హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Intimation Notice: మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్ నోటీస్ వచ్చిందా..? దాంట్లో ఏమేం చెక్ చేయాలో చూడండి..

Tax Intimation Notice: మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్ నోటీస్ వచ్చిందా..? దాంట్లో ఏమేం చెక్ చేయాలో చూడండి..

Tax Intimation Notice

Tax Intimation Notice

Tax Intimation Notice: ITR ప్రాసెస్ చేసిన తర్వాత IT విభాగం సెక్షన్ 143(1) కింద ఆ సమాచారాన్ని ట్యాక్స్ పేయర్‌కు పంపుతుంది. అయితే ITR ప్రాసెసింగ్ సమయంలో పన్ను శాఖ ప్రాథమిక వివరాలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ విషయంలో ఏవైనా ఇతర సమస్యలు ఉంటే, తదుపరి సమాచారం కోసం భవిష్యత్తులో వేరొక సెక్షన్ కింద ఆదాయ పన్ను నోటీసును పంపవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

2021-22 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 2022 జులై 31తో ముగిసింది. ఆదాయ పన్ను (Income tax) నిబంధనల ప్రకారం, ITR దాఖలు చేసిన ఆర్థిక సంవత్సరం (Finanicial Year) ముగిసిన 9 నెలలలోపు ఆదాయ పన్ను శాఖ ట్యాక్స్ పేయర్స్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంటిమేషన్ నోటీస్ (Tax Intimation Notice) పంపాలి. ITRను ప్రాసెస్ చేసే సమయంలో ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ అర్థెమెటికల్ ఎర్రర్స్, ఇంటర్నల్ ఇన్‌కన్సిస్టెన్సీ, ట్యాక్స్ అండ్ ఇంట్రస్ట్ క్యాలిక్యులేషన్.. వంటి వాటిని తనిఖీ చేసి, ధ్రువీకరిస్తుంది. ITR ప్రాసెస్ చేసిన తర్వాత IT విభాగం సెక్షన్ 143(1) కింద ఆ సమాచారాన్ని ట్యాక్స్ పేయర్‌కు పంపుతుంది. అయితే ITR ప్రాసెసింగ్ సమయంలో పన్ను శాఖ ప్రాథమిక వివరాలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ విషయంలో ఏవైనా ఇతర సమస్యలు ఉంటే, తదుపరి సమాచారం కోసం భవిష్యత్తులో వేరొక సెక్షన్ కింద ఆదాయ పన్ను నోటీసును పంపవచ్చు.

* ఇంటిమేషన్ నోటీసులో ఏముంటుంది?

- మీ ఆదాయ వివరాలు, క్లెయిమ్ చేసిన డిడక్షన్స్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ వంటివి పన్ను శాఖ అసెస్‌మెంట్‌లు, లెక్కలతో సరిపోలుతున్నా లేదా అనే వివరాలు ఉంటాయి.

- ఎడిషనల్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్

మీ ఆదాయ పన్ను రిటర్న్‌లో నిర్దిష్ట ఆదాయాన్ని పేర్కొనడం మానేసినా లేదా డిడక్షన్స్ తప్పుగా క్లెయిమ్ చేసినా లేదా పన్నును తప్పుగా లెక్కించినా.. మీరు చెల్లించాల్సిన అదనపు పన్ను వివరాలను ఐటీ డిపార్ట్‌మెంట్ పంపిస్తుంది.

- ఇనకమ్ ట్యాక్స్ రిఫండ్

ఆదాయ పన్ను శాఖ అంచనా ప్రకారం మీరు చెల్లించాల్సిన మొత్తం కంటే అదనంగా పన్ను చెల్లిస్తే.. ఆ సందర్భంలో అదనపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ అవుతున్నట్లు పేర్కొంటూ నోటీసు పంపుతుంది.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచి స్టార్ట్ చేసే క్రియేటివ్ బిజినెస్ ఐడియా.. వేలల్లో లాభాలు..

* నోటీస్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్

ఇంటిమేషన్ నోటీస్ అనేది ఒక పాస్‌వర్డ్-ప్రొటెక్టెడ్ ఫైల్. మీరు అందుకున్న నోటీసును ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్.. మీ PAN నంబర్ స్మాల్ లెటర్స్, మీ పుట్టిన తేదీ. ఉదాహరణకు, మీ పాన్ నంబర్ AAAAA0000A, పుట్టిన తేదీ 1990 మార్చి 1 (1-03-1991) అయితే, డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ aaaaa0000a1031990 అవుతుంది.

* ట్యాక్స్ ఇంటిమేషన్ నోటీసును ఎలా చదవాలి?

ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, అడ్రస్, పాన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు సరైనవా కాదా చెక్ చేయండి. ఆ తర్వాత ITRలో మీరు ఇచ్చిన ఆదాయ పన్ను వివరాలు.. డిపార్ట్‌మెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్‌తో మ్యాచ్ అయ్యాయో లేదో చూడంది. ఆదాయ పన్ను శాఖ ప్రతి కాలమ్‌లో ప్రత్యేకంగా ఈ వివరాలను పోలుస్తూ ఒక టేబుల్‌ను అందిస్తుంది. ఆదాయ వివరాలతో పాటు ITRలో మీరు క్లెయిమ్ చేసిన ట్యాక్స్ సేవింగ్ డీ-డడక్షన్‌ల వివరాలను కూడా ఇంటిమేషన్ నోటీస్ పేర్కొంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income, Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు