హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Bunk Frauds: బేసి సంఖ్యల్లో డీజిల్, పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ బంకుల్లో మోసం చేయలేరా..? నిజం తెలుసుకోండి..

Petrol Bunk Frauds: బేసి సంఖ్యల్లో డీజిల్, పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ బంకుల్లో మోసం చేయలేరా..? నిజం తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Petrol Bunk Frauds: చాలామంది పెట్రోల్ బంకుల్లో రౌండ్ ఫిగర్ అమౌంట్స్‌లో కాకుండా రూ.125, రూ.155, రూ.227 తదితర మొత్తాల్లో డీజిల్, పెట్రోల్ కొట్టిస్తున్నారు. దీనివల్ల మోసాలు చేసే అవకాశం ఉండదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది నిజం కాదు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పెట్రోల్ బంక్స్‌లో (Petrol Bunks) మోసాలు (Frauds) బయటపడటం కొత్తేం కాదు. పెట్రోల్ ఫిల్లింగ్ రీడింగ్ చాలా శ్రద్ధగా గమనించకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రజలు గమనించలేని పద్ధతిలో డబ్బుకి సరిపడా పెట్రోల్/డీజిల్ నింపకుండా తక్కువగా కొట్టే మోసాలు కూడా జరుగుతున్నాయి. అందుకే చాలామంది వంద, రెండొందలు, ఐదు వందలు.. ఇలా రౌండ్ ఫిగర్ అమౌంట్స్‌లో కాకుండా రూ.125, రూ.155, రూ.227 తదితర మొత్తాల్లో డీజిల్, పెట్రోల్ కొట్టిస్తున్నారు. దీనివల్ల మోసాలు చేసే అవకాశం ఉండదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇది నిజం కాదు.

కొన్ని ఫ్యూయల్ స్టేషన్లలో మీటర్లను మార్చి బురిడీ కొట్టించవచ్చు. ఇలాంటి మీటర్ల మోసం నుంచి తప్పించుకోవడానికి మీరు కూడా బేసి సంఖ్యల మొత్తంలో ఫ్యూయల్ ఫీల్ చేయించుకుంటుంటే ఒకసారి మీరు ఇది వినాలి. లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఇలా చేయడం వల్ల మోసాల నుంచి తప్పించుకోవచ్చని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు.

రూ.100, రూ.200 వంటి రౌండ్ ఫిగర్స్‌లో కాకుండా వేరే మొత్తాల్లో పెట్రోల్ రీఫిల్ చేయించుకుంటే మీటర్స్ అనేవి మానుప్యులేట్ కాలేవని నమ్మటం నిజంగా అవివేకమే అవుతుంది. ఈ నిరాధార సిద్ధాంతాన్ని ప్రచారం చేసే వ్యక్తులకు పెట్రోల్ పంపు పంపిణీ వ్యవస్థపై అసలు ఏ అవగాహన లేదని చెప్పొచ్చు.

* అసలు స్టాండర్డ్స్ ఇవే..

మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ ప్రకారం, పెట్రోల్ పంపు వద్ద ఉన్న ప్రతి నాజిల్‌కు ఒక మీటరింగ్ యూనిట్ ఉంటుంది. ఈ యూనిట్‌ను ఫ్యూయల్ సరఫరా చేసే చమురు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో దాని అధికారులు కాలిబర్ చేస్తారు. ఆపై సీలు చేసి ఉంచుతారు. ఇక్కడ కాలిబర్ అంటే మీటర్ అనేది చూపించిన రీడింగ్స్ ప్రకారం కచ్చితమైన ఫ్యూయల్ డిస్పెన్స్‌ చేస్తుందా లేదా అని చెక్ చేసే ప్రక్రియ.

సాధారణంగా పెట్రోల్ బంక్స్‌లో అయిదు లీటర్ల కోసం కాలిబ్రేషన్ (Calibration) జరుగుతుంది. దీనర్థం డిస్పెన్సర్ ఐదు లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌ను 30 సెకన్లలో పంపిణీ చేయడానికి కాలిబ్రేట్ చేస్తారు. ఇది ఒక నిమిషంలో 10 లీటర్ల ఫ్యూయల్ బయటికి పంపుతుంది. కాలిబ్రేషన్ చేసిన తర్వాత మోసాలకు ఆస్కారం ఉండదు.

ఇది కూడా చదవండి : మార్కెట్లోకి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కేవలం రూ.40 వేల ప్రారంభ ధరతో.. ఓ లుక్కేయండి

* మోసాలకు చెక్ పెట్టగలమా?

అయితే రూ.100 వంటి రౌండ్ ఫిగర్లకు మెషిన్‌ను తక్కువ/ఎక్కువ డెలివరీ కోసం అడ్జస్ట్ చేయడం సాధ్యం కాదని బంక్ యాజమానులు చెబుతున్నారు. మోసం జరిగే చోట రూ.110 లేదా రూ.125 వంటి మొత్తాలకు సరైన వాల్యూమ్‌లో పెట్రోల్ లేదా డీజిల్ పంపిణీ అవుతుందని చెప్పడానికి శాస్త్రీయ లేదా సాంకేతిక ఆధారాలు లేవని బంక్‌ యజమానులతో పాటు మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. పెట్రోల్ పంపిణీ అనేది సింపుల్ సూత్రంపై పనిచేస్తుందని.. మీటర్‌ను 30 సెకన్లకు ఐదు లీటర్లకు కాలిబ్రేట్ చేసి ఉంటే, ఒక లీటర్ వాల్యూమ్‌ అనేది ఐదవ వంతు టైమ్‌లో పంపిణీ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఒకవేళ మీటర్ మెషిన్ అనేది రాంగ్ వాల్యూమ్ కోసం కాలిబర్ చేస్తే మోసపోయే అవకాశం ఉంది. లీగల్ మెట్రాలజీ, ఆయిల్ కంపెనీ, పంప్‌ల అధికారులు, వాటాదారులందరూ కలిసి ఫ్యూయల్ ఎలా పంపిణీ అవ్వాలో నిర్ణయిస్తారు కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాని మోసం. కానీ ఈ మోసాలు జరగవు అని కచ్చితంగా చెప్పలేం. ఈ మోసాలు జరిగేలా మెషిన్ అనేది ట్వీక్ చేస్తే రౌండ్ ఫిగర్స్ లేదా బేసి సంఖ్యలు అయినా అన్ని మొత్తాలకు తక్కువ ఫ్యూయల్ డెలివరీ జరుగుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Diesel price, Petrol Price, Petrol pump