Online Banking: ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

Online Banking: ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Online Banking | మీరు నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటారా? ఈ సేఫ్టీ టిప్స్ ఎప్పటికీ గుర్తుంచుకోండి.

 • Share this:
  ఆన్‌లైన్ బ్యాంకింగ్ వచ్చినప్పటి నుంచి కస్టమర్లకు బ్యాంకులకు వెళ్లాల్సిన పని తప్పింది. మరీ అవసరమైతే తప్ప బ్యాంకుకు వెళ్లట్లేదు. చాలావరకు పనులన్నీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా భారీ లావాదేవీలు కూడా జరిపేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించేవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. కానీ డిజిటల్ బ్యాంకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటివి ఇతరులకు తెలిసాయంటే మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం. అందుకే ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో సైబర్ దాడులు పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి కాలంలో ఈ మోసాలు మరింత ఎక్కువయ్యాయి. మరి మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నట్టైతే ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

  Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

  Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

  ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోకూడదు. ఇతరులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపకూడదు. ఈ వివరాలను ఎక్కడా రాసిపెట్టుకోకూడదు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఉపయోగిస్తే చాలు. మీరు ఎక్కడైనా ఈ వివరాలు రాసిపెట్టినా అవి ఇతరుల చేతుల్లోకి వెళ్తే మీ ఖాతాకు ముప్పే. అంతేకాదు... ఇలాంటి వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసినా మీ స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ మాత్రమే కాదు మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల నెంబర్స్, పిన్ నెంబర్స్ కూడా సేవ్ చేయకూడదు. ఇక మొబైల్ బ్యాంకింగ్ కోసం యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మీ లావాదేవీలు పూర్తి కాగానే లాగౌట్ చేయాలి. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయినప్పుడు కూడా పని పూర్తి కాగానే లాగౌట్ చేయడం మర్చిపోవద్దు. మళ్లీమళ్లీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం ఎందుకని బ్రౌజర్‌లో ఈ వివరాలు సేవ్ చేయకూడదు.

  SBI Zero Balance Account: ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు... ఓపెన్ చేయండిలా

  LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ వర్తిస్తుందా?

  ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం మీరు వైఫై ఉపయోగిస్తున్నారా? ఇకపై ఎప్పుడూ ఆ పనిమాత్రం చేయొద్దు. ముఖ్యంగా పబ్లిక్ వైఫై అస్సలు ఉపయోగించకూడదు. షాపింగ్ మాల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర పబ్లిక్ ప్లేసెస్‌లో మీ వైఫై ఉపయోగించే అలవాటు ఉన్నా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ కోసం వైఫై వాడకూడదు. బ్యాంకు నుంచి సంప్రదిస్తున్నామని ఎవరైనా కాల్ చేసి మీ ఖాతా వివరాలు అడిగితే చెప్పకూడదు. ఏటీఎం కార్డు నెంబర్, పిన్ నెంబర్, సీవీవీ, ఓటీపీ లాంటివి అస్సలు చెప్పకూడదు. బ్యాంకు సిబ్బంది ఎవరు కాల్ చేసినా ఈ వివరాలు అడగరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ వివరాలు అడిగినట్టైతే వాళ్లు బ్యాంకు సిబ్బంది కాదని, మోసగాళ్లని గుర్తించాలి.

  LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా

  EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి

  బ్యాంకు నుంచి పంపించినట్టుగా ఏవైనా లింక్స్ మీ ఫోన్‌కు లేదా మీ మెయిల్ ఐడీకి వస్తే వాటిని అస్సలు క్లిక్ చేయొద్దు. ఆ లింక్స్ పంపించింది ఎవరో చెక్ చేయాలి. బ్యాంకులు రెగ్యులర్‌గా ట్రాన్సాక్షన్ అలర్ట్స్, స్టేట్‌మెంట్స్ పంపిస్తూ ఉంటాయి. బ్యాంకు మెయిల్ ఐడీ నుంచి కాకుండా ఇతరుల మెయిల్ ఐడీ నుంచి ఏవైనా బ్యాంకింగ్‌కు సంబంధించిన లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయకూడదు. పదే పదే అలాంటి వివరాలు వస్తున్నట్టైతే ఓసారి బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.
  Published by:Santhosh Kumar S
  First published: