EMI payment: హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే రూ.2.34 లక్షల నష్టం... ఈ లెక్క చూడండి

Moratorium on EMI | ఈఎంఐ చెల్లింపులపై బ్యాంకులు ఇచ్చే మూడు నెలల మారటోరియం ఎంచుకుంటున్నారా? ఒక్క నిమిషం. మీరు మారటోరియం ఎంచుకుంటే భారీగా నష్టపోవాల్సిందే. ఎందుకో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 2, 2020, 12:44 PM IST
EMI payment: హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే రూ.2.34 లక్షల నష్టం... ఈ లెక్క చూడండి
EMI payment: హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే రూ.2.34 లక్షల నష్టం... ఈ లెక్క చూడండి
  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించడంతో అన్ని బ్యాంకులు ఆ ఆదేశాలను ఫాలో అవుతున్నాయి. తమ కస్టమర్లకు మారటోరియం ఆఫర్ చేస్తున్నాయి. మరి మీరు కూడా మూడు నెలలు మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటున్నారా? మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేయాలనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బులు ఉన్నా మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే నష్టపోవడం తప్పదు. ఈ విషయాన్ని బ్యాంకులు నియమనిబంధనల్లో స్పష్టంగా వివరిస్తున్నాయి. కానీ కస్టమర్లు ఈ నియమనిబంధనల్ని పట్టించుకోకుండా మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఈ మారటోరియం కేవలం మూడు నెలల ఈఎంఐలను వాయిదా వేయడానికి మాత్రమే. అంటే మీరు ఇంకా 24 నెలలు లోన్ చెల్లించాల్సి ఉంటే ఈ మూడు నెలలు వాయిదా వేస్తే లోన్ టెన్యూర్ మరో మూడు నెలలు పెరుగుతుంది. ఔట్‌స్టాండింగ్‌పై అంటే మీరు చెల్లించాల్సిన అప్పుపై ఈ మూడు నెలలు వడ్డీ కట్టాల్సిందే. మారటోరియం నియమనిబంధనల్లో ఈ అంశాలు స్పష్టంగా ఉన్నాయి.

కస్టమర్లు మారటోరియం ఎంచుకుంటే ఎంత నష్టపోతారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లెక్కేసి మరీ చెప్పింది. ఉదాహరణకు ఓ వ్యక్తి 30 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడనుకుందాం. మరో 15 ఏళ్లు ఈఎంఐ చెల్లించాలి. మారటోరియం ఉంది కదా అని ఈఎంఐలు మూడు నెలలు వాయిదా వేసుకుంటే అదనంగా వడ్డీ రూ.2.34 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆటో లోన్ ఉదాహరణ చూద్దాం. ఓ వ్యక్తి రూ.6 లక్షలు లోన్ తీసుకున్నాడు. మరో 54 నెలలు ఈఎంఐలు చెల్లించాలి. కానీ మూడు నెలల మారటోరియం ఎంచుకుంటే అదనంగా రూ.19,000 వడ్డీ కట్టాలి. ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఉదాహరణలను వెల్లడించింది.

యాక్సిస్ బ్యాంకు కూడా ఇలాంటి ఉదాహరణలే వెల్లడించింది. మీరు ఫిబ్రవరి 12న మీ క్రెడిట్ కార్డుతో రూ.10,000 ఖర్చు చేశారు. మీ బిల్లు మార్చి 12న జనరేట్ అయింది. ఏప్రిల్ 2 నాటికి రూ.10,000 డ్యూ ఉంటుంది. మీరు మారటోరియం ఎంచుకుంటే వడ్డీ+జీఎస్‌టీ కలిపి రూ.1,739 చెల్లించాలి. అంటే 2020 జూన్ 12న మీరు చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లు రూ.11,739. ఇక ఇతర లోన్స్ విషయానికొస్తే ఓ వ్యక్తి 9% వడ్డీకి రూ.25 లక్షలు టర్మ్ లోన్ తీసుకున్నాడు. 240 నెలలు రూ.22,493 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. 2020 మార్చి 31 నాటికి 24,53,182 ప్రిన్సిపల్ ఉంటుంది. ఒక వేళ 2020 ఏప్రిల్, 2020 మే నెలలకు రెండు నెలల మారటోరియం తీసుకుంటే 2020 జూన్ నాటికి రూ.24,89,949 ప్రిన్సిపల్ ఔట్‌స్టాండింగ్ ఉంటుంది. అంటే రూ.36,767 తేడా వస్తుంది.

అందుకే మీకు ప్రతీ నెల వచ్చే ఆదాయం ఇప్పుడు కూడా వస్తే, కరోనా వైరస్ ప్రభావం మీ ఆర్థిక పరిస్థితులపై లేకపోతే ఈఎంఐలు చెల్లించడమే మంచిది. మారటోరియం ఆప్షన్ ఉంది కదా అని మీరు ఎంచుకుంటే నష్టపోవాల్సిందే. ఒకవేళ మీకు డబ్బులకు ఇబ్బందిగా ఉండి, తప్పనిసరిగా మారటోరియం ఎంచుకోవాలనుకుంటే వేర్వేరు బ్యాంకులు వేర్వేరు పద్ధతులను పాటిస్తున్నాయి. మరి మీరు మారటోరియం ఎలా ఎంచుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా

EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలాSavings: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి షాక్... ఎవరికి ఎంత నష్టమంటే
Published by: Santhosh Kumar S
First published: April 2, 2020, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading