ఊటీ... పశ్చిమ కనుమల్లో వెలసిన ఈ భూతలస్వర్గం పర్యాటకులకు ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్. వేసవి వచ్చిందంటే చాలు ఎండ వేడిమి తట్టుకోలేక ఊటీకి క్యూకడుతుంటారు పర్యాటకులు. వేసవిలోనే కాదు, శీతాకాలంలో కూడా పర్యాటకులు ఊటీకి వెళ్తుంటారు. అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) శీతాకాలంలో, వేసవిలో ఊటీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. తిరుపతి నుంచి ఊటీకి అల్టిమేట్ ఊటీ (Ultimate Ooty) పేరుతో రైల్ టూర్ ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీతో పాటు కూనూర్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతుంటాయి. ప్రతీ మంగళవారం తిరుపతి నుంచి ఊటీకి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్రతీ మంగళవారం తిరుపతిలో ప్రారంభం అవుతుంది. రాత్రి 11.50 గంటలకు తిరుపతిలో శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. పర్యాటకులు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ చేరుకుంటారు. ఆ తర్వాత పర్యాటకుల్ని ఊటీ తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
SBI Account: మీ ఎస్‌బీఐ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయా? కారణమిదే
మూడో రోజు ఊటీలో దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. కూనూర్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు చూడొచ్చు. ఆ తర్వాత తిరిగి ఊటీ చేరుకోవాలి. రాత్రికి ఊటీలో బస చేయాలి. ఐదో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఊటీలో చెకౌట్ అయిన తర్వాత కొయంబత్తూర్ బయల్దేరాలి. సాయంత్రం 4.35 గంటలకు కొయంబత్తూర్‌లో రైలు ఎక్కితే అర్ధరాత్రి తిరుపతి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Railway Rules: రైలులో రాత్రి పూట ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ గుర్తుంచుకోండి
ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే కంఫర్ట్, స్టాండర్డ్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ధరలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీలో ఒకరికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,210, ట్విన్ షేరింగ్‌కు రూ.14,550, సింగిల్ షేరింగ్‌కు రూ.28,290 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,540, ట్విన్ షేరింగ్‌కు రూ.15,880, సింగిల్ షేరింగ్‌కు రూ.29,620 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఏసీ లేదా స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ హోటల్‌లో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Ooty