కొత్తగా ఉద్యోగాల్లో చేరి సంపాదించడం మొదలు పెట్టిన చాలా మందిలో ఆర్థిక అక్షరాస్యత(Financial Literacy) కనిపించదు. దీంతో దీర్ఘకాలిక సంపద సృష్టి గురించి వారికి అవగాహన ఉండదు. జీవితం(Life)లోని ప్రారంభ సంవత్సరాల్లో తక్కువ జీతాలు అందుతున్నప్పుడు ఎక్కువ మంది దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించరు. లైఫ్ స్టైల్(Life Style), ఇనకమ్ అప్‌గ్రేడ్స్‌పై దృష్టి పెడతారు. అయితే సంపాదించడం మొదలుపెట్టిన సంవత్సరాలలో చేసిన పెట్టుబడులు ఫైనాన్షియల్ హెల్త్‌పై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి సంపదను సృష్టించే మార్గాల గురించి తెలుసుకోండి.
ఫైనాన్షియల్ ప్లాన్ సిద్ధం చేయండి
ఫైనాన్షియల్ ప్లాన్ అనేది వివిధ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన మనీ మేనేజ్‌మెంట్. ఇనకమ్ ఫ్లో, ఇన్వెస్ట్‌మెంట్ హోరిజోన్, రిస్క్ ఆధారంగా మనీ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లాన్(Plan) పెట్టుబడులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడంలో సహాయపడుతుంది. ప్రతి ఆర్థిక లక్ష్యానికి అవసరమైన మొత్తాలు, ఊహించిన రాబడి, లక్ష్యాన్ని సాధించడానికి మిగిలి ఉన్న సమయం, ద్రవ్యోల్బణం రేటును అంచనా వేయడం ద్వారా ఫైనాన్షియల్ ప్లాన్ రూపొందించే ప్రక్రియను ప్రారంభించాలి. ఆ తర్వాత ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అవసరమైన నెలవారీ మొత్తాన్ని ఆన్‌లైన్ రిసోర్సెస్ ఉపయోగించి లెక్కించాలి.
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీలు
చాలా మంది సంపాదించడం మొదలుపెట్టిన ప్రారంభంలో దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీలకు దూరంగా ఉంటారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్(Savings) సర్టిఫికెట్‌ల వంటి స్థిర ఆదాయ సాధనాలను ఇష్టపడతారు. స్థిర ఆదాయ సాధనాల ద్వారా వచ్చే రాబడి రేటు చాలా అరుదుగా ద్రవ్యోల్బణ రేట్లను అధిగమిస్తుంది. యువత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి ఈక్విటీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించాలి. ఈ ఫండ్‌లు ప్రొఫెషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కలయికను, చాలా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ స్థాయి వైవిధ్యతను అందిస్తాయి.
ఐదేళ్ల తర్వాత మెచ్యూర్ అయ్యే ఏదైనా ఆర్థిక లక్ష్యం కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. స్వల్పకాలంలో ఈక్విటీలు చాలా అస్థిరతను కలిగి ఉంటాయి కాబట్టి, ఐదేళ్లలోపు మెచ్యూర్ అయ్యే లక్ష్యాల కోసం అధిక-దిగుబడిని ఇచ్చే బ్యాంక్ FDలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
SIPల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్
ముందుగా పెట్టుబడి ప్రారంభిస్తే, ఎక్కువ సమయం పెట్టుబడులు పెరుగుతాయి. ఇవి కాంపౌండ్ ప్రయోజనం పొందుతాయి. ఇది చాలా తక్కువ పెట్టుబడితో పెద్ద ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించుకోవడం కోసం కొత్తగా సంపాదిస్తున్నవారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) మోడ్‌ను ఎంచుకోవాలి. షేర్ ధరలు క్షీణించినప్పుడు, మరిన్ని యూనిట్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఇది సమయానుకూల పెట్టుబడులు, మార్కెట్లను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.
టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయడానికి ప్రాథమిక కారణం పాలసీదారు అకాల మరణానికి గురైనప్పుడు వారిపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఆదాయాన్ని అందించడం. లైఫ్ కవర్ ఒకరి సగటు వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండాలి. అయినప్పటికీ చాలా మంది యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (ULIP), మనీబ్యాక్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇవి సరిపడని లైఫ్ కవర్‌ను అందిస్తాయి. సబ్-ఆప్టిమల్ రిటర్న్‌లను అందిస్తాయి. బదులుగా, కొత్తగా సంపాదించడం మొదలు పెట్టిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి పెట్టుబడిని వేరు చేయాలి. లైఫ్ కవర్ కోసం టర్మ్ పాలసీలను కొనుగోలు చేయాలి. సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలి. టర్మ్ పాలసీలు చాలా తక్కువ ప్రీమియంతో పెద్ద లైఫ్ కవర్‌ను అందిస్తాయి. హాస్పిటలైజేషన్, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుంచి వచ్చే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి తగిన రక్షణతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా కొనుగోలు చేయాలి.
అత్యవసర నిధి
కొత్తగా సంపాదించేవారు ఉద్యోగ నష్టం, వైకల్యాలు, అనారోగ్యం లేదా ఇతర ఊహించలేని ప్రతికూల జీవిత సంఘటనల నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక అవసరాలను ఎదుర్కోవడానికి తగిన ఎమర్జెన్సీ ఫండ్‌ను నిర్వహించాలి. తగిన ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే, కీలకమైన ఆర్థిక లక్ష్యాల కోసం చేసిన పెట్టుబడులను రద్దు చేయవలసి వస్తుంది. లేదా ఆర్థిక అవసరాలను ఎదుర్కోవటానికి అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవలసి వస్తుంది. ఇది దీర్ఘకాలిక సంపద సృష్టి లక్ష్యాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రోజువారీ జీవన వ్యయాలు, యుటిలిటీ బిల్లులు, EMIలు, SIPలు, బీమా ప్రీమియం, అద్దె, పిల్లల విద్యా అవసరాలు వంటి వాటిని కనీసం ఆరు నెలల పాటు తీర్చగలిగేంత పెద్ద ఎమర్జెన్సీ ఫండ్‌లను సంపాదించడం యువకులు లక్ష్యంగా పెట్టుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earn money, Fixed deposits, Investment Plans, Life Insurance