Home /News /business /

ARE YOU MAKING THESE MISTAKES IN IT RETURNS IF YOU DO THIS YOU CAN GET OUT EASILY UMG GH

ITR Filling: ఐటీ రిటర్న్స్ లో ఈ తప్పులు చేస్తున్నారా ? అంతే సంగతులు.. ఇలా చేశారనుకోండి సులభంగా బయటపడొచ్చు !

 ఐటీ రిటర్న్స్ లో ఈ తప్పులు చేస్తున్నారా ? అంతే సంగతులు.. ఇలా చేశారనుకోండి సులభంగా బయటపడొచ్చు !

ఐటీ రిటర్న్స్ లో ఈ తప్పులు చేస్తున్నారా ? అంతే సంగతులు.. ఇలా చేశారనుకోండి సులభంగా బయటపడొచ్చు !

ఐటీఆర్(ITR ) ఫైల్ చేయడానికి 15 రోజుల సమయం కూడా లేదు. పన్ను రిటర్న్‌లను తప్పుగా దాఖలు చేయడం వల్ల ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అలాగే రిటర్న్‌లను సవరించాల్సి రావడం కూడా సమస్య అవుతుంది. ప్రస్తుత రిటర్న్-ఫైలింగ్ సీజన్‌లో చార్టర్డ్ అకౌంటెంట్లు(CA) గమనించిన కొన్ని లోపాలు ఇవే..

ఇంకా చదవండి ...
2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఆదాయపన్ను రిటర్న్‌(ITR )లను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. జరిమానా లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడానికి 15 రోజుల సమయం కూడా లేదు. పన్ను రిటర్న్‌లను తప్పుగా దాఖలు చేయడం వల్ల ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అలాగే రిటర్న్‌లను సవరించాల్సి రావడం కూడా సమస్య అవుతుంది. ప్రస్తుత రిటర్న్-ఫైలింగ్ సీజన్‌లో చార్టర్డ్ అకౌంటెంట్లు గమనించిన కొన్ని లోపాలు ఇవే..

చివరి నిమిషం వరకు ఆలస్యం చేయడం
2022 జులైలో ఇప్పటివరకు I-T రిటర్న్‌లను దాఖలు చేసిన వారి సంఖ్య తక్కువగా ఉంది. జూన్‌లో 69 లక్షల ఫైలింగ్‌లు జరగలేదు. ఇంకా 7 కోట్లు పూర్తి చేయాల్సి ఉంది. జులై మొదటి వారంలో ఫైలింగ్ వేగం తక్కువగా ఉంది. జులై 31వ తేదీతో గడువు ముగుస్తుందని చాలా మంది భావించడం లేదు. గత రెండేళ్లలో కరోనా(Corona) కారణంగా గడువు చాలాసార్లు పొడిగించారు. ఇప్పుడు కూడా పొడిగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని TaxBuddy వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ చెప్పారు. పొడిగింపు కోసం ఎదురుచూడటం సరికాదు. గడువు సమీపిస్తున్న కొద్దీ I-T డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ఓవర్‌లోడ్‌తో హ్యాంగ్(Hang) అయ్యే అవకాశం ఉంది. ఆలస్యంగా దాఖలు చేసినందుకు రూ.1,000- రూ.5,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. చెల్లించాల్సిన బ్యాలెన్స్ పన్ను ఏదైనా ఉంటే, 2022 ఏప్రిల్ 1 నుంచి వడ్డీ మీటర్ మొదలైందని, ఆలస్యం కారణంగా అదనపు చెల్లింపును ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించాలి.

ముందుగా నింపిన వివరాలతో జాగ్రత్త
చాలా మంది తక్కువ ఆదాయ వర్గాల వారికి, ముందుగా ఫిల్‌ చేసిన పన్ను రిటర్న్‌లు అందుబాటులో ఉన్నాయి. జీతాలు, టీడీఎస్‌(TDS) వివరాలు కంపెనీల నుంచి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ కోసం బ్యాంకుల నుంచి, విరాళాల కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించిన డేటాతో సమాచారం నమోదు చేస్తారు. అయితే, చార్టర్డ్ అకౌంటెంట్లు ముందుగా ఫిల్‌ చేసిన వివరాలను గుడ్డిగా ఆమోదించకూడదు. రిటర్న్‌లను దాఖలు చేసే ముందు వాటిని పరిశీలించాలి. మ్యూచువల్ ఫండ్‌లలో జాయింట్ అకౌంట్ హోల్డర్‌లు ఉంటే.. ఒక హోల్డర్‌పై మాత్రమే పన్ను విధించాలి. ఇలాంటి పొరపాట్లు జరగకుండా సరిచూసుకోవాలి.

ఇదీ చదవండి: Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!


