International Mutual Funds: ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

International Mutual Funds: ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

International Mutual Funds | మీరు అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి.

  • Share this:
దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదల, మరోసారి లాక్‌డౌన్‌ విధింపు వార్తలతో సోమవారం BSE సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కొక్కటి దాదాపు 35 శాతం పడిపోయాయి. కానీ ప్రపంచంలోని ఇతర దేశాల మార్కెట్లు ఇండియన్ మార్కెట్ల మాదిరిగా నేల చూపులు చూడట్లేదు. దీంతో విదేశీ స్టాక్స్‌పై పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. పోర్ట్‌ఫోలియోలో పది నుంచి 20 శాతం వరకు ఇంటర్నేషనల్ ఈక్విటీ పెట్టుబడులు ఉండాలని సూచిస్తున్నారు. వీటికి మార్కెట్ ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు క్యాపిటల్, వ్యాల్యుయేషన్ విషయంలో భారత మార్కెట్లతో పోలిస్తే తక్కువ ధరలో లభిస్తుండటం విశేషం. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్లలోని ఈక్విటీ పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వల్ల మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.

తక్కువ కోరిలేషన్


ఇండియన్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లతో తక్కువ కో రిలేషన్ సంబంధాన్ని కలిగి ఉంటాయి. భారత మార్కెట్లు అమెరికాతో 0.16 శాతం, యూరప్‌తో 0.32 శాతం, చైనాతో 0.38 శాతం తక్కువ కో రిలేషన్ కలిగి ఉన్నాయని మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ (Mirae Asset Mutual Fund) నివేదిక వెల్లడించింది. అంటే ఈ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటే.. మొత్తం పోర్ట్ ఫోలియో రిస్క్ తక్కువగా ఉంటుంది.

ATM Transaction Failed: అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాలేదా? ఇలా చేయండి

Tata Sky: టాటా స్కై వాడుతున్నారా? ఈ ప్రోమో కోడ్‌తో డిస్కౌంట్ పొందండి

న్యూ ఏజ్ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు


ఇంటర్నేషనల్ ఫండ్ల ద్వారా ఇన్వెస్టర్లు ఈ కామర్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రిక్ వాహనాలు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి న్యూ ఏజ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లూయి విట్టన్, వాల్ మార్ట్, టెస్లా వంటివి గత కొన్ని సంవత్సరాలుగా మంచి రాబడిని అందిస్తున్నాయి. అందువల్ల ఇంటర్నేషనల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ స్టాక్స్‌ను సొంతం చేసుకునే వీలు కలుగుతుంది. ఇండియన్ మార్కెట్లతో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లకు పరిధి, పోటీ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు రూపాయితో పోలిస్తే స్టాక్స్ విలువ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫండ్లు లాభాలను ఆర్జిస్తాయి.

భౌగోళికపరమైన వైవిధ్యం


ఇంటర్నేషనల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల పోర్ట్‌ఫోలియోలో భౌగోళికంగా విసృతమైన వైవిధ్యం కనిపిస్తుంది. కొన్నిసార్లు దేశీయ కారణాలతో భారత ఆర్థిక వ్యవస్థ సరిగా పని చేయకపోవచ్చు. కానీ ఇలాంటప్పుడు ఇతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పనితీరు బాగా ఉండవచ్చు. ఈ సందర్భంలో గ్లోబల్ ఫండ్లలో పెట్టుబడులు మంచి పనితీరును నమోదు చేయవచ్చు. అందువల్ల ఇండియన్ మార్కెట్లతో తక్కువ కోరిలేషన్ ఉండటం, న్యూ ఏజ్ కంపెనీల్లో పెట్టుబడులకు అవకాశాలు, భౌగోళిక పరమైన వైవిధ్యం వంటివి ఇంటర్నేషనల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ల విభాగంలో ఆసియా ఈక్విటీలు, టెక్నాలజీ ఓవర్‌సీస్ వంటి రెండు ఫండ్ల మిశ్రమాన్ని ఇన్వెస్టర్లు ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. PGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్, మోతీలాల్ ఓస్వాల్ S&P 500 ఇండెక్స్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 వంటి ఫండ్లను పెట్టుబడిదారులు ఎంచుకోవచ్చు.

Airtel Plans: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితం... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

RTGS Services: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్

జాగ్రత్తలు అవసరం


ఇంటర్నేషనల్ ఫండ్లలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆఫర్లో ఉన్న కొత్త పేర్లు, థీమ్‌ల ఆధారంగా ఫండ్లను ఎంచుకొని మోసపోకూడదు. పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో భౌగోళికపరమైన డైవర్సిటీని పొందడానికి పోర్ట్ ఫోలియోలను నిర్మించాలి. కానీ తక్కువ సమయంలో లాభాలకోసం ఆరాటపడకూడదు. ఈ విషయంలో ఇన్వెస్టర్లు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే రిస్క్‌ లేకుండా పెట్టుబడులతో మంచి లాభాలు పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: