Investment in bonds: బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారా...ఈ వివరాలు తెలుసుకోండి...

(ప్రతీకాత్మక చిత్రం)

బాండ్ల గురించి సింపుల్ గా చెప్పాలంటే.. అవి వాటిని తయారుచేసిన లేదా అమ్మిన వ్యక్తి కొన్నవారి దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారని చెప్పే పత్రం. ఈ బాండ్లను విడుదల (ఇష్యూ) చేసే వ్యక్తి వాటిని కొని తన దగ్గర ఉంచుకునే వ్యక్తికి ఒక ఫిక్స్డ్ మొత్తాన్ని వడ్డీ రూపంలో అందిస్తారు.

  • Share this:
స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం చాలా నిలకడ లేకుండా ఉన్నాయి. తరచూ నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు చాలామంది వెనుకాడుతున్నారు. నిపుణులు కూడా డెబిట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టమని సలహా ఇస్తున్నారు. అసలు డెబిట్ ఫండ్లు లేదా బాండ్స్ అంటే ఏంటి? వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.

బాండ్లంటే ఏంటంటే..

బాండ్ల గురించి సింపుల్ గా చెప్పాలంటే.. అవి వాటిని తయారుచేసిన లేదా అమ్మిన వ్యక్తి కొన్నవారి దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారని చెప్పే పత్రం. ఈ బాండ్లను విడుదల (ఇష్యూ) చేసే వ్యక్తి వాటిని కొని తన దగ్గర ఉంచుకునే వ్యక్తికి ఒక ఫిక్స్డ్ మొత్తాన్ని వడ్డీ రూపంలో అందిస్తారు. దీన్ని ఇంట్రస్ట్ రేట్ లేదా కూపన్ రేట్ అంటారు. బాండ్లను ప్రభుత్వం ఎక్కువగా విడుదల చేస్తుంటుంది. అయితే ప్రైవేట్ సంస్థలు కూడా వీటిని విడుదల చేస్తుంటాయి. ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ ఫండ్లను విడుదల చేస్తుంటుంది. ప్రైవేట్ సంస్థలు కూడా ఫండింగ్ అవసరమైనప్పుడు విడుదల చేస్తుంటాయి.

రీటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి బాండ్లు కొనొచ్చు?

సాధారణంగా ఇన్వెస్టర్లు కార్పొరేట్ లేదా ప్రభుత్వ బాండ్లు రెండు కొనుగోలు చేసే వీలుంటుంది. గతంలో బ్యాంకుల ద్వారా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే వీలుండేది. తాజాగా వీటిని కూడా ఆన్ లైన్ లో కొనే అవకాశాన్ని అందించింది ఆర్ బీఐ. కార్బొరేట్ బాండ్లు కూడా బ్యాంకుల్లో లేదా బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంటుంది. చాలామంది డెబిట్ మ్యూచువల్ ఫండ్లను తీసుకొని వీటిలోకి అడుగుపెడతారు. ప్రపంచవ్యాప్తంగా డెబిట్ మార్కెట్లు ఈక్విటీ మార్కెట్ కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. అయితే వీటిలో లాభాలు ఈక్విటీ మార్కెట్ తో పోల్చితే తక్కువగానే ఉంటాయి. బాండ్ వల్ల లాభాలు బాండ్ మార్కెట్ ని ప్రభావితం చేస్తాయి. బాండ్ల వల్ల వచ్చే లాభాలు తగ్గినప్పుడు ఇన్వెస్టర్ వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అలా అందరూ అమ్మడానికి ప్రయత్నిస్తే బాండ్ల విలువ తగ్గుతుంది.



బాండ్ వల్ల వచ్చే లాభాలు పెరిగితే అందరూ వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. తద్వారా విలువ పెరుగుతుంది.
Published by:Krishna Adithya
First published: