హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Buying Tips: ధంతేరాస్ రోజున గోల్డ్ కొంటారా? ఈ టిప్స్ అస్సలు మర్చిపోవద్దు

Gold Buying Tips: ధంతేరాస్ రోజున గోల్డ్ కొంటారా? ఈ టిప్స్ అస్సలు మర్చిపోవద్దు

Gold Buying Tips: ధంతేరాస్ రోజున గోల్డ్ కొంటారా? ఈ టిప్స్ అస్సలు మర్చిపోవద్దు
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Buying Tips: ధంతేరాస్ రోజున గోల్డ్ కొంటారా? ఈ టిప్స్ అస్సలు మర్చిపోవద్దు (ప్రతీకాత్మక చిత్రం)

Gold Buying Tips | ధంతేరాస్ రోజున నగల షాపులు కిటకిటలాడుతుంటాయి. బంగారు నగలు (Gold Jewellery) కొనేందుకు పసిడిప్రేమికులు పోటీపడుతుంటారు. బంగారం కొనేప్పుడు అప్రమత్తంగా లేకపోతే మోసపోవాల్సి వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పసిడిప్రేమికులు ఎదురుచూసిన రోజు వచ్చేస్తోంది. దీపావళికి రెండు రోజుల ముందు అక్టోబర్ 23న ధంతేరాస్ (Dhanteras 2022) పర్వదినం ఉంది. ధంతేరాస్‌నే ధన త్రయోదశి (Dhana Trayodashi) అని కూడా పిలుస్తారు. ధంతేరాస్ రోజున బంగారం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పర్వదినం రోజున గోల్డ్ కొంటే అదృష్టం వరిస్తుందని, లక్ష్మీకటాక్షం ఉంటుందని విశ్వాసం. అందుకే ధంతేరాస్ రోజు గోల్డ్ కొనేందుకు పసిడిప్రేమికులు నగల దుకాణాల ముందు క్యూకడుతుంటారు. ధంతేరాస్ మాత్రమే కాదు, దీపావళికి కూడా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. మరి ఈరోజు మీరు గోల్డ్ కాయిన్స్ లేదా బంగారు నగలు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి.

బంగారం కొన్నా మోసపోతారు, అమ్మినా మోసపోతారు అని అంటుంటారు. అయితే కాస్త తెలివిగా, జాగ్రత్తగా కొనుగోళ్లు చేస్తే మోసపోయే అవకాశాలు తగ్గుతాయి. సర్టిఫైడ్ గోల్డ్ మాత్రమే కొనాలని గుర్తుంచుకోండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్‌మార్క్ ఉన్న నగలు కొనడమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. బంగారం నాణ్యతను, స్వచ్ఛతను తెలిపే గుర్తు ఇది. హాల్‌మార్క్‌లో ప్యూరిటీ కోడ్, టెస్టింగ్ సెంటర్ మార్క్, జ్యువెలర్ మార్క్, ఏ సంవత్సరంలో హాల్‌మార్క్ వేశారన్న వివరాలన్నీ ఉంటాయి. స్వచ్ఛమైన బంగారం కొంటే 24K అని, ఆభరణాలైతే 22K అని హాల్‌మార్క్ ఉంటుంది. కొందరు 18K గోల్డ్ కూడా కొంటుంటారు. షాపులో మీకు ఎంత స్వచ్ఛత ఉందని చెబుతారో, హాల్‌మార్క్ కూడా అదే ఉండాలి.

Diwali Shopping: దీపావళి షాపింగ్‌లో ఈ స్పెషల్ ఆఫర్స్ మర్చిపోవద్దు

బంగారం కొనడానికి వెళ్లే ముందే ఆన్‌లైన్‌లో ఓసారి బంగారం ధరలు తెలుసుకోండి. 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది, 22 క్యారెట్ గోల్డ్ ఎంత ఉందని తెలుసుకోండి. మీరు నగలు కొనాలనుకుంటే మీకు 22 క్యారెట్ రేట్ వర్తిస్తుంది. కొన్ని దుకాణాల్లో 22 క్యారెట్ నగలకు 24 క్యారెట్ గోల్డ్ రేట్ లెక్కిస్తుంటారు. అందుకే ముందుగానే ధరలు తెలుసుకొని వెళ్లాలి.

TSRTC Holiday Tour: వీకెండ్‌లో హైదరాబాద్ టూర్ ... 12 గంటల ప్యాకేజీ అందిస్తున్న టీఎస్‌ఆర్‌టీసీ

మీరు ఒక గ్రామ్ కాయిన్ కొన్నా, 10 గ్రాముల నగలు కొన్నా బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. పన్నులు చెల్లించాల్సి వస్తుందన్న ఆలోచనతో జీరో బిల్లుతో నగలు కొంటుంటారు. ఇక్కడే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు మోసపోతే నగల షాపుల్ని నిలదీయడానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. అదే మీరు ఒరిజినల్ ఇన్‌వాయిస్ తీసుకుంటే, నగల్లో ఏ తేడాలు ఉన్నా నగల షాపు యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయవచ్చు. అవసరమైతే ఆ బిల్లుతో కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో గోల్డ్ కొన్నట్టైతే డెలివరీ తీసుకోకముందే పార్శిల్ సరిగ్గా ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.

First published:

Tags: Dhanteras, Dhanteras 2022, Dhanteras gold, Gold jewellery, Gold Prices

ఉత్తమ కథలు