సేవింగ్స్‌ వడ్డీ
ఇప్పుడు యాన్యువల్‌ ఇనఫర్మేషన్‌ సిస్టమ్‌ (AIS)లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఉంటున్నాయి. ప్రభుత్వం వద్ద డేటా ఉందని, FD నుంచి వచ్చే వడ్డీ, ఫారమ్ 26 ASలో చూపనప్పటికీ.. ఇప్పటి వరకు సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌ల నుంచి వచ్చే మైనర్ వడ్డీ ఆదాయాన్ని నిర్లక్ష్యం చేశారని, కానీ AIS ఇంటిగ్రేషన్ సేవింగ్స్ బ్యాంక్ వడ్డీని నివేదించకపోవడాన్ని తగ్గించిందని బంగర్ చెప్పారు. పన్ను శాఖకు బ్యాంకులు డేటాను అప్‌డేట్ చేయడంలో తరచూ విఫలమవుతున్నట్లు పేర్కొన్నారు.

పాత ఎంప్లాయర్ నుంచి ఆదాయాన్ని దాచడం
ఈ సంవత్సరంలో అధిక అట్రిషన్ రేట్లతో, అనేక మంది వ్యక్తుల వద్ద మల్టిపుల్‌ ఫారమ్ 16లు ఉన్నాయని చార్టర్డ్ అకౌంటెంట్లు చెప్పారు. మరే ఇతర సంవత్సరంలోనైనా, మరొక యజమాని నుంచి మునుపటి ఆదాయాన్ని దాచడం సాధ్యమయ్యేది. కానీ గత సంవత్సరం నుంచి, AIS మల్టిపుల్‌ ఫారమ్ 16ల వివరాలను కూడా క్యాప్చర్‌ చేస్తోంది. ఇంతకుముందు చార్టర్డ్ అకౌంటెంట్‌కి ఒక ఫారమ్ 16ని చూపిస్తూ, మునుపటి యజమాని ఫారం దాచే వారని, ఇప్పుడు AISలో అన్ని వివరాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఆస్తి విక్రయ వివరాలు అవసరం
పన్నులను ఆదా చేయడానికి ఆస్తిని విక్రయించారా? మరొక ఆస్తిలో తిరిగి పెట్టుబడి పెట్టారా? ఈ వివరాలను రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు మర్చిపోవద్దు. పన్ను రద్దు అయినా, డబ్బు తిరిగి పెట్టుబడి పెట్టబడినందుకు వివరాలను ప్రకటించాలి. రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా సేకరించిన డేటా, పన్ను రిటర్న్‌ల మధ్య తేడాలు ఉంటే.. రిటర్న్‌ల ప్రాసెసింగ్ కూడా ఆలస్యం కావచ్చు.

క్రిప్టో అసెట్స్‌ ప్రకటన
యూనియన్ బడ్జెట్ 2022 క్రిప్టో అసెట్స్‌పై 30 శాతం క్రిప్టో పన్నును ప్రకటించింది. కానీ అది వచ్చే అసెస్‌మెంట్ ఇయర్‌(2023-24) నుంచి వర్తిస్తుంది. క్రిప్టో టాక్సేషన్‌పై పెట్టుబడిదారులకు గందరగోళం ఉంది. ఇప్పుడు మొత్తం వర్గీకరణ మారిపోయిందని, ఈ అసెస్‌మెంట్ ఇయర్‌లో క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించడానికి ఒక మంచి మార్గం ITR 2 కింద ఆస్తులు, అప్పుల విభాగంలో దానిని ప్రకటించాలని బంగర్ చెప్పారు.



 క్రిప్టో నుంచి నష్టాలను సర్దుబాటు చేయడం
I-T చట్టం, 1961 ప్రకారం, లాభాల కొరత కారణంగా అదే ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేయలేని దీర్ఘకాలిక మూలధన నష్టాన్ని ఎనిమిదేళ్లపాటు కొనసాగించవచ్చు. 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కి(ఆర్థిక సంవత్సరం 2021-22) టాక్సేషన్ రిటర్న్‌లను ఫైల్ చేస్తున్నప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లు 2022 ఏప్రిల్ 1కి ముందు వర్చువల్ అసెట్స్‌పై జరిగిన క్యారీ ఫార్వర్డ్ నష్టాలను మూలధన రాబడికి వ్యతిరేకంగా సెట్ చేయవచ్చా? లేదా? అనే సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. క్రిప్టోకరెన్సీ, డిజిటల్ అసెట్స్‌ చట్టం ప్రకారం, లాభాలకు వ్యతిరేకంగా నష్టాలను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. వర్చువల్ అసెట్స్‌పై ఈ పన్నులు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తిస్తాయి. KBP & అసోసియేట్స్ భాగస్వామి పరాస్ సావ్లా మాట్లాడుతూ..‘ముందస్తు నష్టాల సర్దుబాటు సమస్యకు సంబంధించి CBDT నుండి వివరణ కోసం ఎదురు చూస్తున్నాం. వారు అనుమతించకపోతే, ఇది పన్ను చెల్లింపుదారులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని చెప్పారు.

చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి, క్రిప్టోకరెన్సీ నుంచి వచ్చే నష్టాలను సర్దుబాటు చేయకుండా ఉండటం మంచిదని, సాధారణ వ్యాపార నష్టం లేదా ఈక్విటీ లేదా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ఇతర మూలధన లాభాలకు వ్యతిరేకంగా దాన్ని సర్దుబాటు చేయకుండా ఉండాలని బంగర్ చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Banks, Inflation, ITR Filing, Tds

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు