ప్లాన్‌ని కలిగి ఉన్నట్లయితే.. రూ.50 నుంచి రూ. 60 లక్షల అదనపు కవర్‌తో దాన్ని టాప్ అప్ చేయవచ్చు.

56 నుంచి 62 ఏళ్లు


సాధారణంగా ఈ వయసులో వారు పదవీ విరమణ చేస్తుంటారు. తద్వారా ఓవైపు ఆదాయం తగ్గడం, మరోవైపు రుణాల బకాయిలు భారంగా మారుతాయి. అందుకే మీకు బాకీ ఉన్న రుణాలు ఉంటే తప్పనిసరిగా కొత్త ప్లాన్‌ని కొనుగోలు చేయండి. అయితే ఎటువంటి రుణాలు లేకుండా పదవీ విరమణ పొందిన వ్యక్తికి బీమా అవసరం లేదు.

First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance

ఉత్తమ కథలు