మీరు రైలులో లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లగేజీ చాలా ఎక్కువగా ప్యాక్ చేస్తున్నారా? అయితే భారతీయ రైల్వే లగేజీకి రూల్స్ తెలుసా? ఉచితంగా ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చో తెలుసా? మీరు టికెట్ తీసుకున్న క్లాసును బట్టి ఫ్రీ అలవెన్స్ ఉంటుంది. ఆ వివరాలన్నీ మీకు indianrail.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తాయి. మీకు కేటాయించిన దానికన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్తే ఛార్జీలు చెల్లించాల్సిందే. మరి భారతీయ రైల్వే లగేజీకి తీసుకునే ఛార్జీలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోండి.
క్లాస్ | ఉచిత అలవెన్స్ | మార్జినల్ అలవెన్స్ | గరిష్ట పరిమితి |
ఏసీ ఫస్ట్ క్లాస్ | 70 కిలోలు | 15 కిలోలు | 150 కిలోలు |
ఏసీ 2-టైర్ స్లీపర్/ఫస్ట్ క్లాస్ | 50 కిలోలు | 10 కిలోలు | 100 కిలోలు |
ఏసీ 3-టైర్ స్లీపర్/ఏసీ చైర్ కార్ | 40 కిలోలు | 10 కిలోలు | 40 కిలోలు |
స్లీపర్ క్లాస్ | 40 కిలోలు | 10 కిలోలు | 80 కిలోలు |
సెకండ్ క్లాస్ | 35 కిలోలు | 10 కిలోలు | 70 కిలోలు |
మార్జినల్ అలవెన్స్ అంటే మీరు ఉచిత అలవెన్స్ కన్నా కాస్త ఎక్కువగా తీసుకెళ్తే దాన్ని మార్జినల్ అలవెన్స్ అంటారు. ఎంత ఎక్కువ ఉంటే అంత ఛార్జ్ చేస్తారు. మార్జినల్ అలవెన్స్ కన్నా ఎక్కువ ఉంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పొడవు 100 x వెడల్పు 60 x ఎత్తు 25 సెంటీమీటర్లు ఉన్న సూట్‌కేస్, బాక్సులు, పెట్టెలను మాత్రమే ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తారు. అంతకన్నా ఎక్కువ ఉంటే బ్రేక్ వ్యాన్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్‌లో అయితే పొడవు 55 x వెడల్పు 45 x ఎత్తు 22.5 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. లగేజీ ఛార్జ్ కనీసం రూ.30. ఇక 5-12 ఏళ్ల వయస్సు గల పిల్లలు గరిష్టంగా 50 కిలోల లగేజీ తీసుకెళ్లొచ్చు.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?
Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?
Personal Finance: అకౌంట్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే 'ఆటో స్వీప్' గురించి మీకు తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.