హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇందులో పెడితే లాభాలే లాభాలు!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇందులో పెడితే లాభాలే లాభాలు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mutual Funds: కొన్ని నెలలుగా స్టాక్‌మార్కెట్‌ వోలటైల్‌గా ఉంది. చాలా హెచ్చు తగ్గులకు గురవుతోంది. ఇలాంటి సమయాల్లో నష్టాలు ఎదుర్కోకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందుకోవడానికి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ సెలక్ట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Mutual Funds: చాలా మంది తమ సేవింగ్స్‌ను స్థిరమైన లాభాలు అందించే ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌ (Financial Market)లో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తారు. ఇన్వెస్ట్‌మెంట్‌ (Investment) విషయంలో రిస్క్ తీసుకునే ఆసక్తి, స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) నైపుణ్యం, సమయం అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి మ్యూచువల్‌ ఫండ్స్‌ (Mutual Funds) బెస్ట్‌ ఆప్షన్‌ అంటున్నారు నిపుణులు. మల్టిపుల్‌ గ్లోబల్ ఫ్యాక్టర్స్‌ ప్రభావంతో కొన్ని నెలలుగా స్టాక్‌మార్కెట్‌ వోలటైల్‌గా ఉంది. చాలా హెచ్చు తగ్గులకు గురవుతోంది. ఇలాంటి సమయాల్లో నష్టాలు ఎదుర్కోకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందుకోవడానికి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ సెలక్ట్‌ చేసుకోవాలని మనీ కంట్రోల్‌ రిపోర్ట్ ఒకటి సూచిస్తోంది.

Gold Price Today: రెండు రోజుల్లో రూ.1,000 పెరిగిన బంగారం ధర... రికార్డు ధర వైపు పరుగులు

లార్జ్ క్యాప్ ఫండ్స్‌ అంటే..?

పెద్ద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల ఈక్విటీ షేర్లలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలు, తమ అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌(AUM)లో ఎక్కువ భాగాన్ని ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటినే లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ (Large cap Funds) అంటారు. ఇన్వెస్ట్‌ చేసే కంపెనీలు సాధారణంగా ఆయా రంగాల్లో టాప్‌లో ఉంటాయి. డొమైన్‌లో ప్రముఖ మార్కెట్ వాటాను హోల్డ్‌ చేస్తుంటాయి.

ఉదాహరణకు IT రంగంలో TCS, కన్స్యూమర్‌ గూడ్స్‌లో ITC వంటివి ఉంటాయి. ఇలాంటి కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఆ కంపెనీలకు సంబంధించిన నెగెటివ్‌ న్యూస్‌ ఆయా సంబంధిత రంగాల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ సురక్షితమైన ఆప్షన్లు. వీటిలో విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు.

పెట్టుబడి ప్రయోజనాలు

లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రధాన కారణం వాటి స్థిరత్వం. ఈ ఫండ్‌లు టాప్ మేనేజ్‌మెంట్‌ ఉన్న పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిదారులు బేర్ మార్కెట్ సమయంలో కూడా తక్కువ అస్థిరత, స్థిరమైన డివిడెండ్ ఆదాయాన్ని ఆశించవచ్చు. లార్జ్-క్యాప్ ఫండ్‌లలో వాటి మార్కెట్ క్యాప్ కారణంగా తక్కువ వృద్ధిని చూస్తాయని, బుల్ మార్కెట్‌ సమయంలో వైల్డ్ స్వింగ్‌లను కోల్పోవచ్చనే వాదనలు సరికాదని రుజువు చేశాయి. ఎక్కువ ఆదాయాలను ఇచ్చే గుర్తు తెలియని కంపెనీలలో పెట్టుబడుల కంటే.. స్థిరంగా ఆదాయం ఇచ్చే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి మంచి ఇన్వెస్టర్లు ముందుకు వస్తారు.

Cheapest Electric Car: చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది... కిలోమీటర్‌కు 75 పైసలు మాత్రమే ఖర్చు

ఏ లార్జ్ క్యాప్ ఫండ్ బెస్ట్?

ప్రస్తుతం బెస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్‌ చాలా ఉన్నాయి. వివిధ పెద్ద క్యాప్ పరిశ్రమలు, రంగాలలో పెట్టుబడి పెట్టే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించవచ్చు. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ ఫండ్ ప్రారంభం నుంచి 19.08% రాబడిని అందించింది. ఫండ్ పెట్టుబడి పెట్టిన కంపెనీలలో ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, రిలయన్స్ , L&T వంటి ఇతర ప్రసిద్ధ, లాభదాయకమైన లార్జ్ క్యాప్ కంపెనీలు ఉన్నాయి. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం తమ పెట్టుబడిని నిర్వహించాలని చూస్తున్న పెట్టుబడిదారులకు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్ బెస్ట్‌ ఆప్షన్‌.

మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్ రిస్క్‌కు ప్రభావితమవుతాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ అపెటిట్ నిర్ధారించుకోవాలి. మొదటిసారి మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ అనువైనవి. ఎందుకంటే ఇవి సాధారణంగా పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన ఫండ్స్. మార్కెట్ బుల్, బేర్ సైకిల్స్ రెండింటిపై ఫండ్ పనితీరును తెలుసుకోవాలి. తర్వాత ఫండ్ ధరను లెక్కించాలి. దీనిని ఎక్స్‌పెన్స్‌ రేషియో అని కూడా పిలుస్తారు. ఎక్కువ రాబడిని అందించే తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఉన్న ఫండ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

(Disclaimer:షేర్ మార్కెట్‌, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీకు కలిగే లాభం లేదా నష్టానికి News18 ఎలాంటి బాధ్యత వహించదు. ) (ప్రతీకాత్మక చిత్రం )

First published:

Tags: Business, Mutual Funds

ఉత్తమ కథలు