హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి

EPFO complaint portal | ఈపీఎఫ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారా? క్లెయిమ్‌లో ఏవైనా సమస్యలు ఉంటే ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.

EPFO complaint portal | ఈపీఎఫ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారా? క్లెయిమ్‌లో ఏవైనా సమస్యలు ఉంటే ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.

EPFO complaint portal | ఈపీఎఫ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారా? క్లెయిమ్‌లో ఏవైనా సమస్యలు ఉంటే ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.

  కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీ ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 75 శాతం లేదా, మూడు నెలల బెసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే 4 లక్షల క్లెయిమ్స్ వచ్చాయి. వాటిలో 1.37 లక్షల క్లెయిమ్స్ ప్రాసెస్ అయ్యాయి. అయితే పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడంలో ఖాతాదారులు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేయడంలో సమస్యలు వచ్చినా, అప్లై చేసినా డబ్బులు అకౌంట్‌లోకి రాకపోయినా https://epfigms.gov.in/ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు. పీఎఫ్ ఖాతాదారుల ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ రూపొందించిన ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో ఫిర్యాదు చేస్తే నేరుగా సంబంధిత అధికారుల దగ్గరకు మీ కంప్లైంట్ వెళ్తుంది. మీ ఫిర్యాదును ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.

  EPF Complaint: కంప్లైంట్ చేయండి ఇలా...


  ముందుగా https://epfigms.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

  హోమ్ పేజీలో Register Grievance పైన క్లిక్ చేయాలి.

  PF Member, EPS Pensioner, Employer, Others ఆప్షన్‌లో మీ ఆప్షన్ ఎంచుకోవాలి.

  మీ యూఏఎన్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.

  Get OTP పైన క్లిక్ చేయాలి.

  మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

  ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

  ఆ తర్వాత మీ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి.

  మీ సమస్యను వివరించాలి.

  ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అప్‌లోడ్ చేయాలి.

  చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది.

  కంప్లైంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడీకి, మొబైల్ నెంబర్‌కు వస్తుంది.

  EPF Complaint: కంప్లైంట్ స్టేటస్ చెక్ చేయండి ఇలా...


  మీ కంప్లైంట్ స్టేటస్‌ని చెక్ చేసేందుకు https://epfigms.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

  View Status ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

  మీ రిజిస్ట్రేషన్ నెంబర్, కంప్లైంట్ నెంబర్, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.

  సబ్మిట్ చేసి మీ కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

  ఇవి కూడా చదవండి:

  PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే

  EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

  Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

  First published:

  Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance

  ఉత్తమ కథలు