ARE YOU PAYING MINIMUM AMOUNT DUE ON YOUR CREDIT CARDS KNOW THE IMPLICATIONS UMG GH
Credit Cards: క్రెడిట్ కార్డ్ బాధితులారా.. మినిమం అమౌంటే చెల్లిస్తున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..!
క్రెడిట్ కార్డు మినిమం అమౌంటే చెల్లిస్తున్నారా.?
క్రెడిట్ కార్డు (Credit Card) లతో అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ, వీటి వాడకం గురించి తెలిస్తేనే పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే ఇవి కస్టమర్ల ఫైనాన్షియల్ స్టేటస్‌ను దెబ్బతీస్తాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం అమౌంట్ (Minimum Amount) మాత్రమే చెల్లిస్తే, ఇబ్బందుల్లో పడినట్లే.
మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఎక్కువగా వీటి ద్వారా అందే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అన్ని రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వీటి ద్వారా సులభతరంగా మారాయి. త్వరలో UPI ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డులతో అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ, వీటి వాడకం గురించి తెలిస్తేనే పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే ఇవి కస్టమర్ల ఫైనాన్షియల్ స్టేటస్‌ను దెబ్బతీస్తాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం అమౌంట్ మాత్రమే చెల్లిస్తే, ఇబ్బందుల్లో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ నిర్ణీత తేదీలో జనరేట్ అవుతుంది. స్టేట్మెంట్పై ఉండే గడువు తేదీలోపు బకాయి మొత్తాన్ని చెల్లించమని కార్డ్ హోల్డర్‌ను కంపెనీ కోరుతుంది. అయితే బిల్ పేమెంట్ విషయంలో కార్డ్ హోల్డర్లకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి.
1. బిల్లు పూర్తిగా చెల్లించడం
2. చెల్లించాల్సిన బకాయిలో ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించడం
3. బకాయిల్లో కనీసం 5 శాతం చెల్లించడం
క్రెడిట్ కార్డ్ జారీచేసే అన్ని సంస్థలూ గడువు తేదీలోపు బకాయి మొత్తంలో కనీసం 5 శాతం అయినా చెల్లించాలని పేర్కొంటాయి. బకాయి ఉన్న కనీస మొత్తం (Minimum Amount Due) అనేది.. కస్టమర్ల బిల్లు ఓవర్ డ్యూ బిల్లుగా (Overdue bill) పరిగణించకుండా భావించేందుకు చెల్లించాల్సిన కనీస మొత్తం. ఈ మినిమం బిల్లు చెల్లిస్తే, ఎలాంటి లేట్ పీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కార్డు బిల్లు గడువు తేదీ దాటిపోయే వరకు కార్డ్ హోల్డర్ అసలు బిల్లు చెల్లించకపోతే, ఆలస్య రుసుము వర్తిస్తుంది. తదుపరి బిల్లింగ్ సైకిల్లో ఇప్పటికే బకాయి ఉన్న బిల్లు, దానిపై వర్తించే వడ్డీ, ఆలస్యరుసుము వంటివన్నీ యాడ్ అవుతాయి. దీంతో తదుపరి నెల స్టేట్మెంట్లో బకాయి భారీగా పేరుకుపోతుంది.
ఒకవేళ మీరు కేవలం మినిమం బిల్లు మాత్రమే చెల్లిస్తే, మీకు రెండు పరిస్థితులు ఎదురుకావచ్చు. ఒకటి.. వచ్చే నెల బిల్లింగ్ సైకిల్‌కు రోల్ ఓవర్ అయ్యే బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాలి. ఇలా బకాయిలు పెరుగుతూనే ఉంటాయి. దీంతో మీరు అప్పుల ఊబిలో పడే అవకాశం ఉంది. రెండోది.. మీరు బిల్లు పూర్తిగా చెల్లించనందున, సాధారణంగా 45 రోజుల వరకు ఉండే వడ్డీ రహిత కాలం పోతుంది. మొత్తం బకాయిలు చెల్లించే వరకు మీరు చేసే ప్రతి కొత్త కొనుగోలుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మినిమం బిల్లు చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకునే సందర్భంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు పూర్తి నిబంధనలు తెలుసుకోవాలని గతంలో ఆర్బీఐ కూడా హెచ్చరించింది.
మినిమం బిల్లు చెల్లించే సందర్భంలో వర్తించే వడ్డీ, లేట్ ఫీజు, ఇతర ఛార్జీలు, సంబంధిత నిబంధనలు కార్డు జారీ చేసే సంస్థలు స్పష్టంగా పేర్కోవాలి. క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతుల్లో (MITC) కూడా ఈ నియమ, నిబంధనలు ఉంటాయి. మునుపటి నెల బిల్లులో ఏదైనా బ్యాలెన్స్ బకాయి ఉంటే, 'వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి'ని (Interest-free credit period)నిలిపివేస్తామని వీటిలో స్పష్టంగా ఉంటుంది. అందువల్ల కార్డ్ హోల్డర్లకు తీవ్రమైన నిధుల కొతర ఉంటేనే ఈ మినిమం బిల్లు చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.