Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా? ఈ రిస్క్ తెలుసుకోండి

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా? ఈ రిస్క్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds | మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడులు పెడుతున్నారా? మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ రిస్క్ గుర్తుంచుకోండి.

  • Share this:
షేర్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని వారు, రిస్క్ ఎందుకులే అనుకునేవారు సహజంగా మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే చాలా మందికి ఆర్థిక అవగాహన లేక అనేక రకాల ఫండ్లలో ఇన్వెస్ట్ (Investment) చేస్తుంటారు. ఎవరో ఇచ్చిన సూచనలు పాటిస్తూ తమకు పెద్దగా ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోయినా ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. ఇలా అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం, అనేక రకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లెక్కకు మించిన ఫండ్స్ మన వద్ద ఉన్నా.. లాభాలు మాత్రం పెద్దగా కనిపించవు. వీటిని ఒక క్రమపద్దతిలో పెట్టుకుని పెద్దగా పనితీరు కనబరచని ఫండ్స్ వదిలించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి సూచనలు పాటించాలో తెలుసుకోండి.

ఆర్థిక లక్ష్యాలను తాజాగా నిర్దేశించుకోవాలి


మన అవసరాలు మనకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు. పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక అవసరాలతోపాటు, గృహ రుణాల చెల్లింపు, కారు ఈఎంఐ, పిల్లల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్భణం లెక్కించి భవిష్యత్తులో మన ఆర్థిక అవసరాలు తీర్చుకునే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందో సిప్ (Systamatic Investment Plan) కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కించుకోవాలి.

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

ఎలా పెట్టుబడులు పెట్టాలి


పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. దీనివల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అందుకే ముందుగా మన పెట్టుబడి కేటాయింపుల వ్యూహాలను మార్చుకోవాలి. నష్టభయాలు, వృద్ధి అవకాశాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటి మధ్య సమతుల్యత సాధించేలా షేర్లు, బంగారం, డెట్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి.

పనితీరు సరిగా లేని ఫండ్స్ గుర్తించాలి


మనం పెట్టుబడి పెట్టిన ఫండ్స్ లో ఏవైనా సరైన వృద్ధి నమోదు చేయకపోతే అలాంటి వాటిని గుర్తించాలి. మనం పెట్టుబడి పెట్టే సమయంలో కొన్ని ఫండ్స్ మంచి రాబడినిచ్చి ఉండవచ్చు. తరువాత వాటి రాబడి తగ్గిపోవచ్చు. అలాంటి వాటిని వదిలించుకోవడం ముఖ్యం.

Aadhaar Bank Account Link: ఏ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ నెంబర్ లింక్ అయింది? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

ఫండ్స్ పోర్ట్ ఫోలియో ఇలా ఉండాలి


భవిష్యత్తులో మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. అందుకు తగిన మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. మనం పెట్టుబడి పెట్టిన ఫండ్స్ ఒకటి, రెండు, మూడు, ఐదు, పది సంవత్సరాలల్లో ఎలాంటి రాబడినిచ్చాయో పీర్ ఫండ్స్, బెంచ్ మార్క్ సూచికలతో పనితీరును పరిశీలించాలి. దీని వల్ల మనం పెట్టుబడిపెట్టిన ఫండ్స్ మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా రాణిస్తున్నాయో లేదో తెలుస్తుంది. వివిధ రకాల ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమే కాని అది అతి కాకుండా చూసుకోవాలి. వందల రకాల ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల వాటిని పరిశీలించడం కూడా కష్టం అవుతుంది.

Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా? 10 రోజుల్లో వెనక్కి పొందొచ్చు ఇలా

క్రమానుగతంగా ఫండ్స్ పోర్ట్ ఫోలియోను పరిశీలించుకోవాలి


ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన తరువాత కనీసం సంవత్సరానికి ఒకసారి సమీక్షించుకోవాలి. దీని ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. పనితీరు సరిగా లేని వాటిని వదిలించుకోవడానికి కూడా ఇలాంటి సమీక్షలు సహాయపడతాయి.
Published by:Santhosh Kumar S
First published: