ARE YOU INVESTING IN CRYPTOCURRENCY KNOW WHERE HOW AND WHAT TO LEARN EVERYTHING ABOUT THESE CRYPTO ASSETS SS
క్రిప్టో అసెట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇంటర్నెట్లో ఎక్కడి నుండి ఏమి చదవాలి
క్రిప్టో అసెట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇంటర్నెట్లో ఎక్కడి నుండి ఏమి చదవాలి
బాగా ఆరితేరిన క్రిప్టో పెట్టుబడిదారులు కూడా కొన్ని సార్లు ప్రస్తుత సాంకేతికత కారణంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రవాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, క్రిప్టో ప్రపంచం గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేసే కొన్ని ఇంటర్నెట్ వనరులను జాబితాను సేకరించాం.
2021లో NFTలు, మెటావర్స్ మరియు బ్లాక్‌చెయిన్ హవాలో ఉండటంతో, ఈ సంవత్సరం అంతా క్రిప్టో అసెట్లదే అని చెప్పడంలో అనుమానమే లేదు. చాలా డేటా అందుబాటులో ఉండటంతో, మీరు ఇప్పుడే క్రిప్టో అసెట్ల రంగంలో అడుగుపెట్టి ఉంటే, ఒక స్థిరమైన అవగాహన రావడం కాస్త కష్టంగా ఉంటుంది. బాగా ఆరితేరిన క్రిప్టో పెట్టుబడిదారులు కూడా కొన్ని సార్లు ప్రస్తుత సాంకేతికత కారణంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రవాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, క్రిప్టో ప్రపంచం గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేసే కొన్ని ఇంటర్నెట్ వనరులను జాబితాను సేకరించాం. అది మీ ముందు ఉంచుతున్నాం.
1 – ZebPay
ZebPay అందించే పాఠ్యాంశాల ప్రత్యేకత ఏమిటంటే, వీటినిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇప్పుడే ప్రారంభించిన వారైనా, లేదా మధ్య స్థాయిలో ఉన్నా లేదా బాగా ఆరితేరిన క్రిప్టో వినియోగదారులైనా సరే, Zebpay లెర్నింగ్ పోర్టల్‌లో మీకు ఖచ్చితంగా విలువైన సమాచారం దొరుకుతుంది. ప్రారంభీకులను ఉద్దేశించిన ప్రాథమిక పాఠాల నుండి పైస్థాయిలో ఉన్న వారి కోసం ధరల ట్రెండ్లు, రూపాయి ధర సగటు విధానాల వరకు ZebPay లెర్నింగ్ విభాగంలో అపార జ్ఞాన సంపద ఉంది.
క్రిప్టో అసెట్ల గురించి తెలుసుకుంటున్నప్పుడు వినియోగదారులకు వినపడే క్రిప్టో స్లాంగ్ కోసం ఒక విభాగం ప్రత్యేకంగా కేటాయించబడింది, అలాగే కాన్సెప్ట్‌లను సులభంగా అర్థం అయ్యేలా చేయడానికి ప్రత్యేక వీడియోలకు కూడా. అంతే కాదు, ఇంగ్లీష్ అర్థం కాని వారి కోసం హిందీ వీడియోలతో Crypto Ki Pathshala అనే విభాగం కూడా ఉంది.
చివరగా, మీరు మీ క్రిప్టో అసెట్ల ప్రయాణాన్ని ZebPay నుండే ప్రారంభించి మీరు ఇప్పుడే సంపాదించిన జ్ఞానాన్ని అద్భుత లాభాలుగా మలచుకోవచ్చు అని చెప్పగలగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీ ZebPay ఖాతాను తెరవడం మర్చిపోవద్దు.
2 – Coinmarketcap –
క్రిప్టో అసెట్ల రంగంలో క్రిప్టో అసెట్లకు సంబంధించి అత్యంత ఎక్కువగా ఆధారపడిన ధర-ట్రాకింగ్ వెబ్‌సైట్‌గా Coinmarket పేరుగాంచింది. మాకు అందిన సమాచారం ప్రకారం, U.S. ప్రభుత్వం కూడా పరిశోధన అలాగే రిపోర్ట్‌ల కోసం CoinMarketCap డేటానే ఉపయోగిస్తుంది. దీనిపై ఎంత వరకు ఆధారపడవచ్చు అంటే, ఇక్కడి సమాచారం ఎప్పుడూ సరైనదే ఉంటుంది అనడంలో సందేహం లేదు. Coinmarketcap బ్లాగ్‌ను అలెగ్జాండ్రియా అంటారు, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచురించబడిన పుస్తకాలలో దాదాపు అన్నీ దొరికే ఒకనాటి గ్రంథాలయం స్థాయికి ఇది చేరుకోవాలి అనుకుంటుంది. వారి ధ్యేయం “వీలైతే క్రిప్టో అసెట్ల గురించి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్త సమాచారాన్ని సేకరించడం.”
