హోమ్ /వార్తలు /business /

Income Tax Rules: కొత్త ఇల్లు కొంటున్నారా? ఇక ఆ బెనిఫిట్ లేదు

Income Tax Rules: కొత్త ఇల్లు కొంటున్నారా? ఇక ఆ బెనిఫిట్ లేదు

Income Tax Rules | కొత్త ఇల్లు కొనేవారికి ఏప్రిల్ 1 నుంచి ఓ బెనిఫిట్ నిలిపివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం రెండు బెనిఫిట్స్ మాత్రం ఎప్పట్లాగే పొందొచ్చు.

    మీరు కొత్త ఇల్లు కొంటున్నారా? ఇల్లు కొన్నా, అమ్మినా కొన్ని ట్యాక్స్ రూల్స్ ఉంటాయి. వాటిని తెలుసుకుంటే చిక్కుల్లో పడకుండా ఉంటారు. ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. మరి మీరు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనాలనుకుంటే సరసమైన గృహ నిర్మాణాలకు (Affordable Housing) సంబంధించి ఆదాయపు పన్ను (Income Tax) ప్రయోజనాలు 2022 ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం 1960 లోని 80ఈఈఏ ప్రకారం 2022 మార్చి 31 వరకు ఆస్తి విలువ రూ.45 లక్షలు మించకపోతే గృహ కొనుగోలుదారు రూ.1,50,000 ఆదాయపు పన్ను మినహాయింపు పొందడానికి అర్హులు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై లాంటి నగరాల్లో 60 చదరపు మీటర్లు లేదా 645 చదరపు అడుగులలోపు కార్పెట్ ఏరియా ఉన్న గృహాలకు, ఇక ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్లు లేదా 968 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న ఇళ్లకు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.

    Credit Card: క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తం వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త

    కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ బెనిఫిట్ ప్రకటించింది. కొత్తగా ఇల్లు కొనేవారు ఆదాయపు పన్ను చట్టం 1960 లోని సెక్షన్ 80ఈఈఏ ప్రకారం రూ.1,50,000 ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 (బి) కింద వడ్డీ చెల్లింపుల కోసం రూ. 2,00,000 మినహాయింపు లభిస్తున్న సంగతి తెలిసిందే. రెండూ కలిపి హోమ్ లోన్‌పై రూ.3,50,000 వరకు బెనిఫిట్ పొందొచ్చు.

    PAN Card: పాన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... రేపటి నుంచి కొత్త ఛార్జీలు

    కొత్తగా ఇళ్లు కొనేవారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ ప్రకటించింది. 2020, 2021 బడ్జెట్‌లో కూడా ఈ బెనిఫిట్స్‌ని పొడిగించింది. అయితే 2022 బడ్జెట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరం కోసం ఈ బెనిఫిట్‌ను పొడిగించలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య సరసమైన గృహ నిర్మాణాలు చేపట్టినవారు సెక్షన్ 80ఈఈఏ ప్రకారం ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఇంటిపై స్టాంప్ డ్యూటీ రూ.45,00,000 లోపు ఉన్న ఇళ్లకే ఈ బెనిఫిట్ లభిస్తుంది.

    ఇక 2022 ఏప్రిల్ 1 నుంచి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1,50,000 బెనిఫిట్ వర్తించదు. కానీ సెక్షన్ 24బీ కింద రూ.2,00,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు పొందొచ్చు. దీంతో పాటు ప్రిన్సిపల్ రీపేమెంట్స్‌పై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద కూడా మినహాయింపు లభిస్తుంది.

    First published:

    ఉత్తమ కథలు