Home /News /business /

ARE YOU INVESTING IN GOLD IF YOU DO THIS ALL YOUR MONEY IS GOLD UMG GH

Gold Investments: మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఇలా చేస్తే చాలు.. మీ డబ్బంతా బంగారమే..!

 మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.? ఇలా చేస్తే చాలు.. మీ డబ్బంతా బంగారమే ?

మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.? ఇలా చేస్తే చాలు.. మీ డబ్బంతా బంగారమే ?

షార్ట్ టర్మ్‌లో బంగారం(Gold)లో పెట్టుబడులు పెద్ద ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్(Investment) విషయంలో ఎలాంటి మార్గాలు ఉత్తమ ఫలితాలు అందిస్తాయి, వీటిపై వర్తించే పన్ను వివరాలు, లాభాల గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
మార్కెట్‌(Market)లో అస్థిర పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) విలువలో పెరుగుదల, పతనం ఉంటాయి. అయితే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్రవ్యోల్బణం ఒడిదొడుకులను తట్టుకునేవిగా ఉంటాయి. కానీ షార్ట్ టర్మ్‌లో బంగారంలో పెట్టుబడులు పెద్ద ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎలాంటి మార్గాలు ఉత్తమ ఫలితాలు అందిస్తాయి, వీటిపై వర్తించే పన్ను వివరాలు, లాభాల గురించి తెలుసుకుందాం.

బంగారం ద్రవ్యోల్బణానికి ఎందుకు రక్షణగా ఉంది?
ద్రవ్యోల్బణం అనేది అదనపు కరెన్సీ ముద్రణ ఫలితంగా ఏర్పడవచ్చు. మహమ్మారి సమయంలో US ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌లో మార్పులతో ద్రవ్యోల్బణం తెరపైకి వచ్చింది. భారతదేశంలో మహమ్మారి సమయంలో RBI కూడా ద్రవ్య విధానాన్ని సడలించింది. బంగారం సరఫరా అంతంతమాత్రంగా ఉన్నందున, ఎక్కువ మొత్తంలో డబ్బు బంగారంలో పెట్టుబడులకు వెళ్తే.. దాని ధర పెరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ కరెన్సీలను బంగారు నిల్వలతో అనుసంధానించాయి. బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ దీనిని పరోక్షంగా కొనసాగించింది. అయినప్పటికీ 1971 నుంచి ఫియట్ కరెన్సీలను బంగారానికి మద్దతు లేకుండానే జారీ చేస్తున్నాయి.

బంగారం ప్రతికూలతలు ఏంటి?
బంగారం ఒక డెడ్ అసెట్. స్టాక్స్ మాదిరిగా కాకుండా ఇది వ్యాపారాలకు డబ్బును అందించదు. అలాగే ఆ కంపెనీలు వృద్ధి చెంది లాభాలను ఆర్జించినప్పుడు ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఉండదు. బంగారంపై ఎలాంటి డివిడెండ్‌లు ఉండవు. సావరిన్ గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం చెల్లించే 2.5% మినహా దానిపై ఎలాంటి వడ్డీ కూడా పొందరు. ఇది అధిక రాబడిని ఇవ్వని, స్టాక్ మార్కెట్, ద్రవ్యోల్బణం ప్రభావాలను తట్టుకోగలిగే ఇన్వెస్ట్‌మెంట్. ఉదాహరణకు నిఫ్టీ 2010 నుంచి సుమారు 10.5% CAGRని అందించింది. ఇతే సమయంలో బంగారంపై మాత్రం ఇది 8.2% శాతంగా ఉంది. అయితే బంగారం, స్టాక్‌ల మధ్య తక్కువ కోరిలేషన్.. దీన్ని మంచి డైవర్సిఫైయర్‌గా మారుస్తోంది.

ఫిన్‌టెక్‌లు అందించే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయడం సురక్షితమేనా?
గత 5-7 సంవత్సరాలుగా ఫిన్‌టెక్‌లు డిజిటల్ గోల్డ్ అనే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ అందిస్తున్నాయి. ఇక్కడ కస్టమర్లు పార్ట్నర్ కంపెనీ వాల్ట్‌లలో నిల్వ చేసే బంగారాన్ని యాప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అయితే వీటిపై నియంత్రణలు లేవు. సెబీ క్లాంప్‌డౌన్‌తో గత ఏడాది కాలంలో ఈ వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉదాహరణకు సెబీ నియంత్రణలో ఉన్న స్టాక్ బ్రోకర్లు ఈ ప్రొడక్ట్స్‌ను అందించలేరు. నియంత్రణ లేకపోవడం ఈ ప్రొడక్ట్ రిస్క్‌ను పెంచుతుంది.

ఇదీ చదవండి: Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?


బంగారంలో ఎలా పెట్టుబడి పెడతారు?
బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఫిజికల్ మార్కెట్‌లో ఆభరణాలు లేదా బంగారు నాణేలు, గోల్డ్ బార్‌లను కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ యూనిట్లు, ఎక్స్ఛేంజ్, ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) లేదా గోల్డ్ సేవింగ్స్ ఫండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBలు) కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆప్షన్లలో ప్రతి ఒక్కటి బంగారం ధరతో ముడిపడి ఉంటుంది, కానీ ప్రతి ఒక్కటి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. వినియోగానికి (ఆభరణాలు ధరించాలనుకునే వారు) ఫిజికల్ గోల్డ్, బంగారంతో వ్యాపారం చేయాలనుకునే వారికి ఈటీఎఫ్‌లు మంచివి. 8 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వచ్చే SGBలు మరో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్.భారతదేశంలో బంగారంపై పన్నులు ఎలా ఉంటాయి?
ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే, 3% GST చెల్లించాలి. ఇది SGBలు లేదా ETFలకు వర్తించదు. అయితే లాభానికి బంగారాన్ని విక్రయించినప్పుడు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. మూడేళ్లలోపు వీటిని విక్రయిస్తే ఇది వర్తిస్తుంది. గోల్డ్‌ను కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే, 20% లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ సందర్భంలో మీరు ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని పొందుతారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్‌లకు వర్తిస్తుంది. అయితే ఎనిమిది సంవత్సరాల చివర్లో SGBలు మెచ్యూర్ అయినప్పుడు పొందే లాభాలకు ఇది వర్తించదు. ఈ లాభాలు పన్ను రహితంగా ఉంటాయి.
Published by:Mahesh
First published:

Tags: Cryptocurrency, Gold coins, Inflation, Investments

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు