హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Ooty Tour: వింటర్‌లో ఊటీ వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Ooty Tour: వింటర్‌లో ఊటీ వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Ooty Tour: వింటర్‌లో ఊటీ వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Ooty Tour: వింటర్‌లో ఊటీ వెళ్తారా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Ooty Tour | హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్‌లో ఊటీ అందాలు చూపించనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఊటీ... పశ్చిమ కనుమల్లో భూతల స్వర్గం. వేసవిలో ఊటీలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. సమ్మర్‌లోనే కాదు, వింటర్‌లో కూడా ఊటీకి వెళ్లేవారు ఉంటారు. చలికాలంలో ఇంకా చల్లని వాతావరణం ఉండే ఊటీలో షికార్లు చేస్తారు. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేకంగా ఊటీ టూర్ ప్యాకేజీ (Ooty Tour Package) అందిస్తోంది. హైదరాబాద్ (Hyderabad) నుంచి అల్టిమేట్ ఊటీ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ రైల్ టూర్ ప్యాకేజీ (Rail Tour Package) ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో ఊటీతో పాటు కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రికి ఊటీలో బస చేయాలి.

LIC Pension Plan: సింగిల్ ప్రీమియం... ఏటా రూ.50,000 పెన్షన్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన ఉంటుంది. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి ఊటీలో బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ కావాలి. అక్కడ్నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకుల్ని తీసుకొస్తుంది ఐఆర్‌సీటీసీ. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Credit Card Rules: రేపటి నుంచి నాలుగు కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర

ఐఆర్‌సీటీసీ ఊటీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.11,040, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,080 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.11,660, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,010, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.26,210 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ఏసీ హోటల్‌లో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, డిన్నర్, ట్రైన్‌లో ఫుడ్, సైట్‌సీయింగ్ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ టికెట్స్, బోటింగ్, హార్స్ రైడింగ్, టూర్ గైడ్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ కావు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: IRCTC, IRCTC Tourism, Ooty, Travel

ఉత్తమ కథలు