ARE YOU PLANNING TO BUY CAR WITH VEHICLE LOAN KNOW WHICH BANK OFFERS LOWER INTEREST RATES AND EMI CALCULATION SS
Car Loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? వడ్డీ, ఈఎంఐ ఎంతో తెలుసుకోండి
Car Loan: కార్ లోన్ తీసుకుంటున్నారా? వడ్డీ, ఈఎంఐ ఎంతో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
Car Loan | ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీకే వాహన రుణాలు (Vehicle Loans) అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు 10 శాతం లోపే ఉన్నాయి. బ్యాంకుల్లో కార్ లోన్ వడ్డీ రేటు 7.15 శాతం నుంచే ప్రారంభం అవుతుంది.
కొత్త కార్ కొనేవారు మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించడం కంటే వాహన రుణాలు (Vehicle Loan) తీసుకొని కార్ ఇంటికి తెచ్చుకుంటారు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. బ్యాంకుల రుణాల వివరాలను అందించే www.bankbazaar.com ఏ బ్యాంకులో కార్ లోన్ (Car Loan) వడ్డీ రేటు ఎంత ఉందో, ఎంత ఈఎంఐ చెల్లించాలో వివరాలను అప్‌డేట్ చేసింది. బ్యాంక్ బజార్ అందిస్తున్న వెబ్‌సైట్ ప్రకారం 2022 మే 24 నాటికి ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు... ఐదేళ్ల కాలానికి రూ.10 లక్షల కార్ లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎంత చెల్లించాలో తెలుసుకోండి.
Punjab National Bank:పంజాబ్ నేషనల్ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 7.15 శాతం. ఈఎంఐ రూ.19,782 చెల్లించాలి.
Punjab & Sind Bank: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 7.20 శాతం. ఈఎంఐ రూ.19,896 చెల్లించాలి.
Bank of Maharashtra: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కార్ లోన్ వడ్డీ రేటు 7.20 శాతం. ఈఎంఐ రూ.19,896 చెల్లించాలి.
Karur Vysya Bank: కరూర్ వైశ్య బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 7.80 శాతం. ఈఎంఐ రూ.20,181 చెల్లించాలి.
IOB: ఐఓబీలో కార్ లోన్ వడ్డీ రేటు 7.95 శాతం. ఈఎంఐ రూ.20,252 చెల్లించాలి.
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 7.95 శాతం. ఈఎంఐ రూ.20,252 చెల్లించాలి.
Karnataka Bank: కర్నాటక బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 8.05 శాతం. ఈఎంఐ రూ.20,300 చెల్లించాలి.
UCO Bank: యూకో బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 8.10 శాతం. ఈఎంఐ రూ.20,324 చెల్లించాలి.
J&K Bank: జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 8.10 శాతం. ఈఎంఐ రూ.20,324 చెల్లించాలి.
Dhanlaxmi Bank: ధనలక్ష్మి బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 8.10 శాతం. ఈఎంఐ రూ.20,324 చెల్లించాలి.
Federal Bank: ఫెడరల్ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 8.90 శాతం. ఈఎంఐ రూ.20,710 చెల్లించాలి.
South Indian Bank: సౌత్ ఇండియన్ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 9.15 శాతం. ఈఎంఐ రూ.20,831 చెల్లించాలి.
ఈఎంఐ లెక్కించేప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఛార్జీలు ఉన్నాయో లేదో బ్యాంకులో తెలుసుకోవాలి. ఈ కార్ లోన్ వడ్డీ రేట్లన్నీ పెట్రోల్, డీజిల్ వాహనాలకు సంబంధించినవే. ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ వడ్డీ రేట్లు వర్తించవు. కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రుణాలను అందిస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.