3 – Coingecko –
చూసిన వెంటనే Coingecko కాస్త భయపెట్టవచ్చు కానీ, మీరు దానిలో ఎంత అన్వేషిస్తే మీకు క్రిప్టో మార్కెట్‌కు సంబంధించి అంత ఎక్కువ సమాచారం దొరుకుంది. మీరు ప్రారంభంలోనే 10,000కు పైగా కాయిన్ల గురించి సమాచారం పొందవచ్చు! అంతే కాదు, Coingecko బ్లాగ్, పాడ్‌క్యాస్ట్ మరియు పుస్తకాలలో NFTల నుండి DeFi, Bitcoin వరకు అపార సమాచారం ఉంది.
4 – Ethereum బ్లాగ్ –
Ethereum బాగా ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ, అలాగే ప్రస్తుతం NFTలకు ఉన్న క్రేజ్‌కు చాలా వరకు కారణం Ethereum. క్రిప్టోలో రాబోతున్న మార్పులకు అనుగుణంగా ఉండటానికి ఇది తన సాంకేతికతను కూడా వృద్ధి చేసుకుంటోంది. Ethereum గురించి, దాని కాయిన్ Etherపై పెట్టుబడి పెట్టడం సరైనేదా అనే విషయం నుండి సహ-వ్యవస్థాపకులు విటాలిక్బుటెరిన్ ఆలోచనలు తెలుసుకోవడం వరకు ఏమి కావాలి అన్నా, Ethereum బ్లాగ్‌ను ఫాలో అవ్వడం మర్చిపోకండి.
5 – Cardano –
2022లో భారీ స్థాయిలో పెరిగే సామర్థ్యం ఉన్న స్టేక్ బ్లాక్‌చెయిన్‌కు నిదర్శనం అయిన Cardanoకు క్రిప్టో అసెట్ల ప్రపంచంలో భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న దీర్ఘ-కాలిక సమస్యలకు తమ వద్ద ఉన్న పరిశోధన-ఆధారిత పరిష్కారాలు గర్వకారణం. Web3 మరియు బ్లాక్‌చెయిన్‌కు సంబంధించి ప్రతీ సమచారాన్ని తెలుసుకోవడంలో ముందంజలో ఉండాలని ఎవరైనా కోరుకుంటే, Cardano బ్లాగ్ అలాగే ఫోరమ్ పేజీలను అనుసరించడం తప్పనిసరి.
6 – Solana –
Solana బాగా ప్రజాదరణ పొందిన altcoinలలో ఒకటి, దీనికి ఇంకా పై స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిని స్వీయ నిర్వచనం It describes itself as the ‘ప్రపంచంలో వేగవంతమైన బ్లాక్‌చెయిన్ అలాగే DeFi, NFTలు, Web3 మరియు మరిన్ని విషయాలలో 400కు పైగా ప్రాజెక్ట్‌లతో అత్యంత వేగంగా పెరుగుతున్న క్రిప్టో ఎకోసిస్టమ్’, రాబోయే రోజులలో ఇది స్థిరంగా దూసుకుపోతుంది. ఈ అంశాలు, ప్రత్యేకించి Solana గురించి తెలుసుకోవాలి అంటే, మరింత సమాచారం కోసం వారి బ్లాగ్ చూడండి.
7 – పుస్తకాలు మరియు పాడ్‌క్యాస్ట్‌లు –
చివరగా, క్రిప్టోకరెన్సీల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆండ్రియాస్ ఆన్టోనోపోలో పుస్తకాలు ‘ద ఇంటర్నెట్ ఆఫ్ మనీ’ మరియు ‘మాస్టరింగ్ బిట్‌కాయిన్’ అలాగే జాక్ టాటర్, క్రిస్ బర్న్స్‌కి కలిపి అందించిన ‘క్రిప్టోఅసెట్స్’ చదవడం మరచిపోద్దు. మీ అవగాహనను మరింత పెంచుకోవడానికి ప్యాట్రిక్ ఓ’షాగ్నెస్సీ అందిస్తున్న ఇన్వెస్ట్ లైక్ ద బెస్ట్ అలాగే లారా షిన్ యొక్క అన్‌చెయిన్డ్ పాడ్‌క్యాస్ట్‌లు మీకు బాగా ఉపయోగపడతాయి.
ఇదే – మేము మీకు అందించాలనుకున్న పూర్తి జాబితా. ఇది మరింత విశ్వాసం, ధైర్యంతో క్రిప్టో అసెట్ల రంగంలో దూసుకుపోవడానికి ఉపయోగపడతాయి. మరింతగా వృద్ధి చెందుతున్న సాంకేతికతలైన క్రిప్టోలకు ఇవి కేవలం ప్రారంభం మాత్రమే. తాజా సమాచారాన్ని వీలైనంత త్వరగా ZebPay అందిస్తున్న వనరుల వంటి ద్వారా తెలుసుకుంటూ ఉండండి.
క్రిప్టో అసెట్ల గురించి నేర్చుకోవడం మీ 2022 తీర్మానాలలో ఒకటి అయితే, మీరు ధైర్యంగా అది పూర్తయ్యింది అని అనుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.